For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో ప్యాచ్ స్కిన్ నివారించడానికి శెనగపిండితో ఫేస్ ప్యాక్

By Super Admin
|

తెల్లగా ఉన్న ముఖంలో నల్లగా ప్యాచ్ లు కనబడితే ఎలా ఉంటుంది. అలాగే నల్లగా ఉన్న ముఖంలో అక్కడక్కడా తెల్ల మచ్చలు కనబడితే ఎలా ఉంటుంది? ముఖంలో ప్యాచ్ లున్నట్లైతే అసహ్యంగా ఉంటుంది. ఈ ప్యాచ్ లు స్కిన్ పిగ్మెంటేషన్ కారణంగా ఏర్పడుతాయి. చర్మంలో పిగ్మెంట్ కు కారణమయ్యే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ కు గురి అవుతుంది. ఈ పిగ్మెంట్ (ప్యాచ్ ) స్కిన్ నివారించుకోవడానికి ఫేస్ ప్యాక్ రియల్ గా సహాయపడుతుంది.

అటువంటి ఫేస్ ప్యాక్ లో బేసన్(శెనగపిండి) ఫేస్ ప్యాక్ ఒకటి. స్కిన్ ప్యాచ్ అంటే చర్మంలో బ్రౌన్ లేదా బ్లాక్ ప్యాచెస్ ఏర్పడుతాయి. కొందరిలో స్పాట్స్ కు కారణమవుతుంది. ఇది మొటిమలు, సన్ డ్యామేజ్ కు కారణమవుతుంది. ఎక్కువగా వయస్సు పైబడ్డవారిలో ఇలా ఎక్కువ కనబడుతుంది. ఇది అసహ్యంగా కనిపించినా, పూర్తిగా సహజంగానే ఉంటుంది .

Amazing DIY Besan Face Pack For Patchy Skin

ఈ ప్యాచ్ లను కప్పి పుచ్చడానికి ఎన్ని ఫౌడేషన్స్ కొన్ని ఉపయోగించడం మాత్రం చాలా కష్టం. ముఖంలో వివిధ బాగాల్లో వివిధ షేడ్స్ లో ఉన్నట్లైతే ...డార్క్ ప్రేదేశాల్లో లైట్ షేడ్స్ ఉపయోగించడం, లైట్ గా ఉన్న చోట డార్క్ షేడ్స్ ఉపయోగించడం చాలా కష్టం. ఇలా చేయడం వల్ల పరిస్థితి మరింత వరెస్ట్ గా తయారవుతుంది.

Amazing DIY Besan Face Pack For Patchy Skin

మరి ప్యాచ్ స్కిన్ నివారించుకోవడానికి ఏం చేయాలి?హోం రెమెడీస్ ఉపయోగిపడుతాయా? ఖచ్చితంగా అవుననే అంటున్నారు, సౌందర్య నిపుణులు. ప్యాచ్ లు మాయం చేయడం మాత్రమే కాదు, హోం మేడ్ ప్యాక్ లు స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తాయి.

స్కిన్ ప్యాచ్ నివారించుకోవడానికి క్రింది సూచించిన హోం రెమెడీ తయారుచేసుకోవడం సులభం మరియు సురక్షితమైనది ? ఇది చౌకైనది కూడా..!

ఈ బేసన్ ఫేస్ ప్యాక్ ను మనం ఇంట్లోనే స్వయంగా ఎలా తయారుచేసుకోవాలి..కావల్సినపదార్థాలేంటి.. తెలుసుకుందాం..

Amazing DIY Besan Face Pack For Patchy Skin

కావల్సినవి:

శెనగపిండి: 1టేబుల్ స్పూన్

పసుపు: 1/2టీస్పూన్

తేనె: 1 టీస్పూన్

పెరుగు: 1 టీస్పూన్

Amazing DIY Besan Face Pack For Patchy Skin

ఫేస్ ప్యాక్ వేసుకునే విధంగా :

ఒక బౌల్ తీసుకుని అందులో పైన సూచించిన పదార్థాలన్నింటిని మిక్స్ చేయాలి. మెత్తగా ఫేస్ ప్యాక్ తయారయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి.

ఫ్లాట్ బ్రెస్ తో దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డార్క్ ప్యాచెస్ ను లైట్ గా మార్చేస్తుంది.

పసుపులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి డార్క్ స్పాట్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

తేనె నేచురల్ హుమక్టెంట్ , జెంటిల్ ఎక్సఫ్లోయేట్ . పెరుగు చర్మాన్ని కూల్ గా మార్చుతుంది. స్కిన్ కు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది. అందువల్ల ఈ మూడింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ ఒక మంచి నేచురల్ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు..

English summary

Amazing DIY Besan Face Pack For Patchy Skin

A patchy skin tone can be quite irritating. It would mean different shades of skin on different parts of your face. This happens due to pigmentation. Pigmentation happens when the skin starts over-producing its pigment called melanin. In such cases, DIY homemade face packs for patchy skin can really help!
Story first published:Wednesday, September 14, 2016, 16:55 [IST]
Desktop Bottom Promotion