For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చర్మం నివారించే ఆయుర్వేద రెమిడీస్

By Staff
|

జిడ్డు చర్మం అత్యంత అవాంఛనీయ చర్మ రకాలలో ఒకటి. జిడ్డు చర్మాన్ని ఎదుర్కోవటం అంత సులభం కాదు. చర్మంపై ఎక్కువగా నూనె ఉండుట వలన మొటిమలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటివి వస్తాయి. దాంతో చర్మం చికాకుగా మారుతుంది.

జిడ్డు చర్మ టోన్ ఉన్నవారి చర్మ రంద్రాలు అసహ్యకరంగా మరియు జిగటగా ఉండి చర్మం మెరుస్తూ ఉంటుంది. మరోవైపు జిడ్డు చర్మం వారికీ వృద్దాప్య ఛాయలు తొందరగా వస్తాయి.

అందువల్ల జిడ్డు చర్మం ఉన్నవారు నూనెను తగ్గించుకోవటానికి సరైన శ్రద్ద పెట్టాలి. ప్రతి రోజు అనేక సార్లు ముఖం కడగటం,చక్కెర పదార్ధాలను తగ్గించటం, ఆహారంలో పండ్లు,కూరగాయలు తీసుకోవటం, మాంసకృత్తులు సమృద్దిగా ఉండే ఆహారాలను తీసుకుంటే చర్మంలో నూనెను తగ్గించవచ్చు.

చర్మంలో ఎక్కువగా ఉన్న నూనెను తొలగించటానికి కొన్ని ఆయుర్వేద మందులు మరియు నివారణలు ఉన్నాయి. వీటిని తరచుగా ఉపయోగిస్తే మోటిమలు మరియు వైట్ హెడ్స్ తగ్గుతాయి.

అందువలన, ఈ వ్యాసం లో, Boldsky జిడ్డు చర్మం కోసం కొన్ని ఆయుర్వేద మందుల గురించి తెలియజేస్తుంది. ఆ వివరాలను తెలుసుకోవటానికి ఈ వ్యాసాన్ని చదవండి.

పాలలో ఉండే నయం చేసే లక్షణాలు ఎటువంటి చర్మ సమస్యను అయిన పరిష్కరిస్తాయి. పాలలో ఒక కాటన్ బాల్ ముంచి చర్మంపై రాయాలి. నిమ్మకాయ కూడా అదనపు ప్రక్షాళన ప్రభావంలో సహాయపడుతుంది.

ఆరెంజ్

ఆరెంజ్

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక బౌల్ లో ఆరెంజ్ రసాన్ని తీసి ముఖానికి రాయాలి. కొంతసేపు మసాజ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గంధం, పసుపు

గంధం, పసుపు

చందనం, పసుపు మిశ్రమం చర్మంపై నూనెను వదిలించుకోవటానికి మరొక సమర్థవంతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. రెండింటిని సమాన పరిమాణంలో తీసుకోని పేస్ట్ చేసి ముఖానికి రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

కలబంద

కలబంద

కలబంద చర్మంలో నూనెను తగ్గించటానికి ఒక సమర్ధవంతమైన మూలిక అని చెప్పవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మఖం మీద కలబంద జెల్ ని రాసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి.

వేప

వేప

వేప జిడ్డు చర్మం మరియు జిడ్డు జుట్టు రెండింటి చికిత్సలో సహాయపడుతుంది. వేప పేస్ట్ ని చర్మానికి రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇది చర్మంపై అదనపు నూనెను తీసివేయటానికి సహాయపడుతుంది. అలాగే మొటిమల రూపాన్ని నిరోధిస్తుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ చర్మం మీద అధికంగా ఉన్న నునెను తొలగించటంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్ తో ముఖాన్ని తుడవాలి. ముఖం మీద ఉన్న అదనపు నూనెను తొలగించటమే కాకుండా చల్లదనాన్ని కలిగిస్తుంది.

English summary

Ayurvedic Remedies For An Oily Skin

Oily skin is one of the most undesirable skin types. It is not easy to deal with an oily skin. The accumulation of oil on the skin can give rise to acne, pimples, blackheads and whiteheads. It can cause skin irritation too.
Desktop Bottom Promotion