For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలోపల బాధించే మొటిమలను మాయం చేసే హోం రెమెడీస్

|

ముఖంలో నొప్పి, ఇబ్బంది కలిగించే, మొటిమలను అందరూ గమనించే ఉంటారు. ముఖంలో చర్మ మీద ఏర్పడే మొటిమలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఫేస్ చేసుంటారు. కానీ మనకు కనిపించకుండా ఇబ్బంది కలిగించే, నొప్పికి గురిచేసే మొటమలు కూడా ఉన్నాయి. అవే చర్మంలోపల దాగి ఉన్న మొటిమలు. సాధారణంగా చర్మం మీద కనిపించే మొటిమలకు హోం రెమెడీస్, చికిత్సల ద్వారా త్వరగా ఉపశమనం పొందవచ్చు. కానీ, అదే చర్మంలోపల దాగి ఉండే మొటిమలను నివారించుకోవడం ఎలా..? మొత్తానికి స్కిన్ లోపల మొటిమలు ఎందుకొస్తాయి?

సరైన స్కిన్ కేర్ తీసుకోకపోవడం, శుభ్రత పాటించకపోవడం, పౌష్టికాహార లోపం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, చర్మ తత్వంను బట్టి కూడా చర్మ సమస్యలు ప్రారంభం అవుతాయి. ఈ చర్మ సమస్యల్లో ముఖ్యంగా బాధించేది మొటిమలు. చర్మ రంధ్రాల్లో ఆయిల్ మరియు బ్యాక్టీరియా చేరినప్పుడు, బ్యాక్టీరియా వ్రుద్ది చెంది ఆయిల్ ట్రాప్ చేస్తుంది. ఈ క్రమంలో చర్మం లోపల జరగడం వల్ల మొటిమలు చర్మం క్రింది భాగంలో ఏర్పడటానికి దారితీస్తుంది. వీటినే బ్లైండ్ పింపుల్స్ లేదా అండర్ ది స్కిన్ పింపుల్స్ అనిపిస్తాము...

ఈ బ్లైండ్ పింపుల్స్ ను లేదా స్కిన్ అండర్ పింపుల్స్ ను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగపడుతాయి . ముఖ్యంగా ఇలాంటి బ్లైండ్ పింపుల్ కు ది బెస్ట్ హోం రెమెడీ వార్మ్ కంప్రెసర్ . వెచ్చగా పింపుల్ కంప్రెస్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలగడంతో పాటు, చర్మం లోపలే కరిగిపోయి, ఎలాంటి మచ్చలు మరియు స్కార్స్ బయటకు కనబడకుండా మాయం అవుతాయి. ఇటువంటి సింపుల్ హోం రెమెడీస్ తో బ్లైండ్ పింపుల్స్ ను నివారించుకోవడం చాలా సులభం. ఇలాంటివే మరికొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ క్రింది స్లైడ్ ద్వారా....

1. వార్మ్ కంప్రెసర్:

1. వార్మ్ కంప్రెసర్:

చర్మంలోపల దాగి ఉన్న మొటిమలను నివారించడానికి వార్మ్ కంప్రెసర్ గ్రేట్ గా సహాయపడుతుంది . గోరువెచ్చని నీటిలో కాటన్ వస్త్రం డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ బాగా పిండేసి, ఆ క్లాత్ ను మొటిమల మీద ప్రెస్ చేస్తూ (కాపడం)పెట్టినట్టు పెట్టుకోవాలి . ఇలా వార్మ్ క్లాత్ ను ముఖం మీద అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరి బ్లైండ్ పింపుల్స్ నివారించబడుతాయి.

2. టీట్రీ ఆయిల్:

2. టీట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . చర్మంలో దాగి ఉన్న మొటిమలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. ఈ టీట్రీ ఆయిల్ ను మొటిమల మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనె లో ఉండే కొన్ని ఔషధ గుణాలు చర్మంలోపల మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

3. టూత్ పేస్ట్ :

3. టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ కనిపించన మొటిమలను మాయం చేయడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ముఖ్యంగా ఇలాంటి చర్మంలోపల దాగి ఉండే మొటిమల నివారణకు బెస్ట్ హోం రెమెడీ. వైట్ టూత్ పేస్ట్ లో మింట్ ఉంటుంది. ఇది చర్మం క్రింది భాగంలో మొటిమలు ఏర్పడకుండా తగ్గిస్తుంది.

4. తేనె:

4. తేనె:

చర్మంలో దాగి ఉన్న మొటిమల నివారణకు మరో నేచురల్ హోం రెమెడీ తేనె. తేనెలో ఉండే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పింపుల్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడి, మొటిమలను మాయం చేస్తుంది. చర్మం క్రింది ఏర్పడిన మొటిమల మీద సింపుల్ గా కొద్దిగా తేనె అప్లై చేయాలి. ఈ చిట్కాను రోజులో రెండు సార్లు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

5. పాలు:

5. పాలు:

పాలలో ఆల్ఫాహైడ్రాక్సి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంలోపలి మొటిమలను ట్రీట్మెంట్ చేయడంలో, నివారించడంలో చాలా మేలు చేస్తుంది . పాలతో ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

6. నిమ్మరసం:

6. నిమ్మరసం:

చర్మంలో దాగి ఉన్న మొటిమలను నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మరసంలో దాగి ఉండే సిట్రిక్ యాసిడ్ పింపుల్స్ ను డ్రై అవుట్ చేస్తుంది . నిమ్మరసంలో ఉండే అసిడిక్ లక్షణాలు క్లెన్సర్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం మీద టోనర్ గా కూడా పనిచేస్తుంది.

7. అలోవెర:

7. అలోవెర:

అలోవెరా మరో హోం రెమెడీ. దీన్ని మొటిమలను నివారించడానికి గ్రేట్ గా ఉపయోగించుకోవచ్చు . అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది పింపుల్స్ యొక్క రెడ్ నెస్, మరియు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి.

8. ఎప్సమ్ సాల్ట్:

8. ఎప్సమ్ సాల్ట్:

ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసత్ుంది. మొటిమలను నివారిస్తుంది .ఒక బౌల్ వాటర్ లో సాల్ట్ వేసి, ఈ నీటితో రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి.

9. వెనిగర్:

9. వెనిగర్:

చర్మం లోపల దాగి ఉన్న పింపుల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా నివారిస్తుంది . ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను కొద్దిగా నీటితో మిక్స్ చేసి ఈ నీటిని మొటిమలను మీద అప్లై చేయడం స్కిన్ అండ్ పింపుల్స్ మాయం అవుతాయి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తుంటే క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

10. ఆల్కహాల్ ను రబ్ చేయడం వల్ల:

10. ఆల్కహాల్ ను రబ్ చేయడం వల్ల:

ఆల్కహాల్ పింపుల్ మీద రబ్ చేయడం వల్ల , చర్మ సమస్యలను నివారించడంతో పాటు , అండ్ స్కిన్ పింపుల్స్ ను మాయం చేస్తుంది . ఆల్కహాల్ మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి వాటిని శుభ్రపరిచి డస్ట్ పార్టికల్స్ ను తొలగించడంతో మొటిమలను మాయం అవుతాయి.

English summary

Home Remedies For Under The Skin Pimple Or Blind Pimple

A poor hygiene, improper diet and lack of sleep can affect the quality of your skin. Because of this, you will soon start to face a number of skin problems. The common problem is pimples.
Story first published:Tuesday, January 5, 2016, 11:55 [IST]
Desktop Bottom Promotion