For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమల వల్ల ఏర్పడే రంధ్రాలను మాయం చేసే హోం రెమిడీస్..!!

By Swathi
|

మొటిమలు ఎక్కువగా ఇబ్బందిపెట్టే వాళ్ల ముఖంలో చర్మ రంధ్రాలు చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటిని పోగొట్టుకోవడం అంత సులభమైన పని కాదు. ఇవి ముఖ సౌందర్యాన్ని చాలా దెబ్బతీస్తాయి. ఈ రంధ్రాలు ఏజ్డ్ లుక్ ని, అన్ హెల్తీ లుక్ ని అందిస్తాయి. కాబట్టి.. వీటిని తొలగించుకునే మార్గాలు వెతుక్కోవడం చాలా అవసరం.

ఇలాంటి చర్మ రంధ్రాలను తేలికగా, త్వరగా మాయం చేసే ఎఫెక్టివ్ రెమిడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. ఇలాంటి రంధ్రాల వల్ల.. చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. యాక్నె, బ్లాక్ హెడ్స్ వంటి సమస్య పెరుగుతుంది. ఆయిలీ స్కిన్ తో బాధపడేవాళ్లకు ఇది చాలా కామన్ ప్రాబ్లమ్.

ఇలాంటి చర్మ రంధ్రాల సమస్యతో బాధపడేవాళ్లు.. బ్యూటీ ప్రాడక్ట్స్, ట్రీట్మెంట్స్ ని ఉపయోగిస్తారు. పెద్దపెద్ద రంధ్రాలు నయం చేయడానికి చాలానే ఖర్చు పెడతారు. హోం రెమిడీస్ ప్రయత్నించడం వల్ల ఈ రంధ్రాల సైజుని కూడా తగ్గించవచ్చు. మరి అలాంటి ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఏంటో చూద్దాం..

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్ తో.. రోజుకి రెండుసార్లు ముఖానికి మసాజ్ చేయాలి. 5 నుంచి 10 సెకండ్ల పాటు రబ్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇలా చాలా తేలికగా, త్వరగా.. చర్మ రంధ్రాలను సన్నగా మారుస్తాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచి.. చర్మం హెల్తీగా మారడానికి సహాయపడుతుంది.

తేనె

తేనె

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, మెడిసినల్ గుణాలు ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. తేనెను ముఖానికి పట్టించి, మసాజ్ చేయడం వల్ల.. బ్యాక్టీరియాను నాశనం చేసి.. చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. తేనెతో మసాజ్ చేసిన తర్వాత 15 నిమిషాలు ఆగి.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదాం, నిమ్మ

బాదాం, నిమ్మ

5 నుంచి 6 బాదాం గింజలకు కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

రోజ్ వాటర్, కుకుంబర్ జ్యూస్

రోజ్ వాటర్, కుకుంబర్ జ్యూస్

ఓపెన్ పోర్స్ తగ్గించడంలో ఇది బెస్ట్ మెతడ్. రోజ్ వాటర్, కుకుంబర్ జ్యూస్ ని సమానంగా తీసుకుని.. మిక్స్ చేయాలి. కాటన్ బాల్ తో.. ముఖాన్నంతటినీ తుడుచుకోవాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకుంటే.. చర్మ రంధ్రాలు మాయమవుతాయి.

గంధం, పసుపు, ఆల్మండ్ ఆయిల్

గంధం, పసుపు, ఆల్మండ్ ఆయిల్

గంధం, పసుపు సమానంగా తీసుకోవాలి. కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి.. అన్నింటినీ బాగా కలపాలి. ముఖానికి, మెడకు పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వెన్న, ఉప్పు

వెన్న, ఉప్పు

ఇది చాలా సింపుల్ ట్రిక్. కొంచెం వెన్న తీసుకుని, ఉప్పు కలిపి బాగా కలపాలి. దీన్ని ముఖంపై ఏర్పడిన చర్మ రంధ్రాలకు రాసుకుని, 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్, ఆస్పిరిన్, పెరుగు

ఎగ్ వైట్, ఆస్పిరిన్, పెరుగు

ఆయిలీ స్కిన్ తో బాధపడేవాళ్లకు ఈ చిట్కా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 1 ఎగ్ వైట్, 2 ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ఫేస్ కి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Quick Home Remedies To Shrink Open Pores

Quick Home Remedies To Shrink Open Pores. Having enlarged or open pores on your skin and face can make your skin look aged and unhealthy.
Story first published: Monday, July 11, 2016, 10:39 [IST]
Desktop Bottom Promotion