For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ టైమ్ లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ టిప్స్ అండ్ ట్రిక్స్

గర్భధారణ సమయంలో వచ్చే ఎలాంటి చర్మ సమస్యలైనా సులభంగా నివారించుకోవడానికి కొన్ని బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే చాలు. గర్భధారణ సమయంలో కూడా అందంగా, గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిప

|

మహిళ గర్భం పొందిన తర్వాత శరీరంలో అతి పెద్ద మార్పు జరగుతుంది,. శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల కారణంగా ఆరోగ్యపరంగానే కాదు, అందం విషయంలో కూడా మార్పులు జరగడం సహజం. చర్మం, జుట్టు విషయంలో కూడా మార్పులు వస్తాయి . గర్భధారణ సమయంలో చర్మం సంరక్షణకోసం కొన్ని జాగ్రత్తలను తెలపడం జరిగింది.

కొంత మంది మహిళలు సాధారణ సమయంలోనే కాదు, గర్భం పొందిన తర్వాత కూడా ఫర్ఫెక్ట్ గ్లోయిగ్ స్కిన్ తో ఉంటుంది. అయితే ఇంకొంత మంది మహిళ చర్మంలో అనేక సమస్యలు వస్తుంటాయి. హార్మోనులు ప్రభావం చేత, గర్భిణీ చర్మంలో మొటిమలు, మచ్చలు, డ్రై స్కిన్, డార్క్ ప్యాచెస్ వంటి మార్పులు జరగుతుంటాయి. అయితే వీటికి భయపడాల్సి అవసరం లేదు.

గర్భధారణ సమయంలో వచ్చే ఎలాంటి చర్మ సమస్యలైనా సులభంగా నివారించుకోవడానికి కొన్ని బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే చాలు. గర్భధారణ సమయంలో కూడా అందంగా, గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోవచ్చు. అటువంటి చర్మ సౌందర్య పొందడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...!

 మైల్డ్ క్లెన్సర్:

మైల్డ్ క్లెన్సర్:

గర్భిణీలు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా అవసరం . రోజులో కనీసం రెండు మూడు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రాల్లో తప్పనిసరిగా ముఖం శుభ్రం చేసుకోవాలి.

మాయిశ్చరైజర్స్ :

మాయిశ్చరైజర్స్ :

పగలు, రాత్రుల్లో డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ను ఉపయోగించాలి. రాత్రుల్లో ఉపయోగించే మాయిశ్చరైజర్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, స్కిన్ సమస్యలను నివారిస్తాయి.

ఎస్ పి ఎఫ్:

ఎస్ పి ఎఫ్:

ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం చాలా త్వరగా దెబ్బతింటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉండటం వల్ల యూవీ కిరణాలా ప్రభావంతో సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దాంతో చర్మంలో డార్క్ స్పాట్స్ ఇతర సమస్యలు ఏర్పడుతాయి. వీటిని నివారించుకోవడానికి ఎఫెక్టివ్ రెమెడీ యస్ పిఎఫ్ గుణాలు కలిగిన మాయిశ్చరైజింగ్ క్రీములను ఎంపిక చేసుకోవాలి.

ఆయిల్స్ :

ఆయిల్స్ :

గర్భధారణ సమంయలో స్ట్రెచ్ మార్స్క్ సహజం. వీటిని తొలగించుకోవడానికి నేచురల్ ఆయిల్స్, కోకబట్టర్ గ్రేగ్ గా సహాయపడుతాయి. చర్మంలో పగుళ్ళును నివారించుకోవచ్చు . ఆయిల్, బట్టర్ ను చర్మానికి అప్లై చేయడం బెస్ట్ స్కిన్ కేర్ టిప్ .

 మొటిమల నివారణ:

మొటిమల నివారణ:

గర్భధారణ సమయంలో మొటిమల సమస్యలు బాధిస్తుంటాయి. అందుకు సాలిసిలిక్ యాసిడ్స్ మరియు గ్లైకోలిక్ యాసిడ్స్ తో ఫేస్ వాష్ లను ఉపయోగించి ముఖం శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ వాష్ :

నేచురల్ వాష్ :

నేచురల్ గా చర్మ సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే, ముఖాన్ని వేప ఆకులను మరిగించిన నీటితో శుభ్రం చేసుకోవాలి. వేప ఆకులను నీటిలో డిప్ చేసి తర్వాత రోజు ఉదయం ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

పాదాలు :

పాదాలు :

పాదాలు వాపులను తగ్గించడంలో గోరువెచ్చని నీటిలో డిప్ చేయాలి. రోజ్ వాటర్, పాలు మిక్స్ చేసి నీటిలో డిప్ చేయాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గ్రేట్ రిలీఫ్ ఉంటుంది.

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే నిమ్మరసం:

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే నిమ్మరసం:

చర్మంలో డార్క్ ప్యాచెస్ ఏర్పడుతాయి. ఇవి స్కిన్ పిగ్మెంటేషన్ చాలా తీవ్రంగా సూచిస్తుంది. నిమ్మరసంలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ఏజంట్స్ స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రఫ్ ప్యాచెస్ :

రఫ్ ప్యాచెస్ :

చర్మం రఫ్ గా ప్యాచ్ లు ప్యాచ్ లు గా ఉన్నప్పుడు పెట్రోలియం జెల్లీ, కోకనట్ ఆయిల్ అప్లై చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

డార్క్ ప్యాచెస్:

డార్క్ ప్యాచెస్:

ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ టిప్స్ ఈ ఉపయోగరమైన చిట్కా లేకుండా స్కిన్ కేర్ పూర్తి అవ్వదు. పసుపులో కొద్దిగా పాలు మిక్స్ చేసి ప్యాచ్ లుగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డ్యార్ ప్యాచ్ లు తొలగిపోతాయి.

 డార్క్ నెక్:

డార్క్ నెక్:

మెడ నల్లగా ఉంటే పెరుగు, శెనగపిండి మిశ్రమంతో ప్యాక్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే డార్క్ నెస్ పోతుంది.

ముఖం ఉబ్బుగా ఉండటం:

ముఖం ఉబ్బుగా ఉండటం:

గర్భధారణ సమయంలో ముఖం ఉబ్బుగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తో మర్దన చేయడం వల్ల పఫీనెస్ తగ్గుతుంది.

English summary

Tips To Take Care Of Skin When You're Pregnant

Pregnancy is a huge change for the entire body. It's your body, housing another human being. So, naturally, there would be major changes happening in the body, including the skin and hair. Here, we'll be sharing with you skin care tips for pregnancy and information on how to take care of your skin when pregnant.
Desktop Bottom Promotion