Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
మేకప్ అవసరంలేకుండా రేడియంట్ స్కిన్ పొందే గ్రాండ్ మదర్ చిట్కాలు...
అందం విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడరు. ఆనాటి కాలం నుండి ఈ నాటి వరకూ ఏ ఒక్కరూ రాజీ పడరు. ఆ విషయం అమ్మమ్మల ఫోటోలను చూసినప్పుడు తెలుస్తుంది. ఆ కాలంలోనే వారు చాలా బ్యూటిఫుల్ గా...గ్లామరస్ గా, సాప్ట్ అండ్ రేడియంట్ స్కిన్ కలిగి ఉంటారు. ఆ క్లియర్ నెస్ వారి ఫోటోలను చూసే చెప్పేయవచ్చు. ఎలాంటి బ్యూటీ క్రీములు మరియు మేకప్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండానే వారికి అంత అందం ఎలా సొంతమైంది.
ఈ కాలంలో వారి చర్మ సంరక్షణకు లేదా చర్మ అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఏవిధమైన కాస్మోటిక్స్, సర్జరీస్, మేకప్ సామాగ్రి, స్కిన్ ప్రొడక్ట్స్ వంటివి ఏవి లేవు . అయినా వారు అంత అందంగా కనబడుటకు కారణం ఏంటని ఆశ్చర్యం కలిగించవచ్చు. అందులో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు ఆనాటి కాలంలోని వారు ఎక్కువగా నేచురల్ పదార్థాల మీద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడే వారు . నేచురల్ పదార్థాలతోనే చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకొనే వారు.
అటువంటి నేచురల్ పదార్థాలు మన వంటగదిలోనో లేదా పెరట్లోనో ఉంటాయన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. మన వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలే స్కిన్ హెల్త్ కు గ్రేట్ బ్యూటీ ప్రొడక్ట్స్ . ఈ నేచురల్ రెమెడీస్ ను మనం ఇంట్లోనే చాలా ఎఫెక్టివ్ గా తయారుచేసుకోవచ్చు . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో ఉండే వివిధ రకాల కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి.
నీమ్ ఆయిల్ (వేపనూనె) మరియు నిమ్మరసం కాంబినేషన్ లో అనేక బ్యూటీ ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా...? ఒక టీస్పూన్ వేపనూనె రెండు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి లేపనంగా అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ నీమ్ ఫేషియల్ చిట్కాలను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే..మీరు అతి కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ లో పాజిటివ్ రిజల్ట్ ను గమనిస్తారు ..అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

1. మొటిమలను నివారిస్తుంది:
నీమ్ ఆయిల్ మరియు నిమ్మరసం రెండు మిక్స్ చేయడం వల్ల వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది . దాంతో చర్మంలో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

2. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి:
వేపనూనె మరియు నిమ్మరసం రెండూ కాంబినేషన్ కు కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. ఈ కాంబినేసన్ చర్మంలోని కొల్లాజెన్ ను నివారిస్తుంది . ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. ముడుతలు, ఫైన్ లైన్స్ కనబడకుండా చేస్తుంది.

3.స్కిన్ టోన్ మార్చుతుంది:
నీమ్ ఆయిల్ మరియు నిమ్మరసం కాంబినేషన్ ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మం మీద గ్రేట్ గా పనిచేస్తుంది . దాంతో స్కిన్ టోన్ మెరుగుపడుతుంది . ఈ మిశ్రమం ఏజ్ స్పాట్ లక్షణాలను తగ్గిస్తుంది . స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. దురద తగ్గిస్తుంది:
వేపనూనె మరియు నిమ్మరసం రెండింటి మిశ్రమం యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇది మైనర్ బర్న్స్, రాషెస్ మరియు దురద వంటి లక్షణాలను నివారిస్తుంది.

5. నేచురల్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది:
నీమ్ అండ్ లెమన్ కాంబినేషన్ నేచురల్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ఇది చర్మ రంద్రాలను తగ్గించడానికి , స్కిన్ ఎలాసిటి పెంచడానికి సహాయపడుతుంది . దాంతో చర్మం చూడటానికి మరింత స్మూత్ గా బెటర్ గా కనబడుతుంది.

6. స్కిన్ క్లెన్సర్:
ఈ రెండింటి మిశ్రమంలోని నేచురల్ సామర్థ్యం వల్ల చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేసి మలినాలను తగ్గిస్తుంది. మరియు చర్మ రంద్రాలను మూసుకొనేలా చేస్తుంది. ఇది డీప్ గా చర్మ రంద్రాలను శుభ్రం చేసి, స్కిన్ క్లియర్ గా , హెల్తీగా కనబడేలా చేస్తుంది.

7.స్కిన్ కండీషన్:
ఈ రెండింటి కాంబినేషన్ నూనెతో వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది, క్రిములు కుట్టడాన్ని నివారిస్తుంది, రింగ్ వార్మ్స్ , అలర్జీలను, పులిపుర్లను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications











