For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బామ్మ వాడిన బ్యూటీ ప్రొడక్ట్స్ తో చర్మానికి ఎంతో మేలు...!

|

స్వాభావికంగా ఉండే కొన్ని మామూలు పదార్థాలతో జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు. అలాంటి అందాన్ని పెంపొందించుకునే సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం .

సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో కొత్త కొత్త సౌందర్య సాధనాలు వచ్చినా అవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా ఎప్పుడో కాలానుగుణంగా నిలదొక్కుకొన్నాయి.

ఇటీవల వాస్తవరూపంలో వాటి ఉపయోగాన్ని మరిచిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యం కోసం వాటి ప్రాముఖ్యతను గుర్తుచేసుకుందాం. వాటిలో కొన్ని మీ కోసం........

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే 10 న్యాచురల్ రెమెడీస్స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే 10 న్యాచురల్ రెమెడీస్

1. పసుపు:

1. పసుపు:

పసుపు కొమ్ములుగా పేర్కొనే ఒక మొక్కల వేళ్ళను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపు కీటక వినాశనిగా పనిచేస్తుంది. దానితో పాటు ముఖానికి కూడా సౌందర్య సాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడికోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.

 2. చందనం:

2. చందనం:

మన తెలుగు సంసృతిలోని ఎన్నో ఉత్పవాల్లో కాళ్లకు పసుపుతో పాటు...మెడపై గంధం రాసుకేనే సంప్రదాయం కూడా ఉంది అంటే సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంసృతిలో అంతర్భాగంగా మారింది. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యగా ఉపయోగించడంతో పాటు చలువచేసే సాధనంగా వాడతారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గందాన్ని తయారు చేసి వాడతారు. దీన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో పెఫ్యూమ్స్ లో, సబ్బుల్లో , ఫేస్ ప్యాకులుగానూ ఉపయోగిస్తున్నారు. చందనంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే...

 3. శనగపిండి:

3. శనగపిండి:

ముఖానికి ఉన్న జిడ్డు తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్ లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి, దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం.

చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!! చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!!

4. కొబ్బరి నూనె:

4. కొబ్బరి నూనె:

ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంసృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే ఇది శ్రేష్టమైనది. దీనితో పాటు ఆరోగ్యకరమైన, కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే. కొబ్బరి నూనెను శరీరానికి బాగా పట్టించి మర్ధన చేయడం వల్ల శరీరానకి కావలసిన తేమ అంది, చర్మం చూడటానికి సున్నితంగా, మెరుస్తూ కనిపిస్తుంది.

5. గోరింటాకు:

5. గోరింటాకు:

ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంసృతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్ గా మాత్రమేకాక...చల్లదనాన్ని ఇచ్చే సౌందర్యసాధనంగా పేరుపొందింది.ఇటీవల దీన్నీ తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లిసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సంసృతి వేడుక.

6. సాంబ్రాణి:

6. సాంబ్రాణి:

ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి రోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోనుంచి వచ్చే పొగ క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలున్న గదిలో దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకొని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నామాట....

మెంతులు :

మెంతులు :

చుండ్రు సమస్యతో బాధపడుతుంటే.. రాత్రంతా మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసి జుట్టుకి, స్కాల్ప్ కి అప్లై చేయాలి. కొన్ని గంటల తర్వాత షీకాకాయ లేదా షాంపూతో శుభ్రం చేసుకుంటే.. చుండ్రు నివారించవచ్చు.

పంచదార:

పంచదార:

రఫ్ గా మారిన చేతులు, పగిన పాదాలతో బాధపడుతుంటే.. తేనె వ్యాక్స్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెట్రోలియం జెల్లీని రాత్రి నిద్రపోవడానికి ముందు అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. లేదా పంచదార, తేనె స్క్రబ్ ఉపయోగించినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

చర్మం తెల్లగా మారడం కోసం టాప్ 10 ఇంటి చిట్కాలు చర్మం తెల్లగా మారడం కోసం టాప్ 10 ఇంటి చిట్కాలు

పెరుగు

పెరుగు

ఆరంజ్ తొక్క, పెసర పిండి, కొద్దిగా తేనె, పెరుగు కలపాలి. అన్నింటినీ మిక్స్ చేసి ముఖానికి పట్టించుకుంటే.. చర్మంలో కొత్త నిగారింపు వస్తుంది.

తేనె

తేనె

ముఖం పగిలి పొలుసులుగా రాలకుండా ఉండాలంటే తేనె, పాలు కలిపిన ఫేస్‌ప్యాక్‌లను ప్రయత్నిస్తే ముఖానికి తగిన తేమ అంది చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది.

English summary

6 Best Natural and Organic Skincare Products

We often look to high end ways of making our skin glow. There is no need too. There is an ancient Indian technique that you can do at home, to enhance the glow to your skin. We often look to high end ways of making our skin glow. There is no need too. There is an ancient Indian technique that you can do at home, to enhance the glow to your skin.
Desktop Bottom Promotion