For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆముదం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది..!

ఆముదం అందరికీ తెలిసిందే...! ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదాన్ని వాడ

|

ఆముదం అందరికీ తెలిసిందే...! ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదాన్ని వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు.. చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది. ఎలాగో తెలుసా.!

Amazing Benefits Of Castor Oil For Skin, Hair

ఆముదం నూనెలో విటమిన్‌ 'ఇ', ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడతాయి. ఈ నూనె ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవు. ఆముదం జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం కలిగి ఉందని తెలుసు. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి ఒక మార్ధవకరమైన నూనె. ఈ లక్షణాలు కలిగి ఉన్నందున, ఆముదం నూనెను, కొన్నివేళ సంవత్సరాల నుండి జుట్టు మరియు చర్మ సౌందర్యాలలో ఉపయోగిస్తున్నారు.

అనేక ఉత్పన్నాలు రిసొనోలేట్, ను కొన్ని సాధారణ కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ సోపులు, ఐలైనర్, డియోడరెంట్, లిప్ స్టిక్, లేదా పెర్ఫ్యూమ్స్ లలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా వీటిని ఉపయోగించుకోవాలనుకుంటే, రసాయనాలతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్, చికిత్సలకు బదులుగా ఈ క్యాస్టోర్ ఆయిల్ ను ఎంపిక చేసుకోండి. సహజ సిద్ధంగా అందాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఆముదం నూనె ఉపయోగాలను తెలుసుకుందాం...!

నల్ల మచ్చలకు చెక్ పెడుతుంది:

నల్ల మచ్చలకు చెక్ పెడుతుంది:

కొందరికి ముఖంపై అక్కడక్కడా మచ్చలుంటాయి. వయసురీత్యా వచ్చే ఈ మచ్చల్ని కనిపించకుండా చేయాలంటే.. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని మచ్చలున్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

మృతకణాల్ని తొలగిస్తుంది :

మృతకణాల్ని తొలగిస్తుంది :

స్నానానికి వెళ్లేందుకు పదిహేను నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది మృతకణాల్ని తొలగించడంతోపాటూ చర్మాన్ని తాజాగా మారుస్తుంది.

పాదాల పగుళ్లు నివారిస్తుంది :

పాదాల పగుళ్లు నివారిస్తుంది :

కాలంతో సంబంధంలేకుండా కొందరికి పాదాల పగుళ్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఇలాంటివారు రాత్రిళ్లు పడుకునేముందు అరిపాదాలకు గోరువెచ్చగా చేసిన ఆముదాన్ని రాసుకోవాలి. మర్నాడు కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి.

చర్మాన్ని బిగుతుగా చేస్తాయి:

చర్మాన్ని బిగుతుగా చేస్తాయి:

ఆముదంలో ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవీ సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. రాత్రిపూట పడుకోవడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కుని ఏదైనా నూనెలో కొద్దిగా ఆముదం కలిసి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెదాల పగుళ్ళను తొలగిస్తుంది:

పెదాల పగుళ్ళను తొలగిస్తుంది:

పెదవులు పొడిబారి, పగిలినట్లు అవుతున్నాయా.. వాటికి కొద్దిగా ఆముదాన్ని రాసి చూడండి. ఆ సమస్య తగ్గడమే కాదు, పెదవులూ మృదువుగా మారతాయి.

అందమైన కనుబొమ్మలకు:

అందమైన కనుబొమ్మలకు:

ఆముదం నూనె కేవలం జుట్టు అందంగా కనిపించటానికి మాత్రమే కాదు. కనుబొమ్మలు పలుచగా ఉన్న వారు దీన్ని ఉపయోగించటం వల్ల అందమైన ఒత్తు, వెంట్రుకలను పొందుతారు. కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా కనిపించాలంటే ఆముదం నూనె తప్పని సరి.

కండీషనర్‌:

కండీషనర్‌:

ఆముదం నూనె మంచి మాయిశ్చరైజర్‌గా, కుదుళ్లకు కండీషర్‌గా పని చేస్తుంది. తల బాగా నొప్పిగా, వేడిగా ఉన్నప్పుడు ఆముదం నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తల నొప్పిని తగ్గించటంతో పాటు మృదువైన, కాంతివంతమైన వెంట్రుకలను అందిస్తుంది.

నిర్జీవమైన కుదుళ్లకు:

నిర్జీవమైన కుదుళ్లకు:

జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఆముదం నూనెను ఉపయోగించాలి. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఆముదం నూనెలో రెండు చుక్కల జోజోబా నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.

కుదుళ్ల పెరుగుదలకు:

కుదుళ్ల పెరుగుదలకు:

ఆముదం నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా-6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచటంతో పాటు కుదుళ్ల పెరుగుదలకు దోహదపడతాయి. ఈ నూనె జుట్టు చిట్లిపోవటాన్ని నివారించి, దృఢంగా తయారు చేస్తుంది.

దృఢమైన కుదుళ్లకు:

దృఢమైన కుదుళ్లకు:

కొంతమంది జుట్టు చాలా బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలు తొందరగా ఊడిపోతుంది. అలా కాకుండా జుట్టు బలంగా ఉండాలంటే ఆముదం నూనె ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దృఢమైన, పొడవాటి జుట్టును పొందుతారు.

English summary

Amazing Benefits Of Castor Oil For Skin, Hair

Castor oil has been around for a very long time, and has been widely used for medicinal purposes in its native lands spread across Africa, the Indian subcontinent and the Mediterranean basin. It is one of the first vegetable oils to be used for industrial purposes because of its high viscosity and lubricating property. In fact, the automotive lubricant company Castrol derives its name from castor oil.
Story first published: Tuesday, February 21, 2017, 18:33 [IST]
Desktop Bottom Promotion