అలోవెర జెల్ తో పొందే అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కలబందలో ఉండే ఔషధగుణాల వల్ల శరీరం మీద ఏర్పడ్డ గాయాలు, స్కార్స్, స్ట్రెచ్ మార్క్స్ , మొటిమలను నివారించడం, హెయిర్ రూట్స్ బలోపేతం చేయడం...ఇలా పలురకాలగు ఉపయోగిస్తుంటారు. అయితే అలోవెరలో ఉండే బ్యూటీ బెనిఫిట్స్ గురించి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం..

కలబంద రసంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి,. దాంతో స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. ఏజింగ్ ప్సొసెస్ ను ఆలస్యం చేస్తుంది. ఇవే కాకుండా, అలోవెర జెల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైబ్రోబయల్ లక్షణాలు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, చర్మంలో ఏర్పడ్డ స్కార్స్ ను తొలగిస్తుంది, మొటిమలను మాయం చేస్తుంది.

అలోవెరలో ఉండే అలోసిన్, విటమిన్ ఇ, ఫాలీఫినాల్ కాంపౌండ్స్ మొదలగునవి చర్మం లోపలి వరకూ చొచ్చుకుని పోయి, చర్మంను శుభ్రం చేస్తుంది. చర్మంను క్లియర్ చేస్తుంది. డీప్ గా శుభ్రం చేసి, డీప్ గా కండీషన్ ను అందిస్తుంది. చర్మ రంధ్రాలను మూసుకునేలా చేస్తుంది. ఇది చర్మానికి రేడియంట్ గ్లో అందిస్తుంది. ఇవే కాదు, అలోవెర జెల్లో మరెన్నో బ్యూటీ బెనిఫిట్స్ దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. రెగ్యులర్ బ్యూటి కేర్ లో అతి చౌకైన అలోవెరను ఒక ముఖ్యమైన బ్యూటిఫ్రొడక్ట్స్ గా చేర్చుకుందాం...

సన్ బర్న్ :

సన్ బర్న్ :

సన్ బర్స్ నివారించడంలో , బర్న్ అయిన చర్మం ను త్వరగా నయం చేయడం, చర్మ కణాలను రిపేర్ చేయడం, స్మూత్ చేయడంలో అలోవెర జెల్ గ్రేట్ గా పనిచేస్తుంది. అలోవెర జెల్ లేదా లీఫ్ ను రిఫ్రిజరేటర్ లో పెట్టి, అవసరమైనప్పుడు చర్మానికి అప్లై చేయాలి. సహజంగా డ్రైగా మారిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మంలో స్కార్స్ ను తొలగిస్తుంది:

చర్మంలో స్కార్స్ ను తొలగిస్తుంది:

చర్మంలో ఏజింగ్ స్పాట్స్, గాయలకు సంబంధించిన మార్క్స్ ను తేలికపరచడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర జెల్లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి గాయలు, ఏజింగ్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మంచి నీటితో శుభ్రం చేసి కడిగేసుకోవాలి.

మేకప్ రిమూవర్ :

మేకప్ రిమూవర్ :

అలోవెర జెల్ మేకప్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని డ్రైగా మార్చడం లేదా హార్స్ స్కిన్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్లో కాటన్ డిప్ చేసి, చర్మం మీద అప్లై చేసి స్క్రబ్ చేయాలి. మేకప్ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ ను రిలీవ్ చేసి , చర్మంను శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

షేవింగ్ క్రీమ్ :

షేవింగ్ క్రీమ్ :

అలోవెర జెల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ ఇ షేవింగ్ క్రీమ్ లా పనిచేస్తుంది. చర్మానికి ఎలాంటి దురద, చీకాకు కలిగించకుండా, డ్రైగా మారకుండా చేస్తుంది. రెగ్యులర్ హ్యాండ్ సోప్ తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేసి, విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి, షేవింగ్ క్రీమ్ లా ఉపయోగించాలి.

ఐబ్రో గ్రోత్ బూస్టర్ :

ఐబ్రో గ్రోత్ బూస్టర్ :

అలోవెర జెల్ ను ఐబ్రోలకు అప్లై చేయడం వల్ల ఐబ్రోస్ ఒత్తుగా పెరుగుతాయి. . ఒక టీస్పూన్ అలోవెర జెల్లో , ఒక ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఐబ్రోలకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

స్ట్రెచ్ మార్క్స్ :

స్ట్రెచ్ మార్క్స్ :

అలోవెర కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది, ఇది చర్మంలోని స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది. అలోవెర జెల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిక్స్ చేసి, మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బాడీ స్క్రబ్:

బాడీ స్క్రబ్:

అవోవెర చర్మ కణాలకు ఆక్సిజన్ ను అద్భుతంగా అందిస్తుంది. ఇది చర్మాన్ని బలోపేతం చేస్తుంది, చర్మం తేమగా మరియు స్మూత్ గా మార్చుతుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్లో కొద్దిగా పచ్చిపాలను మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ గా చేయాలి. తర్వాత దీన్ని శరీరానికి మొత్తానికి అప్లై చేసి మర్ధన చేయడం వల్ల చర్మం కాంతివతంగా తయారవుతుంది.

స్కిన్ హైడ్రేటింగ్ మాస్క్:

స్కిన్ హైడ్రేటింగ్ మాస్క్:

డల్ గా ఉన్న స్కిన్ కు హైడ్రేషన్ అందిస్తుంది, కాబట్టి, డల్ స్కిన్ ఉన్నవారు దీన్ని ప్రయత్నించడంలో మంచిది. ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ మిక్స్ చేసి ముఖం , మెడకు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

లిప్ మాస్క్ :

లిప్ మాస్క్ :

అలోవెర జెల్లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్, మాయిశ్చరైజింగ్ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, దాంతో పెదాలు నేచురల్ గా పింక్ కలర్ లోకి మారుతాయి. అలోవెర జెల్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. ఈ చిట్కాను రాత్రుల్లో పాటిస్తే రిజల్ట్ మరింత మెరుగ్గా ఉంటుంది.

మొటిమలు:

మొటిమలు:

మొటిమలు, మచ్చలు తొలగించడానికి ఇది గ్రేట్ రెమెడీ. అలోవెర జెల్ తీసుకుని అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఐస్ ట్రేలో నింపి, ఫ్రీజ్ చేయాలి. అలోవెర క్యూబ్స్ ను తొలగించి, తర్వాత మొటిమలున్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఒకసారి చేసిన తర్వాత సాప్ట్ టవల్ తో తుడిచేయాలి. ఈ చిట్కాను రోజు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Beauty Treatments You Can Make With Aloe Vera Gel

No one is a stranger to the amazing benefits of aloe vera gel. But, it can do a lot more than just heal your burns and rashes. We'll tell you how you can actually give yourself beauty treatments at home using aloe vera gel.
Please Wait while comments are loading...
Subscribe Newsletter