For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన చర్మం కోసం సహజ క్లెన్సర్లు - ఇంటివద్దనే మీరే తయారుచేసుకోండి

|

చర్మసంరక్షణలో ముఖ్యమైన అంశం శుభ్రపర్చుకోటం (క్లెన్సింగ్), ఇది రోజుకి రెండుసార్లు తప్పక చేయాలి. దానివల్ల మీ చర్మరంధ్రాలు శుభ్రపడి, ఏ మురికి లేకుండా, ఏ విషపదార్థాలు చేరకుండా ఉంటాయి.

కానీ మీరు ఏ పద్ధతిలో మీ మొహాన్ని శుభ్రపరుస్తారో, అదికూడా ఏ రకపు క్లెన్సర్ మీ చర్మంపై వాడుతున్నారో ఈ మొత్తం ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది.

బ్యూటీ స్టోర్ కి ఎప్పుడైనా వెళ్తే మార్కెట్లో అసంఖ్యాకమైన ముఖానికి వాడే క్లెన్సర్లు ఉన్నాయని తెలుస్తుంది. అందులో కొన్ని, ఒక్కో రకపు చర్మానికి సరిపోతుందని ఉంటే, మరికొన్ని వివిధరకాల చర్మాలకి వాడవచ్చని ఉంటాయి.

diy all-natural facial cleansers for healthy skin

<strong>సాప్ట్ అండ్ స్మూత్ స్కిన్ కు కమర్షియల్ ఫేస్ వాష్ కంటే నేచురల్ రెమెడీస్ బెటర్..!</strong>సాప్ట్ అండ్ స్మూత్ స్కిన్ కు కమర్షియల్ ఫేస్ వాష్ కంటే నేచురల్ రెమెడీస్ బెటర్..!

కానీ, ఆ ఉత్పత్తుల లేబుల్స్ చదివితే, అవన్నిటిలో కెమికల్స్ నిండివున్నాయని తెలుస్తుంది. ఈ రసాయనాలు తాత్కాలికంగా మీకు మీ చర్మసమస్యల నుంచి ఉపశమనం ఇచ్చినా, శాశ్వతంగా చర్మాన్ని పాడుచేస్తాయి.

ఇలాంటి క్లెన్సర్లు వాడటం వల్ల వచ్చే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, చాలామంది సహజమైన క్లెన్సర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. మొదటగా, ఈ సహజమైన క్లెన్సర్ల తయారీ చాలా సులభం. రెండోది, మనం మార్కెట్లో చూసేంత ఉత్పత్తులంత ఖరీదు కూడా ఉండవు. ఆఖరుగా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా కూడా మారుస్తాయి.

బయట దొరికే ఉత్పత్తుల నుంచి కాస్త సెలవు తీసుకుని, మీ ముఖాన్ని సహజమైన క్లెన్సర్లతో శుభ్రపర్చుకుని ఎప్పుడూ కావాలని కలలుకన్న చర్మాన్ని పొందండి.

తేనె+ విటమిన్ ఇ నూనె

తేనె+ విటమిన్ ఇ నూనె

ఎలా వాడాలి ;

ఒక గిన్నెలో అరచెంచా తేనె, 2 చెంచాల గులాబి నీరు మరియు విటమిన్ ఇ మందు నుంచి తీసిన నూనెను వేయండి.

చెంచాతో అన్నిటినీ కలపండి.

మీ ముఖాన్ని కొంచెం తడిచేసుకుని ఈ మిశ్రమాన్ని మీ మొహంపై అద్దుకోండి.

అయ్యాక గోరువెచ్చని నీరుతో శుభ్రపర్చుకోండి.

వారానికి ఒకసారి ఈ ఇంటి క్లెన్సర్ వాడి యవ్వనవంతమైన చర్మాన్ని పొందండి.

పెరుగు+ కొబ్బరినూనె

పెరుగు+ కొబ్బరినూనె

ఎలా వాడాలి ;

అరచెంచా కొబ్బరినూనె, రెండు చెంచాల పెరుగును కలపండి.

తడిగా ఉన్న ముఖంపై ఈ మిశ్రమాన్ని మెల్లగా రుద్దండి.

గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

వారానికి ఒకసారి ఇలా చేయటం వలన మీ చర్మరంధ్రాలు శుభ్రంగా ఉంటాయి.

నిమ్మరసం+ టమాట రసం

నిమ్మరసం+ టమాట రసం

ఎలా వాడాలి

1 చెంచా టమాటా రసం, ½ చెంచా నిమ్మరసం కలపండి.

ఈ మిశ్రమాన్ని తడి ముఖంపై రాసుకోండి.

ఒక నిమిషంపాటు మీ చర్మాన్ని మసాజ్ చేయండి.

గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

వారానికి ఒకసారి ఇలా చేసి యవ్వన చర్మాన్ని పొందండి.

లావెండర్ సుగంధ నూనె + ఆలివ్ నూనె

½ చెంచా ఆలివ్ నూనె మరియు 2 చుక్కల లావెండర్ సుగంధ నూనెను కలపమ్డి.

మీ మొహాన్ని ఒకసారి కడిగాక ఈ మిశ్రమం రాయండి.

గోరువెచ్చని నీరుతో ముఖాన్ని కడిగేయండి.

వారానికి ఒకసారి ఇలాచేసి మీ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోండి.

కొబ్బరిపాలు+ యాపిల్ సిడర్ వెనిగర్

కొబ్బరిపాలు+ యాపిల్ సిడర్ వెనిగర్

ఎలా వాడాలి ;

1 చెంచా కొబ్బరిపాలు, 3-4 చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ ను కలపండి.

దీన్ని మీ ముఖంపై మొత్తం రాసుకోండి.

గోరువెచ్చని నీరుతో కడిగేముందు కాస్త రుద్దండి.

వారానికి ఒకసారి ఇలా చేసి శుభ్రమైన, అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

బాదం నూనె+ చమోమిలె టీ

బాదం నూనె+ చమోమిలె టీ

ఎలా వాడాలి;

½ చెంచా బాదం నూనె మరియు 1 చెంచా చల్లబర్చిన చమోమిలె టీను కలపండి.

మీ మొహాన్ని గోరువెచ్చని నీరుతో ఒకసారి కడగండి.

ఈ ఇంటివద్ద తయారుచేసిన క్లెన్సర్ ను మొహమంతా రాసి, కొన్ని నిమిషాలు రుద్దండి.

మామూలు నీరుతో కడిగేయండి.

మెత్తని, మృదువైన చర్మం కోసం ఈ క్లెన్సర్ ను వాడండి.

<strong>మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన న్యాచురల్ హనీ క్లెన్సర్..!!</strong>మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన న్యాచురల్ హనీ క్లెన్సర్..!!

బియ్యం నీరు + గ్లిజరిన్

బియ్యం నీరు + గ్లిజరిన్

ఎలా వాడాలి ;

రెండు చెంచాల బియ్యం నీరు ½ చెంచా గ్లిజరిన్ ను కలపండి.

మీ మొహం, మెడ మొత్తం దీన్ని రాయండి.

రెండు నిమిషాలు అలా వదిలేయండి.

గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

వారానికి ఒకసారి ఇలా చేసి మీ మొహంపై చర్మానికి మళ్ళీ జీవం పోయండి.

English summary

DIY All-Natural Facial Cleansers For Healthy Skin

Check out the diy natural cleaners for healthy skin. These natural facial cleaners can be prepared right at your home
Desktop Bottom Promotion