Just In
- 1 hr ago
మెరిసే మరియు బలమైన జుట్టు పొందడానికి ఈ ఫ్రూటీ హెయిర్ మాస్క్లను ఉపయోగించండి!
- 2 hrs ago
Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!
- 4 hrs ago
పేగు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయాన్నే ‘ఈ’ డ్రింక్స్ తాగాలి..!
- 6 hrs ago
World Aids Vaccine Day 2022 :హెచ్ఐవిని కంట్రోల్ చేయలేమా? వ్యాక్సిన్లు పని చేస్తున్నాయా?
Don't Miss
- Finance
HDFC Bank: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు: లెక్క చూసుకోండి మరి
- Technology
Realme Narzo 50 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- News
షీనా బోరా హత్య కేసు-తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు ఆరున్నరేళ్ల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్
- Movies
Intinti Gruhalakshmi Today Episode: తులసిని చూసి షాకైన లాస్య.. ఆస్తి గొడవలతో నందూకు కొత్త కష్టం
- Sports
అందుకే ఓడాం: రోహిత్ శర్మ
- Automobiles
భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వివిధ రకాల చర్మ సమస్యలకు పెరుగుతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడం చాలా సులభం!
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో ముందు ఉండే పెరుగు. పెరుగును చర్మానికి అప్లై చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగిపోతాయి.
ఎందుకంటే పెరుగులో ఉండే విటమిన్ సి, ల్యాక్టిక్ యాసిడ్, క్యాల్షియం, వంటి అనేక ప్రయోజనాలు చర్మ మీద పనిచేసి మీ చర్మం అందంగా , ఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది. ఈ ట్రెడిషినల్ స్కిన్ కేర్ కాంపోనెంట్ అందాన్ని మెరుగుపరుచుకోవడంలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్. అందుకే తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. అలాగే పెరుగులో ఎంటి హానికర కెమికల్స్ ఉండవు . కాబట్టి, పెరుగును చర్మ అందానికి నిరభ్యరంతంగా ఉపయోగించుకోవచ్చు.
చర్మg
యొక్క
సహజ
సౌందర్యానికి
పెరుగు
అయితే, దీన్ని మీరు ఉపయోగించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి చర్మ సమస్యలున్నా, పెరుగును వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవడం కోసమని ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని డిఫరెంట్ కర్డ్ ఫేస్ ప్యాక్స్ ను పరిచయం చేస్తున్నది.
ఈ పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడం చాలా సులభం, పెరుగుతో స్వయంగా తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాక్ లు చర్మఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
పెరుగుతో
జుట్టుకు
మెరుపులు...వలపులు...!!
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫేస్ ప్యాక్స్ గురించి మరింత వివిరంగా తెలుసుకోవడానికి వీటి గురించి చదవండి:
హెచ్చరిక: ఎలాంటి ఫేస్ ప్యాక్ అయినా సరే ముందుగా చేతి మీద లేదా చెవుల వెనుక బాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

1. డల్ స్కిన్ కోసం కీరదోసకాయతో ఫేస్ ప్యాక్
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగును , ఒక టీస్పూన్ కీరదోసకాయ పేస్ట్ కు కలపాలి
- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
- 15 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి.
- 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో డల్ నెస్ తగ్గిస్తుంది.

2. మొటిమల నివారణకు బియ్యం పిండి
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె తీసుకోవాలి.
- ఈ రెండూ ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. .
- 15-20 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి.
- 20 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో మొటిమల సమస్య తగ్గుతుంది.

3. జిడ్డు చర్మానికి నిమ్మరసం :
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.
- ఈ కర్డ్ పేస్ట్ ను ముఖం మొత్తానికి అప్లై చేయాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ముఖం మీద కనీసం 10 నిముషాలైనా ఉండనివ్వాలి.
- 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి అప్లై చేస్తుంటే, చర్మంలో జిడ్డు తత్వం తగ్గుతుంది.

4. మచ్చలను నివారించడానికి శెనగపిండి
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో ½ టీస్పూన్ శెనగపిండి వేసి బాగా కలపాలి.
- ఈ పేస్ట్ ను మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.
- 15-20 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి..
- 20 నిముషాల తర్వాత తడి బట్టతలో పూర్తిగా తుడిచేయాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి ట్రై చేస్తే చర్మంలో ఎలాంటి మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ అందిస్తుంది.

5. చర్మంలో పొక్కులు లేదా చర్మంపై పొట్టును నివారించే అలోవెర జెల్
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో రెండు టీస్పూన్ల అలోవెరజెల్ వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి
- 10 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి..
- 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేయండి.

6. స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఫ్లాక్ సీడ్స్
తయారుచేయు పద్దతి:
- ఒక బౌల్లో నీళ్ళు పోసి అందులో ఫ్లాక్ సీడ్స్ (అవిసె గింజలను 6-7 గంటలు నానబెట్టాలి).
- మరుసటి రోజున వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో రెండు స్పూన్ల పెరుగు మిక్స్ చేయాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.
- 10-15 నిముషాలు ఈ ప్యాక్ ను అలాగే ఉంచుకోవాలి.
- దీన్ని ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.
- వారంలో రెండు మూడు సార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. డార్క్ స్పాట్స్ నివారించడానికి పసుపు
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.
- రెండూ మిక్స్ అయిన తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి.
- 15 నిముషాలు అలాగే ఉంచాలి
- దీన్ని ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.
- ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే డార్క్ స్పాట్స్ పూర్తిగా తొలగిపోతాయి

8. బ్లాక్ హెడ్స్ నివారించడానికి ఓట్ మీల్
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
- తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
- అప్లై చేసిన తర్వాత కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. 20 నిముషాలు డ్రైగా మారిన తర్వాత.
- మంచి ఫేషియల్ క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి ట్రై చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.

9. ఏజింగ్ లక్షణాలను పోగొట్టే ఎగ్ వైట్
తయారుచేయు పద్దతి:
- ఒక గుడ్డులోని ఎగ్ వైట్ ను బౌల్లో తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఫ్రెష్ పెరుగు మిక్స్ చేయాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేషియల్ ప్యాక్ లా వేసుకోవాలి.
- 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి.
- డ్రైగా మారిన తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.
- తిరిగి ఒక వారం తర్వాత ఈ ప్యాక్ ను ఉపయోగంచడం వల్ల యంగర్ లుక్ ను మీ సొంతం చేసుకుంటారు.

10. వదులైన చర్మానికి కోకనట్ మిల్క్
తయారుచేయు పద్దతి:
- ఒక టీస్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ కొబ్బరి పాలు కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖంలోని డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయాలి.
- 15-20 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచాలి..
- తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఈ ఫేస్ ప్యాక్ ను రోజూ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.