For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గిన తర్వాత వదులై, సాగిన చర్మంను టైట్ గా మార్చే హోం రెమెడీస్

By Mallikarjuna
|

బరువు తగ్గిన తర్వాత చర్మంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగ బరువు తగ్గిన వెంటనే చర్మం వదులు అయినట్లు కనబడుతుంది. శరీరంలో ఏఏ ప్రదేశంలో కొవ్వు కరిగి బాడీ పార్ట్ కరిగి ఉంటుందో అక్కడ చర్మం సాగినట్లు, వదులుగా కనబడుతుంది.

ఇది కేవలం చర్మంలో స్థితిస్థాపకత తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. మరియు కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల చర్మం సాగినట్లు కనబడుతుంది.

కాబట్టి, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారిలో మీరు ఒకరైతే, బరువు తగ్గడం వల్లే మీ చర్మం వదులుగా, సాగినట్లు కనబడుతుంటే, ఈ ఆర్టికల్ మీకు తప్పకుండా సహాయపడుతుంది.

home remedies to tighten your skin | how to tighten skin naturally after weight loss
ఈ క్రింది లిస్ట్ లో సూచించిన హోం రెమెడీస్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో స్కిన్ ఎలాసిటి మెరుగుపడుతుంది.

ఈ రెమెడీస్ ను పురాతన కాలం నుండే ఉపయోగిస్తున్నాయి. ఈ హోం రెమెడీస్ లో చర్మానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్ , ఇతర కాంపోనెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంను టైట్ గా మార్చుతుంది.
బరువు తగ్గిన తర్వాత చర్మం వదులుగా కనిపిస్తోందా..? ట్రై దిస్ హోం రెమెడీస్
మరి ఆలస్యం చేయకుండా చర్మంను టైట్ గా మార్చే విలువైన రెమెడీస్ గురించి తెలుసుకుందాం...

1. విటమిన్ ఇ ఆయిల్

1. విటమిన్ ఇ ఆయిల్

బరువు తగ్గిన తర్వాత మీ చర్మంను టైట్ గా మార్చడానికి విటమిన్ ఇ ఆయిల్ సహాయపడుతుంది. చర్మం టైట్ గా మార్చడానికి ఒక అద్భుతమైన పరిష్కారం.

ఎలా ఉపయోగించాలి:

- విటమిన్ E క్యాప్సూల్స్ రెండు తీసుకుని బ్రేక్ చేసి లోపల నూనెను ఒక గిన్నెలో వేసుకోవాలి.

- సమస్యాత్మక ప్రాంతంలో ఈ నూనెను అప్లై చేసి సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేయండి.

- రాత్రిపూట అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది,మరింత ఎఫెక్టివ్ ఫలితాలను పొందడానికి రోజువారీ పద్ధతిలో ఈ పద్ధతిని పునరావృతం చేయండి.

2. ఎగ్ వైట్

2. ఎగ్ వైట్

వదులైన చర్మానికి ఎగ్ వైట్ వండర్ ఫుల్ రెమెడీ, సాగిన చర్మాన్ని టైట్ గా మార్చడంలో ఎగ్ వైట్ గ్రేట్ రెమెడీ. ఎగ్ వైట్ లో చర్మానికి ఉపయోగపడే ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, బరువు తగ్గిన తర్వాత వదులైన చర్మంను టైట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

- సమస్యాత్మక ప్రాంతాల్లో ఎగ్ వైట్ ను అప్లై చేయాలి

కనీసం 15-20 నిముషాలు అలాగే ఉంచాలి

- తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వదులైన చర్మం టైట్ గా మారడానికి ఇలా రోజుకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. జోజోబా ఆయిల్

3. జోజోబా ఆయిల్

బరువు తగ్గిన తర్వాత చర్మం తరిగి టైట్ గా మరియు అందంగా తయారవ్వడానికి జోజోబ ఆయిల్ సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

- జోజోబా ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండూ మిక్స్ చేయాలి.

- ఈ నూనెను సమస్యాత్మక ప్రాంతాల్లో అప్లై చేసి 10-15 మర్ధన చేయాలి

- 1 గంట సేపు అలాగే వదిలివేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

- ఈ పద్ధతి వదులుగా చర్మం చికిత్స కోసం ఒక రోజు ఒకసారి ఉపయోగించవచ్చు.

4. దాల్చిన చెక్క పౌడర్

4. దాల్చిన చెక్క పౌడర్

దాల్చినచెక్క పొడి చర్మం మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ఉద్దీపన చేయగలదు మరియు చర్మం మన్నికైన మరియు మృదువైనదిగా మారడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

- దాల్చినచెక్క ½ టీస్పూన్ మరియు తేనె యొక్క 2 టీస్పూన్లు తీసుకుని మిక్స్ చేయాలి

- ప్రభావిత ప్రాంతాల్లో ఈ దాల్చిన చెక్క తేనె మిశ్రమాన్ని అప్లై చేయాలి

- అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలిజ

- వారంలో రెండు సార్లు ఈ పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం టైట్ గా మారుతుంది.

<strong>బరువు తగ్గిన తరువాత బిగుతైన చర్మం కోసం 15 మార్గాలు..</strong>బరువు తగ్గిన తరువాత బిగుతైన చర్మం కోసం 15 మార్గాలు..

5. ఆలివ్ ఆయిల్

5. ఆలివ్ ఆయిల్

ఈ పాపులర్ కిచెన్ ఆయిల్లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంలో కొన్ని అద్భుతాలను చేసి, అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

- 30-40 సెకన్లు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను మైక్రోవేవ్ లో వేడి చేయాలి

- గోరువెచ్చని ఆలివ్ నూనెను చర్మానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.

- ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

- గొప్ప ఫలితాలను పొందడానికి ఈ పరిహారంతో మీ చర్మం చికిత్స చేయండి.

6. షియా బట్టర్

6. షియా బట్టర్

షీ బట్టర్ ను కూడా చర్మంను టైట్ గా మార్చుకోవడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. ఇది అందంగా కూడా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

- షియా బట్టర్ వేడి చేసి కరిగించాలి. వెచ్చగా ఉన్నట్లే ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి

- 15-20 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి

- ఈ పద్ధతిని రోజులో ఒకసారి ఉపయోగించడం వల్ల వదులుగా మారిన చర్మం తిరిగి టైట్ గా మారుతుంది.

7. ఫుల్లర్స్ ఎర్త్

7. ఫుల్లర్స్ ఎర్త్

ఫుల్లర్ ఎర్త్ (ముల్తానీ మట్టి) మల్తానీ మిట్టి చర్మపు స్థితిస్థాపకత మెరుగుపరచడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో చాలా ప్రభావవంతమైనదిగా భావిస్తారు.

ఎలా ఉపయోగించాలి:

- ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టికి, 2 టీస్పూన్ల రోజ్ వాటర్ కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఎలాసిటి పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

- ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

- 20-25 నిమిషాలు అలాగే ఉంచి పూర్తిగా డ్రైగా మారిన తర్వాత కడగాలి

- ఇలా చేయడం వల్ల సాగిన చర్మం తిరిగి పూర్వస్థితికి వస్తుంది. వారంలో రెండు మూడు సార్లు చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

8. అలో వెరా జెల్

8. అలో వెరా జెల్

కలబంద రసంతో కూడా సాగిన చర్మంను తిరిగి టైట్ గా మార్చుకోవచ్చు. ఇది చర్మం లోతుగా వెళ్లి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మంను టైట్ గా మార్చుతుంది

ఎలా ఉపయోగించాలి:

- ఒక కలబంద మొక్క నుండి జెల్ ను స్పూన్ తో 2-3 టేబుల్ స్పూన్లు తీయండి.

- చర్మం వదులుగా అనిపించే ప్రదేశంలో ఈ జెల్ ను అప్లై చేయాలి. రాత్రిపూట అప్లై చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

- ఉదయం, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి

- మంచి ఫలితాలు కనిపించే వరకూ రోజూ ప్రయత్నించండి.

English summary

home remedies to tighten your skin | how to tighten skin naturally after weight loss

Here is the list of miraculous home remedies that can promote collagen production in your skin and also improve its elasticity. Check them out.
Desktop Bottom Promotion