బిజీగా ఉండే అమ్మాయిల కోసం సులభమైన స్కిన్ కేర్ టిప్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

చాలా బిజీగా ఉంటూ మీ చర్మ సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. మీ చర్మం తన అందాన్ని కోల్పోకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించినవారవుతారు. చాలా సులభమైన పద్దతులతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. బిజీ గర్ల్స్ కోసం సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలను ఈ ఆర్టికల్ లో పొందుపరచాము.

చర్మాన్ని పరిరక్షించుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. చర్మంపై నల్ల మచ్చలు, వయసు రీత్యా ఏర్పడే చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు తగు జాగ్రత్తలు అవసరం. హానీకరమైన సూర్యకిరణాల వల్ల కూడా చర్మసమస్యలు ఏర్పడతాయి.

కాబట్టి, తగు సంరక్షణ తీసుకోవడం వల్ల చర్మ సమస్యల బారినుండి బయట పడవచ్చు. అటువంటి సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలు మీకోసం.

సన్ స్క్రీన్ ను స్కిప్ చేయకండి:

సన్ స్క్రీన్ ను స్కిప్ చేయకండి:

సన్ స్క్రీన్ ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. హానీకరమైన సూర్యకిరణాల వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు ఈ చిట్కాను కచ్చితంగా పాటించాలి. ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువున్న సన్ స్క్రీన్ ను కచ్చితంగా వాడాలి. వయసు రీత్యా చర్మం లో పటుత్వం కోల్పోతుంది. అయితే, సన్ స్క్రీన్ ను రెగ్యులర్ గా వాడడం వల్ల ఆ సమస్య కూడా వేధించదు.

వెట్ వైప్స్ ను ఎల్లప్పుడూ దగ్గరుంచుకోండి:

వెట్ వైప్స్ ను ఎల్లప్పుడూ దగ్గరుంచుకోండి:

ఎక్కువ సేపు దుమ్మూ ధూళి ముఖంపై పేరుకుపోవడంతో చర్మంపై మొటిమలు వంటివి ఏర్పడతాయి. అందుకే, వెట్ వైప్స్ ని వాడండి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే బేబీ వైప్స్ తో చర్మాన్ని వైప్ చేయడం ద్వారా చర్మంపై పేరుకుని ఉన్న దుమ్మూ ధూళిని తొలగించినవారవుతారు.

ఫేస్ వాష్ ని హ్యాండీ గా ఉంచుకోండి:

ఫేస్ వాష్ ని హ్యాండీ గా ఉంచుకోండి:

మీతో ఎల్లప్పుడూ ఒక చిన్న ఫేస్ వాష్ ను సిద్ధంగా ఉంచుకోండి. ముఖంపై జిడ్డును తొలగించుకునేందుకు అవసరమైనప్పుడు ఫేస్ వాష్ ను వాడండి.

 కాంపాక్ట్ పౌడర్:

కాంపాక్ట్ పౌడర్:

కాంపాక్ట్ పౌడర్ కచ్చితంగా మీ బ్యాగ్ లో ఉంది తీరాల్సిందే. ఎందుకంటే, మీ ముఖం జిడ్డుగా మారకుండా ఉండేందుకు కాంపాక్ట్ పౌడర్ సహాయపడుతుంది. ఎస్ పి ఎఫ్ వాల్యూతో ఉన్న కాంపాక్ట్ పౌడర్ అయితే ఇంకా చర్మానికి అదనపు సంరక్షణని అందించినవారవుతారు.

 మీ ఫోన్ ని శుభ్రంగా ఉంచుకోండి:

మీ ఫోన్ ని శుభ్రంగా ఉంచుకోండి:

ఈ విషయాన్నీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఫోన్ పై పేరుకున్న బాక్టీరియా వివిధ రకాల చర్మ సమస్యలకి కారణమవుతుంది. అందువల్ల, తరచూ మీరు మీ ఫోన్ ని చక్కటి యాంటీబాక్టీరియల్ వైప్స్ తో శుభ్రపరుచుకోండి.

 ఫేస్ మిస్ట్లను వాడండి:

ఫేస్ మిస్ట్లను వాడండి:

మీ ముఖాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు మీరు ఫేస్ మిస్ట్ లను లేదా థర్మల్ వాటర్ స్ప్రే లను వాడండి. జర్నీలో కూడా అనుకూలంగా ఉండే విధంగా ఫేస్ మిస్ట్ లు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. కాబట్టి, కచ్చితంగా ఈ చిట్కాను పాటించండి.

English summary

Skincare Tips For Girls On The Go

Taking care of your skin is really important for you. It saves you from a lot of problems later on in life like early signs of ageing, blemishes and spots.
Subscribe Newsletter