For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చే కలబంద

By Mallikarjuna
|

మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం చర్మం. ఇది అందాన్ని, ఆకారాన్ని, రక్షణను ఇవ్వడంతో పాటు శరీరంలోని అవయవాలను బయటి వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి కాపాడుతుంది. ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో రంగును ఇచ్చేది, వర్ఛస్సును ఇచ్చేది, పిత్తంగ -రంజిక, భ్రజక పిత్తంగా దీనిని చెప్పారు. జన్యుపరంగా ప్రపంచవ్యాప్తంగా చర్మం రకరకాల రంగులను కలిగివుంటుంది.

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అందంగా మార్చే అలోవెర ఫేస్ మాస్క్ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అందంగా మార్చే అలోవెర ఫేస్ మాస్క్

మీకు వచ్చిన సమస్య సన్ టాన్. ఎండకు తిరిగినప్పుడు చర్మం పై పొరల్లోని కణా రంగు మారి చర్మం నల్లగా కమిలిపోతుంది. తద్వారా మచ్చలు ఏర్పడతాయి. దీన్నే రేడియేషన్ పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. అంటే ఎండవేడికి సూర్యకాంతిలోని యు.వి. రేడియేషన్ వల్ల చర్మం రంగు మారడం అన్నమాట. కొంతమంది బీపీ మందులు వాడుతున్నప్పుడు కూడా చర్మం రంగు మారుతుంది. కొన్ని రసాయన పదార్థాలు చర్మానికి తగిలినా నల్లబడుతుంటారు.

1) అలోవెర జెల్ (కలబంద):

1) అలోవెర జెల్ (కలబంద):

సన్ టాన్ నివారించడంలో ఒక పాత పద్దతి కలబందను పూతగా పూయడం

కావల్సిన వస్తువులు :

కలబంద

పద్దతి:

1) కలబంద గుజ్జును ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

2) అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3) ఈ చిట్కాను రోజులో రెండు మూడు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

2) కలబంద మరియు నిమ్మరసం:

2) కలబంద మరియు నిమ్మరసం:

నిమ్మరసం, కలబంద రసంలో డీట్యానింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది డీట్యానింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంది. చర్మ రంగును మార్చే గుణాలు కూడా ఇందులో అధికంగా ఉన్నాయి.

కావల్సిన పదార్థాలు:

- అలోవెర జెల్

- 1 నిమ్మ

పద్దతి:

1) ఒక బౌల్లోనికి నిమ్మరసం పిండుకోవాలి.

2) తర్వాత అందులో అలోవెర జెల్ ను మిక్స్ చేసి బాగా కలిపి మిక్స్ ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.

3) ఇది చర్మంలోని బాగా ఇంకే వరకూ మసాజ్ చేయాలి.

4) 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుని, తిరిగి రిపీట్ చేయాలి.

3) కలబంద, సాండిల్ ఉడ్ పేస్ట్ :

3) కలబంద, సాండిల్ ఉడ్ పేస్ట్ :

గంధం చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. ట్యానింగ్ తగ్గిస్తుంది. ఎండవేడికి నల్లగా మారిన చర్మం, చీకాకు కలిగించే చర్మానికి గంధం కూలిక్ ఎఫెక్ట్స్ ను అంధిస్తుంది. వేడి తగ్గిస్తుంది. నయం చేస్తుంది.

పదార్థాలు:

- కలబంద రసం తీసి పెట్టుకోవాలి

- 1 టీస్పూన్ గందం పౌడర్

పద్దతి

1) పైన రెండు పదార్థాలు బౌల్లో వేసి బాగా కలపాలి.

2) ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిముషాలు అలాగే ఉండాలి

3) 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రోజూ వేసుకోవచ్చు.

అన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరాఅన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

4) కలబంద, ఎగ్ మాస్క్ :

4) కలబంద, ఎగ్ మాస్క్ :

ఎగ్ వైట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్కిన్ టాన్ నివారిస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- అలోవెర జెల్

- 1 ఎగ్ వైట్

పద్దతి:

1) ఒక బౌల్లో ఎగ్ వైట్ వేసి గిలకొట్టాలి.

2) ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ , ఎగ్ వైట్ మిక్స్ చేసి బాగా కలపాలి.

3) ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

4) 10 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

5) అలోవెర, బ్రౌన్ షుగర్ :

5) అలోవెర, బ్రౌన్ షుగర్ :

బ్రౌన్ షుగర్ ఒక అద్బుతమైన క్లీనింగ్ ఏజెంట్, ఎండ వల్ల నల్లగా మారిన చర్మ రంగును మార్చుతుంది

కావల్సిన పదార్థాలు:

- అలోవెర జెల్

- 2 టేబుల్ స్పూన్ పంచదార

పద్దతి:

1)రెండు పదార్థాలను ఒక గిన్నెలో తీసుకుని బాగా కలిపి మొటిమల మీద అప్లై చేయాలి.

2) 15నిముషాలు తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

6) అలోవెర, బొప్పాయి:

6) అలోవెర, బొప్పాయి:

బొప్పాయిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. ఇవి స్కిన్ ట్యాన్ ను తగ్గిస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్

- 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు

పద్దతి:

1)బొప్పాయి గుజ్జు, అలోవెర జెల్ రెండు ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తర్వాత మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

2) 15 నిముషాలు తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

3) ఈ రెమెడీని రోజూ ఉపయోగించుకోవాలి.

7) కలబంద, పెరుగు, శెనగపిండి

7) కలబంద, పెరుగు, శెనగపిండి

పెరుగు చర్మంను స్మూత్ గా మార్చుతుంది, చర్మంలో చీకాకును తొలగిస్తుంది. శెనగపిండి పురాతన కాలం నుండి చర్మ రక్షణకు ఉపయోగిస్తున్నారు

కావల్సినవి:

- 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్

- 1 టీస్పూన్ పెరుగు

- 1 శెనగపిండి

పద్దతి:

1) పైన సూచించిన పదార్థాలను ఒక బౌల్లో తీసుకుని బాగా కలపాలి.

2) ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3) ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబందతో కాలిన గాయాలను ఎలా నయం చేయవచ్చు?కలబందతో కాలిన గాయాలను ఎలా నయం చేయవచ్చు?

8)కలబంద, ఆరెంజ్ తొక్క

8)కలబంద, ఆరెంజ్ తొక్క

ఆరెంజ్ తొక్కలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను నివారిస్తుంది. సన్ టాన్ తగ్గిస్తుంది.

కావల్సిన పదార్థాలు:

- అలోవెర జెల్ 1 టేబుల్ స్పూన్

- 1 ఆరెంజ్ తొక్క ఎండపెట్టి, పౌడర్ చేసినది ఒక టేబుల్ స్పూన్

పద్దతి:

1) ఆరెంజ్ తొక్క పొడిలో ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ ను కలపాలి.

2) ఈ జెల్ ను ఎండ వల్ల నల్లగా కమిలిన చర్మం మీద అప్లై చేసి మర్ధన చేయాలి..

3) అరగంట తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

9) కలబంద, పుదీనా ఆకులు:

9) కలబంద, పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు చర్మంను స్మూత్ గా మార్చుతాయి. చర్మంలో గాయాలను త్వరగా నయం చేస్తాయి.

కావల్సినవి:

- 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్

- ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులు గుప్పెడు

పద్దతి:

1) పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేయాలి.

2) అలోవెర జెల్ ను పుదీనా పేస్ట్ లో కలపాలి.

3) ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. .

4) 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత తిరిగి మరోసారి ప్రయత్నించాలి.

10) అలోవెర , కీరదోసకాయ :

10) అలోవెర , కీరదోసకాయ :

కీరదోసకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది, ఇందులో మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి చర్మానికి అద్భుతంగా సహాయపడుతాయి.

పదార్థాలు:

- 1 టేబుల్ స్పూన్ అలోవెర జెల్

- 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కీరదోసకాయ రసం

పద్దతి:

1) ఈ రెండు పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఎండకు నల్లగా మారిన చర్మానికి అప్లై చేయాలి.

2) 20 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత చన్నీటితో కడిగేసుకోవాలి.

3) ఈ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

different ways to use aloe vera on skin | aloe vera de-tan packs for skin | How to de-tan at home using aloe vera

Take a look at the ten different ways to use aloe vera to de-tan at home.
Desktop Bottom Promotion