పిగ్మెంటేషన్ సమస్యను ఎదుర్కొనడం కోసం 10 నేచురల్ టమోటా ఫెషియల్ మాస్క్స్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

టమోటాలో అనేకమైన చర్మసంరక్షణ పోషక విలువలున్నాయి. అందుకే, టమోటాని అతి ముఖ్యమైన స్కిన్ కేర్ పదార్థంగా పేర్కొంటారు. అనేకమైన చర్మ సమస్యలకు టమోటా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ప్రత్యేకించి చాలా మందిని విసిగించే చర్మ సమస్యకు టమోటా మంచి రెమెడీగ పనికొస్తుంది.

అదే స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య. శరీరంలో మెలనిన్ అత్యధికంగా ఉత్పత్తి అయినప్పుడు చర్మం కాస్త ముదురు రంగులోకి మారుతుంది. దానివల్ల, చర్మంపై నల్లటి పాచెస్ ఏర్పడతాయి. ఇవన్నీ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయినప్పటికీ, ముఖంపై కనిపించే పాచెస్ అందవికారంగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి టమోటాని వాడి ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.

10 Natural Tomato Facial Masks To Get Rid Of Pigmentation

పిగ్మెంటేషన్ సమస్యనుంచి బయటపడేందుకు టమోటా మాస్క్స్

అనారోగ్యకరమైన చర్మ సమస్యలనుంచి బయటపడేందుకు టమోటా అద్భుతంగా సహాయపడుతుంది. నిజానికి, చర్మ సంబంధిత సమస్యల నుంచి తప్పుకునేందుకు టమోటాని ఒక వరంగా భావించవచ్చు. ఇందులోనున్న అమితమైన పౌషక విలువలు చర్మాన్ని ఆరోగ్యకరంగా, అందంగా చేస్తాయి. స్కిన్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉన్న టమోటా చర్మంపైనున్న డార్క్ పాచెస్ ని త్వరగా తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

టమోటాని వివిధ రకాలుగా వాడి పిగ్మెంటేషన్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆర్టికల్ లో పిగ్మెంటేషన్ సమస్యను హ్యాండిల్ చేసేందుకు టమోటాతో వివిధ రకాల పేషియల్ మాస్క్స్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

1. టమోటా+పెరుగు:

1. టమోటా+పెరుగు:

ఒక టీస్పూన్ టమోటా పల్ప్ ని తీసుకుని ఒక టేబిల్ స్పూన్ తాజా పెరుగుతో జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని దాదాపు పది నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2. టమోటా+ఓట్ మీల్:

2. టమోటా+ఓట్ మీల్:

బాగా పండిన టమోటాని బాగా గుజ్జులా మ్యాష్ చేసి రెండు టీస్పూన్ల ఓట్ మీల్ తో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై చక్కగా అప్లై చేసుకోవాలి. దాదాపు పది నిమిషాల వరకు ఈ మాస్క్ ని అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ని వారానికి రెండు సార్లు అప్లై చేసినట్టయితే మీ చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.

3. టమోటా+పొటాటో:

3. టమోటా+పొటాటో:

ఒక టేబుల్ స్పూన్ టమోటా గుజ్జుని అరా టీస్పూన్ ఆలుగడ్డ రసంతో కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో మీ చర్మంపై మసాజ్ చేయండి. ఆ తరువాత పదిహేను నిమిషాల వరకు ఆ మిశ్రమాన్ని మీ చర్మంపై ఉండనివ్వండి. పదిహేను నిమిషాల తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ మాస్క్ ని వారానికి ఒకసారి అప్లై చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలను మీరు గమనించవచ్చు.

4. టమోటా+బ్రౌన్ షుగర్:

4. టమోటా+బ్రౌన్ షుగర్:

ఒక టేబుల్ స్పూన్ టమోటా రసాన్ని ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ తో కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకోండి. పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మాస్క్ ని తొలగించండి. రెండువారాలకు ఒకసారి ఈ విధంగా పాటిస్తే మీరు చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

5. టమోటా+ఎగ్ వైట్ :

5. టమోటా+ఎగ్ వైట్ :

గుడ్డులోంచి తెల్ల సొనను వేరు చేసి ఒక పాత్రలో వేయండి. ఇప్పుడు అందులో రెండు టీస్పూన్స్ టమోటా గుజ్జును బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేసి ఇరవై నిమిషాల వరకు ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మాస్క్ ని తొలగించండి.

6. టమోటా+ఆపిల్ సైడర్ వినెగార్ మరియు పసుపు:

6. టమోటా+ఆపిల్ సైడర్ వినెగార్ మరియు పసుపు:

రెండు టీస్పూన్ల టమోటా గుజ్జుతో నాలుగు చుక్కల ఆపిల్ సైడర్ వినేగార్ ను అలాగే ఒక చిటికెడు పసుపును బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మంపై జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అయిదు నుంచి పది నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై నుంచి తొలగించాలి. నెలకొకసారి ఇలా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య దరికే రాదు.

7. టమోటా+అలో వెరా జెల్:

7. టమోటా+అలో వెరా జెల్:

ఒక టీస్పూన్ టమోటా గుజ్జుని అలాగే అలో వెరా జెల్ ని బాగా కలపాలి. ఆ తరువాత, ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని పదినిముషాల తరువాత సాధారణ నీటితో తొలగించాలి. డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ టమోటా మాస్క్ ని భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు.

8. టమోటా+హనీ:

8. టమోటా+హనీ:

ఒక టేబుల్ స్పూన్ తేనెతో ఒక టేబుల్ స్పూన్ టమోటా గుజ్జును కలిపి చక్కటి మాస్క్ ని తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మాస్క్ ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి. దాదాపు పది నిమిషాల తరువాత సాధారణ నీటితో ఈ మాస్క్ ను తొలగించుకోవాలి. ఈ మాస్క్ ని వారానికి రెండు లేదా మూడు సార్లు ప్రయత్నించాలి.

9. టమోటా+అవొకాడో:

9. టమోటా+అవొకాడో:

అవొకాడోని బాగా మ్యాష్ చేసిన తరువాత అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల టమోటా గుజ్జును కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో మీ చర్మంపై ఒక మాస్క్ లాగా అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పాటు మైల్డ్ క్లీన్సర్ తో శుభ్రపరచుకోవాలి. నెలలో రెండు సార్లు ఈ విధంగా చేయడం ద్వారా పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

10. టమోటా+బొప్పాయి గుజ్జు మరియు బాదాం నూనె:

10. టమోటా+బొప్పాయి గుజ్జు మరియు బాదాం నూనె:

ఒక టీస్పూన్ టమోటా గుజ్జుని అర టీస్పూన్ బాదం నూనెతో పాటు బొప్పాయి గుజ్జుతో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి.

ఈ మాస్క్ ని నెలలో రెండు సార్లు అప్లై చేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

English summary

10 Natural Tomato Facial Masks To Get Rid Of Pigmentation

Tomato has always been hailed as an essential skin care ingredient because of its numerous benefits. Tomato can act as a miracle worker and help you combat this harrowing skin condition, as this natural ingredient is loaded with nutrients that can boost your skin's health and skin-bleaching agents that can lighten dark patches.
Story first published: Thursday, November 30, 2017, 7:30 [IST]
Subscribe Newsletter