ఆ సమయంలో చర్మ అందంగా..తాజాగా కనిపించాలంటే,ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మహిళలు ప్రతి నెల ఎదుర్కొనే ఒక ఇబ్బందికరమైన, చిరాకు పెట్టే సమస్య పీరియడ్స్(రుతు సమస్య). ఈ సమయంలో చర్మం మరింత వరెస్ట్ గా తయారువుతుంది. మహిళల పీరియడ్స్ సమయంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. పీరియడ్స్ మొదలవడానికి ముందు శరీరంలో హార్మోనులు చాలా ఎక్కువగా మార్పులు రావడం వల్ల, నూనె గ్రంథుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అధికంగా నూనె ఉత్పత్తి కావడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవడం జరుగుతుంది.

మొటిమలు ఏర్పడటానికి కారణం అయ్యే బ్యాక్టీరియాకు ఇది ఒక పెద్ద కారణం అవుతుంది . అందువల్ల బ్యూటిఫుల్ స్కిన్ టిప్స్ ను అనుసరించడం చాలా అవసరం. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో స్కిన్ కేర్ చాలా అవసరం అవుతుంది.

Tips To Take Care Of Your Skin During Period

మహిళల్లో గడిచే 14 రోజుల సైకిల్లో, ఈస్టోజెన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదు ఆండ్రోజన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి . ఇది ఆయిల్ గ్లాండ్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, చర్మంలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది . పీరియడ్స్ సమయంలో మొటిమలు ఏర్పడుటకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాణ కారణం అవుతుంది.

కొంత మంది మహిళల్లో ఇలా మొటిమలు ఏర్పడటం కూడా పీరియడ్స్ కు సంకేతంగా సూచిస్తుంది. ఈ సమస్యను నివారించడం కోసం, మనం తరచూ వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి . ఇది బ్యూటిఫుల్ స్కిన్ టిప్ కాకపోయినా, అలా చేయడానికి ప్రధాణ కారణం, ముందుముందు చర్మం మీద పర్మనెంట్ మార్క్ ఏర్పడకుండా చూస్తుంది.

ఒకే నెలలో పీరియడ్స్ రెండుసార్లు రావడానికి కారణం ఏమై ఉండవచ్చు?

ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల ఏర్పడుటకు కారణం అయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు. మరి పీరియడ్స్ సమయంలో సున్నితమైన చర్మంను కాపాడుకోవడానికి కొన్ని సున్నితమైన స్కిన్ కేర్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్కిన్ మసాజ్ :

1. స్కిన్ మసాజ్ :

చర్మంలో బ్లడ్ సర్కులేషన్ పెరగడానికి స్కిన్ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రీ మెనుష్ట్ర్యువల్ సైకిల్, మూడ్ తరచూ మారుతుంటుంది మరియు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతుంటారు . ఇది చర్మం మీద ప్రభావం చూపి, మరింత డల్ గా కనబడేలా చేస్తుంది . స్కిన్ మసాజ్ చేయడం వల్ల ఒత్తిడితో పాటు చర్మంలో డ్రైనెస్, డల్ నెస్ తగ్గించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ తో స్కిన్ మసాజ్ ను రోజూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.

2. ఎక్స్ ఫ్లోయేషన్ తప్పనిసరి

2. ఎక్స్ ఫ్లోయేషన్ తప్పనిసరి

బ్లాక్ అయిన చర్మ రంద్రాలు, పీరియడ్స్ సమయంలో బ్రేక్ అవుట్స్ కు దారితీస్తాయి. ఇది నివారించడానికి చర్మం ఎక్స్ ఫ్లోయేట్ సహాయపడుతుంది, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో చర్మ రంద్రాలను శుభ్రం చేసి, మలినాలను తొలగించడంలో ఎక్స్ ఫ్లోయేషన్ సహాయపడుతుంది. అందుకోసం మార్కెట్లో మన్నికైన స్ర్కబ్ ను ఉపయోగించడం లేదా ఇంట్లో స్వయంగా ఓట్ మీల్, లెమన్ జ్యూస్ , షుగర్ వంటి వాటితో స్ర్కబ్ తయారుచేసుకుని ఉపయోగించుకోవడం మంచిది.

3. చర్మం నిరంతర హైడ్రేషన్ లో ఉండేలా చూసుకోవాలి

3. చర్మం నిరంతర హైడ్రేషన్ లో ఉండేలా చూసుకోవాలి

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలల్లో చర్మం డీహైడ్రేషన్ కు గురి అయ్యి, డల్ గా కనబడుతుంది. ఇటువంటి చర్మ సమస్యలను నివారించడానికి ఎక్కువ నీళ్ళు తాగాలి. స్కిన్ టోనర్ ఉపయోగించాలి. దాంతో చర్మానికి ఎక్కువ హైడ్రేషన్ అందుతుంది.

4. చర్మం పట్ల ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం

4. చర్మం పట్ల ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం

పీరియడ్స్ సమయంలో మీ చర్మం మరింత సున్నితంగా మారుతుంది. దాంత మీ చర్మం రాషెస్ కు మరియు ఇన్ఫెక్షకు కారణం అవుతుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి చర్మంను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం చాలా అవసరం.

5. బ్యూటీ ఉత్పత్తుల ఎన్నిక

5. బ్యూటీ ఉత్పత్తుల ఎన్నిక

పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మొటిమలకు దారితీస్తుంది. వాస్తవానికి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ మేలు చేయడం కంటే హానే ఎక్కువ చేస్తాయి, కాబట్టి, చర్మానికి హాని కలిగించేవి స్థాయికి మంచి ఓవర్ గా చేయకూడదు, లేదా ఉపయోగించుకోకూడదు.

6. ఫేషియల్ మాస్క్

6. ఫేషియల్ మాస్క్

ఫేషియల్ మాస్క్ లు చర్మంను స్మూత్ గా మార్చుతాయి. అందుకోసం బ్యూటీ స్టోర్ లో ఎంపిక చేసుకున్న ఫేషియల్ మాస్క్ లేదా ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే ఫేషియల్ మాస్క్ ను ఉపయోగించుకోవచ్చు. అందుకోసం కీరదోసకాయ, అలోవెర వంటివి ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి ఫేషియల్ మాస్క్ లు మీ చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

7. ఓవర్ నైట్ ట్రీట్మెంట్

7. ఓవర్ నైట్ ట్రీట్మెంట్

మీరు ఎప్పుడైతే నిద్రపోతారు, అప్పుడు స్కిన్ సెల్స్ మరింత చురుకుగా పనిచేసి, ఉత్ప్రేరితం అవుతాయి, ఈ ప్రొసెస్ లో చర్మం కాంతి వంతంగా మారుతుంది. అందువల్ల రాత్రుల్లో స్కిన్ కోసం చేసే వేరే ఏ ట్రీట్మెంట్ అయినా సూపర్ బెనిఫిషియల్ గా పనిచేస్తాయి. రాత్రి నిద్రించడానికి ముందు ఓవర్ నైట్ క్రీమ్ ను అప్లై చేయడం లేదా రోజ్ వాటర్ ను అప్లై చేయడం మంచిది. ఈ రకమైన ట్రీట్మెంట్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

8. లైట్ మేకప్

8. లైట్ మేకప్

పీరియడ్స్ సమయంలో చర్మం చాలా సున్నితంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కు రియాక్ట్ అవుతాయి. దాంతో ఎండకు మొటిమలు ఏర్పడుతాయి, కాబట్టి, చర్మం మీద నేరుగా సూర్య కిరణాలు పడకుండా లైట్ మేకప్ వేసుకోవడం మంచిది.

English summary

Tips To Take Care Of Your Skin During Period

Tips To Take Care Of Your Skin During Period, During periods there are several skin care issues, so read to know how to take care of your skin during periods.