అవాంఛిత ఫేషియల్ హెయిర్ శాశ్వతంగా తొలగించే 7 హోంమేడ్ ఫేషియల్ స్క్రబ్స్

Posted By:
Subscribe to Boldsky

అందంగా..కాంతివంతంగా ఉన్న ముఖంలో అప్పర్ లిప్, లేదా దవడల వద్ద హెయిర్ పెరిగిందంటే మహిళలు చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు. ముఖంలో అవాంఛిత రోమాలను కనబడకుండ ఉండటం కోంసం వ్యాక్సింగ్, బ్లీచింగ్ లేదా థ్రెడ్డింగ్ వంటి పద్దతుల ద్వారా ఫెషియల్ హెయిర్ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. అయితే ఈ టెక్నిక్స్ వల్ల ముఖంలో నొప్పి, అసౌకర్యం ఉంటుంది.

కాబట్టి, నొప్పి కలగకుండా అదే సమయంలో సులభంగా ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని సులభ చిట్కాలున్నాయి. ఈ నేచురల్ పదార్థాలను ఉపయోగించడం సురక్షితమైనవి. ఎలాంటి నొప్పిని కలిగి ఉండవు, అదే సమయంలో ఫేషియల్ హెయిర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా తొలగించబడుతాయి .

ఈ నేచురల్ రెమెడీస్ ను ఫేషియల్ స్క్రబ్స్ గా ఉపయోగించడం వల్ల ఫేషియల్ హెయిర్ ఎఫెక్టివ్ గా తొలగించుకోవచ్చు. అదే విధంగా, మార్కెట్లో ఉండే ఫేషియల్ హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిండచం వల్ల వీటిలో ఉండే కెమికల్స్ స్కిన్ డ్యామేజ్ చేస్తాయి.

అందువల్ల , అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఫేషియల్ స్క్రబ్స్స్ ను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఫేషియల్ హెయిర్ ను తొలగిస్తాయి. ముఖ్యంగా ఈ హోం మేడ్ స్క్రబ్స్ అవాంఛిత హెయిర్ పెరగకుండా నివారిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హోం మేడ్ ఫేషియల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

నోట్ : ఈ ఫేషియల్ స్క్రబ్స్ ఉపయోగించడానికి ముందు స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే కళ్ళుకు, ఐబ్రోస్ కు తగలకుండా స్క్రబ్స్ చేసుకోవడం మంచిది.

ఓట్ మీల్, లెమన్ మరియు హనీ ఫేస్ స్క్రబ్

ఓట్ మీల్, లెమన్ మరియు హనీ ఫేస్ స్క్రబ్

ఓట్ మీల్, తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్పర్ లిప్, గడ్డం, దవడల వద్ద అప్లై చేసి సున్నింతంగా 10 నిముషాల పాటు స్క్రబ్స్ చేయాలి. ఈ స్ర్కబర్ ను ఉపయోగించడం వల్ల ఫేషియల్ హెయిర్ ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది

 ఓట్ మీల్, లెమన్ మరియు హనీ ఫేస్ స్క్రబ్

ఓట్ మీల్, లెమన్ మరియు హనీ ఫేస్ స్క్రబ్

ఓట్ మీల్, తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్పర్ లిప్, గడ్డం, దవడల వద్ద అప్లై చేసి సున్నింతంగా 10 నిముషాల పాటు స్క్రబ్స్ చేయాలి. ఈ స్ర్కబర్ ను ఉపయోగించడం వల్ల ఫేషియల్ హెయిర్ ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది

మెంతులు, పంచదార మరియు లెమన్ స్క్రబ్

మెంతులు, పంచదార మరియు లెమన్ స్క్రబ్

గుప్పెడు మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం నిద్రలేచి వాటిలోని నీళ్లు వంపేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ పంచదార , ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి , ఫేషియల్ హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి స్క్రబ్స్ చేయాలి. 15 నిముషాల తర్వాత స్క్రబ్స్బింగ్ ప్యాడ్ తో తుడిచేస్తే అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి .

శెనగపిండి మరియు పసుపు ఫేస్ స్క్రబ్

శెనగపిండి మరియు పసుపు ఫేస్ స్క్రబ్

ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో ఒక టీస్పూన్ పసుపు పౌడర్ మిక్స్ చేసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి, పేస్ట్ చేసి, ఈ స్క్రబ్స్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత స్క్రబ్స్ ప్యాడ్ ఉపయోగించి హెయిర్ ను తొలగించాలి.

ఆప్రికాట్, నిమ్మరసం, మరియు పాల పౌడర్ తో ఫేస్ స్క్రబ్

ఆప్రికాట్, నిమ్మరసం, మరియు పాల పౌడర్ తో ఫేస్ స్క్రబ్

ఒక టీస్పూన్ డ్రైడ్ ఆప్రికాట్ పౌడర్ మరియు మిల్క్ పౌడర్ , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేసి, స్క్రబ్స్బింగ్ ప్యాడ్ తో తొలగించాలి. ఈ హోం మేడ్ స్క్రబ్స్బర్ ను వారానికొకసారి వేసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ పీల్, పసుపు , తేనె ఫేస్ స్క్రబ్

ఆరెంజ్ పీల్, పసుపు , తేనె ఫేస్ స్క్రబ్

ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, పసుపు, తేనె మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి స్క్రబ్స్ చేయాలి. తర్వాత ఫేషియల్ హెయిర్ స్క్రబ్స్ ప్యాడ్ ను ఉపయోగించి తొలగించాలి.

బార్లీ పౌడర్, నిమ్మరసం, మిల్క్ ఫేస్ స్క్రబ్

బార్లీ పౌడర్, నిమ్మరసం, మిల్క్ ఫేస్ స్క్రబ్

ఒక టీస్పూన్ బార్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , నాలుగు చుక్కల పచ్చిపాలను మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 ల్యావెండర్ ఆయిల్, షుగర్, టీట్రీ ఆయిల్ ఫేషియల్ స్క్రబ్

ల్యావెండర్ ఆయిల్, షుగర్, టీట్రీ ఆయిల్ ఫేషియల్ స్క్రబ్

ఈ స్క్రబ్బర్ ను ఉపయోగించడానికి ఒక టేబుల్ స్పూన్ పంచదార , మూడు చుక్కల ల్యావెండర్ ఆయిల్ అలాగే కొద్దిగా టీట్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా డిస్టిల్డ్ వాటర్ కూడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత స్క్రబ్స్బింగ్ ప్యాడ్ తో తొలగించాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి .

English summary

Try These 7 Homemade Scrubs For Unwanted Facial Hair

Want to know how to get rid of unwanted facial hair? Then, try these homemade scrubs!
Story first published: Tuesday, March 21, 2017, 13:30 [IST]
Subscribe Newsletter