For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు...

తులసి ద్వారా మోచేతుల ప్రాంతలో ఉండే నలుపు పోతుంది. తులసి ఆకులను బాగా మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోండి. అందులో కాస్త పాలమీగడ కలుపుకోండి. అలాగే కాస్త పసుపు కూడా కలుపుకోండి. ఆ పేస్ట్ ను మోచేతులతో పాటు న

|

కొందరికి మోచేతులు నల్లగా ఉంటాయి. బాగా గరుకుగా అనిపిస్తాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ ప్రాంతం తెల్లగా మారదు. అయితే మోచేతులు, మోకాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఉండే నలుపును కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా తెల్లగా మార్చుకోవొచ్చు.

తులసి

తులసి

తులసి ద్వారా మోచేతుల ప్రాంతలో ఉండే నలుపు పోతుంది. తులసి ఆకులను బాగా మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోండి. అందులో కాస్త పాలమీగడ కలుపుకోండి. అలాగే కాస్త పసుపు కూడా కలుపుకోండి.

ఆ పేస్ట్ ను మోచేతులతో పాటు నల్లగా ఉండే ఇతర ప్రాంతాల్లో పూసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కచ్చితంగా నలుపు పోతుంది.

నిమ్మ

నిమ్మ

నిమ్మకాయను కోసి ఆ ముక్కతో మోచేతుల వద్ద స్మూత్ గా మసాజ్ చేయండి. అలాగే కాస్త తేనె తీసుకుని అందులో చ‌క్కెర‌ కలుపుకోండి. ఆ మిశ్రమంతో నల్లగా ప్రాంతంలో రాసుకుంటూ ఉండండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే నలుపు మొత్తం పోతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కాస్త గోరువెచ్చని కొబ్బరి నూనె తీసుకోండి. అందులో కొంచెం నిమ్మరసం కలపండి. ఆ కొబ్బరి నూనెను మోచేతుల దగ్గర రుద్దుకోండి. అలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నలుపు మొత్తం తగ్గిపోతుంది.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు మరో గొట్టంగాడు మళ్లీ లైఫ్ లోకి వస్తాడందిMost Read :నా బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడు మరో గొట్టంగాడు మళ్లీ లైఫ్ లోకి వస్తాడంది

శనగపిండి

శనగపిండి

శనగపిండి ద్వారా కూడా నలుపును తగ్గించుకోవొచ్చు.

కాస్త పెరుగు తీసుకోండి. అందులో శనగపిండి కలిపి మిశ్రమంగా తయారు చేసుకోండి. దాన్ని మోచేతుల వద్ద పూసుకోండి. అరగంట అయ్యాక క్లీన్ చేసుకోండి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ద్వారా కూడా నలుపును పోగొట్టుకోవొచ్చు. కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అందులో కొంచెం చక్కెర కలపండి. దాంతో మోచేతుల దగ్గర బాగా రుద్దుకోండి. అలా రెగ్యులర్ గా చేస్తే మోచేతులు స్మూత్ గా మారుతాయి. తెల్లగా అవుతాయి.

టమాట

టమాట

టమాట రసం ద్వారా నలుపును, గరుకుదనాన్ని పోగొట్టుకోవొచ్చు. కాస్త టమాట రసం తీసుకోండి. అందులో కాస్త తేనెను కలుపుకోండి. దాంతో నలుపు ఉన్న ప్రాంతాల్లో మర్దన చేసుకోండి. ఒకవేళ తేనె లేకపోతే కొబ్బరి నూనెను కూడా కలుపుకోవొచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Most Read :శారీరక దృఢత్వం, కండరాల పటిష్టతకు ఈ ఆయుర్వేద మూలికలు ఉపయోగించండి, బాడీ షేప్ మారిపోతుందిMost Read :శారీరక దృఢత్వం, కండరాల పటిష్టతకు ఈ ఆయుర్వేద మూలికలు ఉపయోగించండి, బాడీ షేప్ మారిపోతుంది

English summary

basil leaves lemon coconut oil for to get rid of dark elbows

how to get rid of dark elbows overnight
Desktop Bottom Promotion