ఈ సౌందర్య చిట్కాలను నేరుగా మీ ఇంటి వద్దనే ప్రయత్నించవచ్చు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు తరచుగా ఒక స్పా (లేదా) ఒక బ్యూటీ సెలూన్లో ఎక్కువ మొత్తంలో డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారా? అది అలా మీ నెలవారీ వ్యయమును బాగా పెంచుతుందా ?

పైన పేర్కొన్న ప్రశ్నలకు మీరు "అవును" అని సమాధానం ఇచ్చినట్లయితే, ఈ రోజు 'బోల్డ్-స్కై'లో మీరు ఇంట్లోనే చేసుకొనే సౌందర్య చిట్కాల జాబితాను గూర్చి మేము సంగ్రహించిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఇకమీదట మీరు ఒక సెలూన్లను సందర్శించి, మీ అందాన్ని పెంచుకోవడానికి అవసరమైన చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనవసరం లేదు.

ఈ సౌందర్య చిట్కాలను నేరుగా మీ ఇంటి వద్దనే ప్రయత్నించవచ్చు !

మీరు బ్యూటీ స్టోర్లో లభ్యమయ్యే కొన్ని ముడి సరుకులను కొనుక్కొని, మీ సౌందర్యాన్ని మెరుగుపరిచే మిశ్రమాన్ని మీరు మీ ఇంట్లోనే స్వతహాగా తయారు చేసుకోవచ్చు. చాలామంది మహిళలు తమ ఇంట్లోనే స్వంతంగా ఈ రకమైన చిట్కాలను ప్రయత్నిస్తూ, చాలా మంచి ఫలితాలను పొందారు. ఇలా మీరు పాదాల నుంచి తలవరకు ఉన్న అన్ని రకాల సౌందర్య చిట్కాలను ఇంట్లోనే స్వయంగా ప్రయత్నించి చూడొచ్చు.

మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల సౌందర్య చికిత్సల గురించి, ఈ క్రింద తెలిపిన పూర్తి సమాచారాన్ని చదివి తెలుసుకోండి.

1. ఫేసియాల్ :

1. ఫేసియాల్ :

ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనటానికి ముందు, తమ ముఖ సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవడం కోసం బ్యూటీ సెలూన్లకు వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు చాలామంది బ్యూటీ స్టోర్కి వెళ్లి, మీకు కావలసిన ముఖ సౌందర్యాన్ని పెంపొందించుటలో సహాయపడే ఫేస్-క్రీమ్లను ఎంచుకొని, ఇంట్లోనే మెరుగైన చిట్కాలను పాటించి అందమైన మేని ఛాయను పొందుతున్నారు. బ్యూటీ సెలూన్లో దీనికి అయ్యే ఖర్చు కన్నా, ఫేస్ మాస్కులు అయ్యే ఖర్చు చాలా తక్కువ.

2. మానిక్యూర్ :

2. మానిక్యూర్ :

మానిక్యూర్ అనేది, చర్మం యొక్క పైపొరను మరియు చేతులను మంచిగా స్వస్థత చేకూర్చే ఒక మంచి చికిత్స విధానము. ఈ మానిక్యూర్ ట్రీట్మెంట్ కోసం మీరు సెలూన్కు వెళ్లే కన్నా, దానిని మీ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. ప్రతి నిత్యమూ మీరు ఈ మానిక్యూర్ను ప్రయత్నించడం వల్ల రక్తప్రసరణను మెరుగుపరచి, మీ గోర్లు మరియు చేతుల్లో చనిపోయేందుకు సిద్ధంగా ఉన్న చర్మకణాలను మరియు వాటికి దోహదపడే మలినాలను కూడా నిరోధిస్తుంది.

3. పెడిక్యూర్ :

3. పెడిక్యూర్ :

ఇది మీ ఇంట్లోనే మీరు సులభంగా చేసుకోగల మరొక సౌందర్య చికిత్స. ఈ సౌందర్య చికిత్సకు ఉపయోగపడే పదార్ధాలను మీ ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి, పెడిక్యూర్ను మీ ఇంట్లోనే పాదాలకు చికిత్సను చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీ పాదాల నుండి చనిపోయిన చర్మ కణాలను మరియు ఇతర మలినాలను వదిలించుకోవచ్చు, పైసా ఖర్చు లేకుండా !

4. వేడి నూనెతో హెయిర్ ట్రీట్మెంట్ :

4. వేడి నూనెతో హెయిర్ ట్రీట్మెంట్ :

వేడి నూనెతో జుట్టుకు చికిత్స చెయ్యడం ద్వారా మీ జుట్టు విషయంలో మీరు అనేక అద్భుతాలను చేయవచ్చు. ఈ చికిత్సా విధానంలో మీ చుట్టు యొక్క కుదుళ్ళకు కావాల్సిన పోషకాలను అందించి మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ రకమైన చికిత్స విధానాన్ని మీరు "స్పా-సెంటర్లలో" పొందటం కోసం చాలా ఎక్కువ ఖర్చు చెయ్యవలసి ఉంటుంది. దానికి బదులుగా, మీ ఇంట్లోనే మీరు ఈ చికిత్సా విధానాన్ని ప్రయత్నించడం వల్ల, చాలా డబ్బును ఆదాచేసేవారవుతారు.

5. ఎక్స్ఫోలియెషన్ :

5. ఎక్స్ఫోలియెషన్ :

సెలూన్లలో లభించే ఈ ఎక్స్ఫోలియెషన్ ట్రీట్మెంట్ అనేది, శరీరాన్ని స్క్రబ్ చేయటం మరియు పైన ఉన్న చర్మాన్ని తొలగించడానికి ఉపయోగించే ఒక చికిత్సా విధానం. ఇలాంటి అత్యధిక ధరలతో కూడిన చికిత్సలను ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు మీ స్వంత విధానంలో సహజమైన స్క్రబ్ను తయారుచేసుకోవచ్చు (లేదా) ఎక్స్ఫోలియెషన్ కోసం అవసరమయ్యే సామాగ్రిని బ్యూటీ స్టోర్లో కొనుగోలు చెయ్యడం వల్ల, మీ జేబుకు చిల్లు పడకుండా జాగ్రత్తపడవచ్చు.

6. బ్లోఅవుట్ :

6. బ్లోఅవుట్ :

మీరు దీనిని మీ ఇంట్లోనే స్వంతంగా ఆచరించగలిగే మరొక సాధారణమైన సౌందర్య చికిత్సా విధానం. ఇందుకోసం మీరు ఒక హెయిర్ బ్రష్ను మరియు డ్రైయర్ను కలిగి ఉండాల్సి ఉంటుంది. వాటి సాయంతో మీ జుట్టుకి ఒక బ్లోఅవుట్ను ఇవ్వడం ద్వారా మీ జుట్టు యొక్క పరిమాణం మరింతగా పెరిగి, ఒక కొత్త శైలిని కలిగి ఉంటుంది

7. వాక్సింగ్ :

7. వాక్సింగ్ :

ఈ వాక్సింగ్ కోసం చాలామంది మహిళలు సెలున్లను సందర్శిస్తూ ఉంటారు. అయితే మీరు వ్యాక్సింగ్ పొందడానికి నిపుణుడైన వైద్యుని సహాయం అవసరం లేదు. ఈ సౌందర్య చికిత్సను మీ ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. కానీ దానికోసం మీరు స్వంతంగా వ్యాక్సింగ్ యొక్క ముడి పదార్థాలను కలిగి ఉండాలి (లేదా) వాటిని బ్యూటీ స్టోర్లో కొనుగోలు చేయండి మరియు మీ శరీరం నుండి అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి ఈ మైనపు స్ట్రిప్స్ ఉపయోగించండి.

8. మీ జుట్టుకి రంగు వేయడం :

8. మీ జుట్టుకి రంగు వేయడం :

జుట్టుకు రంగు వేయడం కోసం మీరు ఒక సెలూన్ను సందర్శించడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అదృష్టవశాత్తూ, మీ ఇల్లే ఒక సెలూన్లా మారే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వారి యొక్క జుట్టుకి రంగు వేయడమే కాకుండా, చాలామంది గొప్ప ఫలితాలను కూడా పొందారు.

 9. ముఖానికి ఆవిరి పట్టడం :

9. ముఖానికి ఆవిరి పట్టడం :

పెద్ద చర్మపు రంధ్రాల కోసం అత్యంత ప్రభావవంతమైన చికిత్స విధానాలలో ఇది కూడా ఒకటని పరిగణించబడుతుంది. ఈ చికిత్స కోసం చాలామంది మహిళలు స్పాను సందర్శించేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మీ ఇంట్లోనే దీన్ని కూడా చాలా సులభంగా ప్రయత్నించవచ్చు. శుభ్రమైన మరియు స్పష్టమైన చర్మమును పొందటమే కాకుండా, మీరు కూడా కొంత డబ్బును ఆదా చెయ్యగలరు.

English summary

Beauty Treatments You Can Do At Home

You don’t have to head to the parlor anymore to get that beauty treatment. Try out on these simple beauty treatments that you can try at your home. This is the best way to get yourself pampered. Take a look.
Story first published: Tuesday, February 27, 2018, 16:30 [IST]