For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  DIY బనానా మరియు మిల్క్ హెయిర్ కండిషనర్ తో డ్రై మరియు డేమేజ్డ్ హెయిర్ నుంచి విముక్తి పొందండి

  |

  ఒత్తైన అలాగే పొడవైన శిరోజాలు మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ యాడ్ లోని మోడల్స్ నిగనిగలాడే ఒత్తైన తమ పొడవైన జుట్టును ప్రదర్శిస్తూ ఉంటే ఆ శిరోజ సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోతాము. అటువంటి లుక్ నే మనమూ ఆశిస్తాము. నిజమే కదా?మోడల్ వాడిన ప్రోడక్ట్ ను తీసుకుని ప్రయత్నించినా ఫలితం లభించదని ఆలస్యంగా తెలుస్తుంది. అయితే, ఎంతగా ప్రయత్నించినా అటువంటి శిరోజ సౌందర్యాన్ని పొందడం సాధ్యం కాదని రాను రానూ మనకు తెలుస్తూ వస్తుంది.

  అంతేకాక, ప్రతిసారి అటువంటి కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్ ను తీసుకోవడం వలన హెయిర్ కు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. హెయిర్ జీవం లేకుండా డ్రై గా డేమేజ్డ్ గా మారుతుంది. తద్వారా, మన కాన్ఫిడెన్స్ పై ప్రభావం పడుతుంది. తిరిగి హెయిర్ కు జీవాన్ని పోయాలంటే మనం హెయిర్ పై అదనపు శ్రద్ధను కనబరచాలి.

  DIY Banana And Milk Hair Conditioner For Dry, Damaged Hair

  DIY బననా మరియు మిల్క్ హెయిర్ కండిషనర్

  ఈ రోజుల్లో, హెయిర్ కండిషనర్ ని వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన ఏర్పడుతోంది. హెయిర్ కండిషనర్ వలన హెయిర్ కు అలాగే స్కాల్ప్ కు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి ఆరోగ్యం మెరుగవుతుంది. హెయిర్ కి ఆయిల్ మసాజ్ చేయటమెంత ముఖ్యమో హెయిర్ ని కండిషనింగ్ చేయటమనేది కూడా అంతే ముఖ్యం. కండిషనింగ్ వలన హెయిర్ డేమేజ్ ను అరికట్టి హెయిర్ కి పోషణ అందుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ కండిషనర్ వలన హెయిర్ కు సహజ కాంతి లభిస్తుంది. డ్రై నెస్ మరియు ఫ్రిజ్జీనెస్ తగ్గుతుంది.

  మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ కండిషనర్లు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని ఆయా బ్రాండ్స్ యాడ్స్ లో ప్రామిస్ లు చేస్తున్నాయి. అయితే, ఒక్క నిమిషం ఆలోచించండి. కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ను హెయిర్ కు వాడటం ఎంతవరకు మంచిది. దానిబదులు నేచురల్ హోమ్ మేడ్ కండిషనర్లు ని వాడి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చన్న సంగతి మీకు తెలుసా?

  ఇవి చౌకగా లభిస్తాయి. అంతేకాక హోమ్ మేడ్ కండిషనర్లని వాడటం అత్యంత సురక్షితం. ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ యొక్క చింతా లేకుండా వీటిని జాగ్రత్తగా వాడవచ్చు.

  ఇక్కడ, ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగిన DIY బనానా మరియు మిల్క్ హెయిర్ కండిషనర్ గురించి వివరించాము. ఇది ముఖ్యంగా డ్రై మరియు డేమేజ్డ్ హెయిర్ కు వరప్రసాదంలా పనిచేస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  కావలసిన పదార్థాలు:

  ఒక అరటిపండు (బాగా పండినది)

  3 టేబుల్ స్పూన్ల పాలు (మీ శిరోజాల పొడవును బట్టి పాల మోతాదును పెంచుకోవచ్చు)

  ఎలా తయారుచేయాలి:

  ఎలా తయారుచేయాలి:

  • అరటిపండును బాగా మ్యాష్ చేసి పాలలో కలపాలి. ఈ రెండిటినీ బాగా కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

  • ఈ పేస్ట్ ను పొడిగా ఉన్న హెయిర్ కు అప్లై చేయాలి. జుట్టు మొత్తానికి ఈ కండిషనర్ ను పట్టించాలి.

  • ఇప్పుడు ఒక షవర్ క్యాప్ ను ధరించాలి. ఆ తరువాత ముప్పై నిముషాల పాటు హెయిర్ కి ఈ కండిషనర్ పట్టేవిధంగా అలాగే ఉండాలి.

  • ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను రిన్స్ చేయాలి.

  • మీరు రెగ్యులర్ గా షాంపూ చేసుకునే విధానాన్ని పాటించాలి.

  • అయితే, హెయిర్ ను బ్లో డ్రై చేసే బదులు టవల్ తో హెయిర్ ను ఆరబెట్టేందుకు ప్రయత్నించండి.

  ఎంత తరచుగా వాడవచ్చు:

  ఎంత తరచుగా వాడవచ్చు:

  ఈ జెంటిల్ హోంమేడ్ హెయిర్ కండిషనర్ ను వారానికి రెండు సార్లు వాడటం వలన మంచి ఫలితం పొందవచ్చు.

  ఈ రెసిపీ ద్వారా అందే ప్రయోజనాలు:

  ఈ రెసిపీ ద్వారా అందే ప్రయోజనాలు:

  బనానాలో విటమిన్స్, మినరల్స్ అలాగే నేచురల్ ఆయిల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ హెయిర్ ను మాయిశ్చరైజ్ చేస్తాయి. తద్వారా, హెయిర్ షైనీగా మారుతుంది. హెయిర్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. బ్రేకేజ్ తగ్గుతుంది. పాలతో బనానాని కలిపి వాడితే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. హెయిర్ కు లోలోపల నుంచి పోషణ లభిస్తుంది. ఈ కాంబినేషన్ హెయిర్ ను ఆరోగ్యంగా ఉంచుతూ ఫ్రిజ్జీనెస్ ను తగ్గిస్తుంది.

  అరటి వలన హెయిర్ కు అందే ప్రయోజనం ఏంటి?

  అరటి వలన హెయిర్ కు అందే ప్రయోజనం ఏంటి?

  అరటిపండు వలన హెయిర్ కు అలాగే స్కాల్ప్ కు చక్కటి పోషణ అందుతుంది. ఇది శిరోజాలకు సహజమైన కాంతిని అందించి డాండ్రఫ్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే, స్కాల్ప్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది.

  పొటాషియం, విటమిన్స్, నేచురల్ ఆయిల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభించడం వలన హెయిర్ అనేది మృదువుగా మారుతుంది. హెయిర్ లోని నేచురల్ ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ సమస్య అలాగే బ్రేకేజ్ తగ్గుముఖం పడుతుంది.

  అరటిలో విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. అరటి పండు హెయిర్ కు వాల్యూమ్ ను అందించడానికి తోడ్పడుతుంది. అలాగే డ్రై మరియు సన్ డేమేజ్డ్ హెయిర్ రిపెయిర్ కు తోడ్పడుతుంది.

  పొటాషియం అనేది హెయిర్ గ్రోత్ కు తోడ్పడుతుంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అందువలన, హెయిర్ అనేది దృఢంగా అలాగే ఒత్తుగా మారుతుంది.

  అరటిపండులా బయోటిన్, బీ విటమిన్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేసి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.

  హెయిర్ కేర్ కు పాలు ఏ విధంగా తోడ్పడతాయి?

  హెయిర్ కేర్ కు పాలు ఏ విధంగా తోడ్పడతాయి?

  పాలలో వే మరియు కేసెన్ లభిస్తాయి. ఈ రెండు రకాల ప్రోటీన్స్ హెయిర్ కు పోషణని అందిస్తాయి. వే ప్రోటీన్ వలన హెయిర్ లాస్ అరికట్టబడుతుంది. హెయిర్ కుదుళ్ళతో సహా బలపడుతుంది. వేగంగా జుట్టు పెరుగుతుంది. మరోవైపు కేసెన్ లో గ్లుటమైన్ తో పాటు ఎమినో యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇవి వెంట్రుకలను బలంగా మారుస్తాయి.

  ఆరోగ్యకరమైన హెయిర్ కు ప్రోటీన్స్ తో పాటు కార్బ్స్ అవసరమవుతాయి. అందువలన మిల్క్ ప్రోటీన్ హెయిర్ గ్రోత్ కు తోడ్పడుతుంది. హెయిర్ ఒత్తుగా మారుతుంది. సహజకాంతి హెయిర్ కు అందుతుంది.

  వే అనే మిల్క్ ప్రోటీన్ అనేది మేల్ ప్యాటర్న్ బాల్డ్ నెస్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. జుట్టును బలపరిచి జుట్టు వేగంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది.

  పాలలో లభించే సహజ క్రీమీనెస్ అనేది అద్భుతమైన కండిషనర్ గా పనిచేస్తుంది. మాయిశ్చర్ ని నిలిపి ఉంచుతుంది.

  డ్రై, ఫ్రిజ్జీ హెయిర్ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే పాలలో ని హెయిర్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తో హెయిర్ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మిల్క్ ని హెయిర్ కండిషనర్ గా అలాగే మాస్క్ గా వాడినప్పుడు డ్రై మరియు ఫ్రిజ్జీ హెయిర్ సమస్య తొలగిపోతుంది. హెయిర్ స్మూత్ గా, షైనీగా అలాగే మరింత అందంగా మారుతుంది.

  పాలు స్కాల్ప్ ని క్లీన్స్ చేస్తాయి. దురదను, డాండ్రఫ్ ను తగ్గించి హెయిర్ ఫాల్ ను అరికడతాయి. హెయిర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు పాలు ఉపయోగపడతాయి.

  హెయిర్ డేమేజ్ ను రిపెయిర్ చేసి హెయిర్ కు పోషణ నందించి కుదుళ్ళ నుంచి బలపరిచేందుకు పాలు అమితంగా తోడ్పడతాయి. హెయిర్ కు సహజమైన కాంతి అందుతుంది.

  పాలలో లభించే లాక్టిక్ యాసిడ్ హెయిర్ లో అలాగే స్కాల్ప్ లో పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి, హెయిర్ కు జీవాన్ని అందిస్తుంది.

  కాబట్టి, అరటిపండులో అలాగే పాలలో లభించే హెయిర్ ఫ్రెండ్లీ సుగుణాలను ఉపయోగించుకుని హెయిర్ కు చక్కటి పోషణను అందించండి. హెయిర్ డేమేజ్ ను నేచరుల్ వే లో తగ్గించుకోండి.

  English summary

  DIY Banana And Milk Hair Conditioner For Dry, Damaged Hair

  Dry, damaged hair can look lifeless, hindering our confidence. They need extra care and attention to be brought back to life. Conditioning the hair is as important as an oil massage as it helps repair the damage caused to the hair and nourishes it, preventing hair fall. Hair conditioner also adds a natural shine to the tresses, preventing dryness and frizz.
  Story first published: Friday, May 25, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more