బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీ సొంతగా తయారుచేసుకునే ఇంటిలోని సహజ కండీషనర్లు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రతిఒక్కరికీ అందమైన జుట్టు ఉండాలనే కోరిక ఉంటుంది, కానీ కొంతమందైతే దాని కోసం విపరీతంగా ప్రవర్తించి జుట్టుపై రసాయన ఉత్పత్తులు ఎక్కువ వాడతారు.

రసాయన ఉత్పత్తులు ఎక్కువ వాడటం వలన జుట్టు పాడయి తరచుగా జుట్టు పగిలిపోవటమో, వెంట్రుకలు చివర్లన విరిగిపోవటమో, జుట్టు ఊడిపోవటమో, చుండ్రు, చిక్కు, పాలిపోయి,నిర్జీవంగా కన్పించటం ఇవన్నీ జరుగుతాయి.

కాలుష్యం, కలుషితమైన ఆహారపదార్థాలు, జీవనవిధానంలో మార్పులు ఇవన్నీ జుట్టు నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. అయితే మరి మన జుట్టు నాణ్యతను మనం ఎలా కాపాడుకోగలం? మార్కెట్లో అనేకరకాల వివిధ కండీషనర్లున్నాయి కానీ షాపుల్లో కొనే కండీషనర్లలో రసాయనాలు ఉండటం వలన అవి కొంచెం జుట్టుకి హానికరం.

DIY Homemade Natural Conditioners For Strong And Healthy Hair

అయితే ఇంట్లో చేసిన సహజ కండీషనర్ ను ఎంచుకోవాలి మనం, కదా?

ఇంట్లో తయారుచేసుకునే జుట్టు కండీషనర్లు చవకగా ఉండి, వీటిని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

ఇంట్లో తయారయ్యే ఉత్పత్తులు ఎప్పుడూ రసాయనాలు లేకుండా సురక్షితంగా వాడుకోవచ్చు.

జుట్టుకి షాంపూతో స్నానం, నూనెరాయటం ఎంత ముఖ్యమో కండీషనింగ్ కూడా అంతే ముఖ్యం. కండీషనర్ పాడైన జుట్టును రిపేర్ చేసి, వెంట్రుకలకి తేమ మరియు బలాన్ని ఇస్తుంది.

ఈ వ్యాసంలో మేము మీ జుట్టుకోసం 10 ఇంట్లో తయారుచేసుకునే కండీషనర్ల గురించి వివరించాం. ఇవి మీ జుట్టుకి అంత గాఢంగా ఏమీ ఉండవు.

అయితే పదండి ఇంట్లోనే హెయిర్ కండీషనర్ ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం. రండి, ఇక మొదలుపెడదామా?

1.అరటి పండు, తేనె మరియు ఆలివ్ నూనెః

1.అరటి పండు, తేనె మరియు ఆలివ్ నూనెః

అరటిపళ్ళలోని పొటాషియం జుట్టును బలంగా మార్చి, వెంట్రుకలు విరిగిపోవటాన్ని తగ్గిస్తుంది, జుట్టు యొక్క సహజ సాగే గుణాన్ని పెంచి, డామేజిని రిపేర్ చేస్తుంది. తేమను అందిస్తుంది.

తేనె సహజ తేమకారి. ఇది మీ కుదుళ్ళకి తేమను తిరిగి తీసుకొస్తుంది. పైగా బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కూడా ఉండటంతో జుట్టును సురక్షితంగా ఉంచుతుంది.

ఆలివ్ నూనెలో పాలీ అన్ సాట్యురేటడ్ మరియు మోనో సాట్యురేటడ్ ఫ్యాటీ ఆసిడ్లు మీ జుట్టును, కుదుళ్ళకు పోషణ అందిస్తాయి. ఆలివ్ నూనె జుట్టు మొత్తానికి లోతైన పోషణ ఇవ్వటం వలన మీ జుట్టు మెత్తగా మృదువుగా మారుతుంది.

మీకు కావాల్సినవి;

1 పండిన అరటిపండు

2చెంచాల తేనె

3చెంచాల ఆలివ్ నూనె

ఎలా వాడాలి

ఒక మిక్సీలో అన్ని పదార్థాలను కలిపేయండి.

మెత్తని పేస్టు అయ్యేవరకు బాగా మిక్సీ పట్టండి.

ఈ మాస్క్ ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు వదిలేయండి.

మామూలు నీళ్ళతో తలస్నానం చేయండి.

ఈ మాస్క్ జుట్టు మొత్తం నుంచి పోయాక అప్పుడు మైల్డ్ షాంపూను వాడండి.

దీన్ని వారానికి ఒకసారి చేసి మంచి ఫలితాలను పొందండి.

2.గుడ్లు,పెరుగు మరియు మయోన్నెస్ కండీషనర్

2.గుడ్లు,పెరుగు మరియు మయోన్నెస్ కండీషనర్

గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ ఆసిడ్లు మీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్డు జుట్టులో పొడిబారటాన్ని తగ్గించి కుదుళ్ళ నుంచి బలంగా మారుస్తుంది. జుట్టు ఊడిపోవటాన్ని కూడా తగ్గిస్తుంది.

పెరుగు జుట్టును మెత్తగా మారుస్తుంది మరియు పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టును తేమగా ఉంచి బలంగా మారుస్తుంది.

మయోన్నెస్ లో నిమ్మరసం, వెనిగర్, సోయానూనె వంటివి వుండి జుట్టుకు మెరుపునిచ్చి, తేమను పట్టివుంచుతుంది.

మీకు కావాల్సినవి;

1 గుడ్డు

1 కప్పు మామూలు పెరుగు

అరకప్పు మయోన్నెస్

ఎలా వాడాలి ;

ఒక బౌల్ లో అన్ని పదార్థాలను వేసి బాగా కలపండి.

ఈ మాస్క్ ను మీ జుట్టుపై కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించండి.

దాన్ని అలా 35-40 నిమిషాలపాటు వదిలేయండి.

మామూలు నీరుతో కడిగేయండి.

మైల్డ్ షాంపూ వాడండి.

ఇలా వారానికి 2 సార్లు చేసి మంచి ఫలితాలు పొందండి.

3.కొబ్బరినూనె మరియు తేనె కండీషనర్;

3.కొబ్బరినూనె మరియు తేనె కండీషనర్;

కొబ్బరినూనెలో మీడియం చెయిన్డ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి మరియు ఇది వెంట్రుక కుదుళ్లలోపలి వరకు వెళ్ళి జుట్టును తేమగా ఉంచుతుంది. చివర్ల తెగిపోయిన వెంట్రుకలను బాగుచేసి కోల్పోయిన మెరుపును తీసుకొస్తుంది.

మీకు కావాల్సినవి

4 చెంచాల కొబ్బరినూనె

2చెంచాల తేనె.

ఎలా వాడాలి;

ఒక బౌల్ లో అన్ని పదార్థాలను కలపండి

వేరే గిన్నెలో నీళ్ళను మరిగించి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు, మొదటి బౌల్ మిశ్రమాన్ని రెండవదాంట్లోని వేడినీరుపై ఉండేట్లా చూడండి.

ఈ మిశ్రమాన్ని మీ తడిజుట్టుపై బాగా రాయండి.

అరగంట సేపు అలానే ఉండనివ్వండి.

మామూలు నీళ్లతో కడిగేయండి.

వారానికి 2-3 సార్లు ఇలా చేసి మంచి ఫలితాలు పొందండి.

4.దాల్చినచెక్క, తేనె మరియు పాల కండీషనర్ ;

4.దాల్చినచెక్క, తేనె మరియు పాల కండీషనర్ ;

దాల్చిన చెక్క మరియు తేనెను కలిపినప్పుడు కుదురుకి ప్రేరణనిస్తుంది. దాల్చిన చెక్క రక్తప్రసరణని పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పాలల్లో గ్లూటమైన్ అనే అమినో యాసిడ్ ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పాలు పాడైన జుట్టును కూడా బాగుచేసి జుట్టును మెత్తగా మృదువుగా మారుస్తుంది.

మీకు కావాల్సినవి ;

2చెంచాల దాల్చినచెక్క పొడి

2 చెంచాల తేనె

2 గుడ్లు

4 చెంచాల పాలు

అరకప్పు మయోన్నెసీ

ఎలా వాడాలి;

అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలపండి.

ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచండి.

ఈ గోరువెచ్చని మిశ్రమంను మీ జుట్టు మరియు కుదుళ్ళకు రాసుకోండి.

ఈ మిశ్రమాన్ని అరగంటసేపు ఉంచుకోండి.

మామూలు నీళ్లతో కడిగేయండి.

మైల్డ్ షాంపూను వాడండి.

వారానికి 2-3 సార్లు ఇలా చేయండి

 5.షియా బటర్,అవకాడో మరియు ఆపిల్ సిడర్ వెనిగర్ కండిషనర్

5.షియా బటర్,అవకాడో మరియు ఆపిల్ సిడర్ వెనిగర్ కండిషనర్

షియా బటర్ లో విటమిన్ ఎ,ఇ,సి ఉంటాయి.ఇవి జుట్టు ఊడటాన్ని తగ్గించి, దానితో వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది.షియా బటర్ ను జుట్టుకు సహజ సన్ స్క్రీన్ గా కూడా వాడి జుట్టు పాడవటం నుంచి కాపాడవచ్చు.

అది ఈతకొలనుల్లో ఉండే ఉప్పు మరియు క్లోరిన్ నుంచి కూడా జుట్టును రక్షిస్తుంది.

అవకాడోలో అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఉండి మాడుకు చల్లని హాయినిస్తాయి మరియు జుట్టు పెరగటాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది కూడా జుట్టుకు మంచి తేమకారిగా పనిచేస్తుంది.

యాపిల్ సిడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది,ఇది మృత చర్మకణాలను మీ తలపై తొలగించి జుట్టుకు మెరుపు,ఆకర్షణను పెంచుతుంది.

మీకు కావాల్సినవిః

అరకప్పు షియా బటర్

1 పండిన అవకాడో

3 చెంచాల ఆపిల్ సిడర్ వెనిగర్

ఎలా వాడాలి ;

మిక్సీలో అన్ని వస్తువులను వేసి బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని తలకి రాసుకుని అరగంట పాటు అలా వదిలేయండి.

గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

నెలకి రెండుసార్లు ఇలా చేసి మంచి ఫలితాలు పొందండి.

English summary

DIY Homemade Natural Conditioners For Strong And Healthy Hair

There are several factors that affect the quality of your hair. Pollution, adulterated foods, change in lifestyle, etc., also affect it. So, how can we restore the quality of our hair? Using homemade conditioners are the best way to attain strong and healthy hair.
Story first published: Saturday, January 20, 2018, 18:00 [IST]
Subscribe Newsletter