టానింగ్ ను తగ్గించగలిగే సహజ సిద్దమైన పదార్ధాలు ఇవే!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఎటువంటి లోపం లేని ప్రకాశవంతమైన, అందమైన చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ అందరికీ ఆ యోగ్యత ఉండదు. తద్వారా అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. సహజమైన అందాన్ని మించిన అందం మరొకటి లేదన్న విషయాన్ని ఎక్కువ మంది గ్రహించలేరు కూడా. తద్వారా అనేక రకాల క్రీములు, లోషన్ల మీద ఆధారపడి మొటిమలను తగ్గించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఈ ప్రయోగాలు అన్నివేళలా సత్ఫలితాలను ఇవ్వలేవన్నది గ్రహించాల్సిన సత్యం. కృత్రిమ పదార్దాలకన్నా, సహజ పదార్ధాలు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా అద్భుతమైన ఫలితాలని ఇస్తున్నాయని అనేక అద్యయనాలలో తేలింది కూడా.

ఇలాంటి సహజ సిద్దమైన పదార్ధాలలో పెరుగు, నిమ్మ, పసుపు, కలబంద, టమాటో వంటి పదార్ధాలు వంటింట్లో దొరికే సహజ సౌందర్య సాధనాలలో ఉత్తమంగా చెప్పబడినవి.

Get rid of tan instantly using these natural ingredients

ఈరోజుల్లో ఎక్కువ మంది మహిళలు సహజంగా ఎదుర్కొంటున్న సౌందర్యపరమైన సమస్యలలో టానింగ్ కూడా ఒకటి. నిజానికి ఇక్కడ లింగ భేదం లేదు. పురుషులు కూడా ఈ టానింగ్ బారిన పడుతున్నారు. చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచేలా చర్యలు తీసుకోవడం ద్వారా, కొంతమేర ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు సెలూన్లకు సమయాన్ని వెచ్చించలేకపోతున్న కారణాన, మా పేజీలో టానింగ్ ను పూర్తిగా తగ్గించే క్రమంలో భాగంగా మీముందుకు మూడు పరిష్కార మార్గాలను తీసుకుని రావడం జరిగినది.

ఈ మూడు రెసిపీలలో తక్కువ మరియు అందరికీ అందుబాటులో ఉండే సహజ సిద్దమైన పదార్దాలే ఉన్న కారణాన, ప్రత్యేకించి షాపింగ్ వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. నేరుగా వంటింటికి వెళ్లి , మీ ఫేస్ పాక్ కు కావలసిన పదార్ధాలను తీసుకోవడమే మీరు చెయ్యాల్సింది.

ఎటువంటి కృత్రిమ పదార్ధాల జోలికి వెళ్ళకుండా, మీకు మీరే ఈ ఫేస్ పాక్ ను తయారు చేసుకుని, ముఖానికి లేదా టానింగ్ ఉన్న భాగాలకు అప్లై చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరు.

మరెందుకు ఆలస్యం ఆ మూడు రెసిపీలు ఏమిటో తెలుసుకుందామా.

పెరుగు మరియు నిమ్మ ఫేస్ పాక్:

పెరుగు మరియు నిమ్మ ఫేస్ పాక్:

కావలసిన పదార్ధాలు:

2 స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం,

తయారు చేయు విధానం:

ఒక బౌల్ లో పెరుగు మరియు నిమ్మరసాన్ని నునుపుగా స్థిరంగా వచ్చేవరకు బాగుగా కలపాలి.

ముఖాన్ని క్లెన్సర్ తో లేదా చల్లని నీళ్ళతో శుభ్రపరచి, పొడి తువాలుతో ముఖాన తడి లేకుండా తుడిచి, ఈ సమ్మేళనాన్ని సున్నితంగా అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచాలి. కేవలం ముఖానికే కాకుండా టాన్ ఉన్న ప్రదేశాలలో కూడా అప్లై చేయవచ్చు. 15 నిమిషాల తర్వాత ముఖానికి బాగా పట్టిన పిదప గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగివేయవలెను.

వారానికి ఒకసారైనా ఈ ఫేస్ పాక్ అప్లై చేయడం మూలంగా గొప్ప ఫలితాలను పొందవచ్చు. ఈ మాస్క్, చర్మం మీదనున్న రంధ్రాలను పూడ్చివేసి మృతచర్మాన్ని తొలగించుటలో, మరియు చర్మానికి నిగారిoపును తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది. ఈ మాస్క్ ఎటువంటి చర్మానికైనా సరిపోతుంది.

పెరుగు వలన కలిగే ప్రయోజనాలు:

పెరుగు వలన కలిగే ప్రయోజనాలు:

పెరుగులో క్రిమి సంహారక తత్వాలు, మరియు రోగ నిరోధక శక్తి తత్వాలు అధికంగా ఉంటాయి. తద్వారా చర్మం ముడతలు పడకుండా కూడా నిరోధించగలదు.

మృత కణాలను తొలగించుటలో :

మృత కణాలను తొలగించుటలో :

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ముఖం మీది మృత చర్మాన్ని తొలగించుటలో సహాయం చేస్తుంది. తద్వారా ముఖం యవ్వనంగా, తాజాదనంతో ఆరోగ్యంగా రోజంతా ఉండుటలో సహాయం చేయగలదు.

చర్మం మెరుగుదలలో :

చర్మం మెరుగుదలలో :

పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ చర్మం ఆరోగ్యoగా పెరగడంలో సహాయ పడుతాయి.

చర్మ నిగారిoపులో :

చర్మ నిగారిoపులో :

పెరుగుకు చర్మానికి చల్లదనాన్ని అందించే గుణాలు అధికంగా ఉంటాయి. మరియు మంటను, మొటిమలను తగ్గించే క్రిమిసంహారక తత్వాలు కూడా కలిగి ఉంటుంది. మచ్చలను సైతం తగ్గించగలిగే గుణాలు కలిగి చర్మ నిగారింపులో దోహదపడుతుంది.

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుటలో :

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుటలో :

పెరుగులో ఉండే అధిక క్రొవ్వు పదార్ధాలు చర్మానికి తేమని అందివ్వడంలో సహాయం చేస్తాయి. తద్వారా చర్మం ఎక్కువకాలం హైడ్రేట్ గా ఉండేలా సహాయం చేయగలదు. మరియు కణాల పెరుగుదలలో, టానింగ్ తొలగించుటలో, మొటిమలను అరికట్టడంలో కూడా పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తన ప్రభావాలను చూపిస్తుంది.

విటమిన్ సి :

విటమిన్ సి :

నిమ్మరసంలో అధికంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మానికి నిగారిoపును తీస్కుని రావడంలో సహాయం చేస్తుంది. నిమ్మ రసం లోని క్రిమి సంహారక తత్వాలు మొటిమల నివారణలో సహాయం చేస్తుంది కూడా. రోగ నిరోధక తత్వాలు కూడా అధికంగా ఉన్న విటమిన్-సి కొల్లెజెన్ పెరగడంలో సహాయం చేస్తుంది కూడా. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి బ్లీచ్ లా పని చేసి, చర్మ సౌందర్యానికి తోడ్పాటుని అందివ్వగలదు.

నిమ్మ మరియు కలబంద ఫేస్ పాక్ :

నిమ్మ మరియు కలబంద ఫేస్ పాక్ :

కావలసిన పదార్ధాలు :

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మరియు 1 నుండి రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు లేదా రసం.

తయారు చేయు విధానం :

తయారు చేయు విధానం :

ఒక బౌల్ లో కలబంద గుజ్జుని, మరియు నిమ్మరసాన్ని తీసుకుని స్థిరంగా వచ్చు వరకు కలపాలి.

ఎలా అప్లై చేయాలి:

ఎలా అప్లై చేయాలి:

ముఖాన్ని క్లెన్సర్ లేదా చల్లని నీళ్ళతో కడిగి , టవల్ తో తుడిచివేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాక గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి.

ఎప్పుడెప్పుడు :

ఎప్పుడెప్పుడు :

టానింగ్ పూర్తిగా పోవునంతవరకు ప్రతి రోజూ ఈ ఫేస్ పాక్ వేయడం సూచించబడినది.

కలబంద (అలోవేరా) వలన కలుగు ప్రయోజనాలు :

కలబంద (అలోవేరా) వలన కలుగు ప్రయోజనాలు :

చర్మానికి మంచి మాయిస్చర్(తేమ) గుణాలను అందివ్వగలదు. మరియు కలబందలో ఉండే క్రిమి సంహారక తత్వాలు, మొటిమలతో పోరాడి వాటిని రూపుమాపే దిశగా పని చేస్తుంది. మరియు మృతకణాలను తొలగించి, చర్మ రంద్రాలని పూడ్చడంలో కూడా దీని పనితనం అద్భుతంగా ఉంటుంది.

పసుపు , టమాటో మరియు పెరుగు ఫేస్ పాక్:

పసుపు , టమాటో మరియు పెరుగు ఫేస్ పాక్:

కావలసిన పదార్ధాలు:

2 టేబుల్ స్పూన్ల పసుపు పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూన్ల టమాటో రసం.

తయారీ విధానం:

తయారీ విధానం:

ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల పసుపుపొడి, 2 టేబుల్ స్పూన్ల టమాటో రసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని స్థిరంగా వచ్చువరకు నెమ్మదిగా కలపాలి.

అప్లై చేయు విధానం:

అప్లై చేయు విధానం:

ముఖాన్ని, క్లెన్సర్ తో కానీ, చల్లని నీటితో కానీ శుభ్రంగా కడిగి, టవల్ తో నీటిని తుడిచివేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలవరకు అలాగే ఉండనివ్వాలి. పొడిగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగివేయాలి.

టమాటో వలన ఉపయోగం:

టమాటో వలన ఉపయోగం:

•టమాటో సహజ సిద్దమైన సన్ స్క్రీన్ వలె పని చేస్తుంది.

•కణ నష్టాన్ని నిరోధిస్తుంది

•సహజ సిద్దమైన బ్లీచింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది.

•మృత కణాలను తొలగిస్తుంది

ఈ వేసవికాలంలో దారుణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరియు బయటకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో సన్ స్క్రీన్ అప్లై చేసి, శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచేలా కాటన్ దుస్తులను ధరించి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎన్ని చేసినా టానింగ్ అనేది తీవ్రమైన సమస్యగానే పరిణమిస్తుంది. కావున పైన చెప్పిన పద్దతులను అనుసరించి మెరుగైన ఫలితాలను పొందగలరని సూచన.

English summary

Get rid of tan instantly using these natural ingredients

Most women these days suffer from tan problems and do not know what to do. Well, here's a solution. Going to expensive parlors is not always the solution. Home remedies work wonders for tanned skin. Curd, lemon, turmeric, yogurt, tomato juice, etc., work wonders for your skin and help you get rid of tan instantly.