For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను నయం చేయడానికి సులభమైన ఇంటి చిట్కాలు

మొటిమలను నయం చేయడానికి సులభమైన, త్వరగా అయిపోయే ఇంటి చిట్కాలు

|

మొటిమలు హఠాత్తుగా రావటం ఏ అమ్మాయికైనా పీడకలలాంటిది. అవికూడా టైము చూసుకుని ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం లేదా ఫంక్షన్ ఉన్నప్పుడే వస్తాయి. ప్రతిసారీ డెర్మటాలజిస్టు దగ్గరకి వెళ్ళటంకానీ, హఠాత్తుగా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మందులు కొనుక్కోవటం కానీ సాధ్యపడదు.

అలాంటప్పుడే ఇంటిచిట్కాలు తెలిసివుండటం ఉపయోగపడుతుంది, ఎందుకంటే వీటి పదార్థాలన్నీ దాదాపుగా మీ వంటింట్లోనే దొరుకుతాయి.

మొటిమలు సాధారణంగా చర్మరంథ్రాలు మురికితో నిండిపోవటంవలన వస్తాయి. చర్మం ఎక్కువగా సెబంను ఉత్పత్తి చేసినప్పుడు, చర్మరంథ్రాలు పెద్దవవుతాయి. దీనివల్ల ఎక్కువ మురికి ఈ రంథ్రాలలో చేరి అవి మూసుకుపోయేలా చేస్తుంది. ఈ రంథ్రాలలో సూక్ష్మజీవులు చేరి మొటిమలుగా బయటపడతాయి.

Say Goodbye To Pimples & Acne With These Homemade Face Masks

చాలా తరచుగా ఇవి నెలసరి సమయానికి దగ్గరలోనే వస్తాయి, అప్పుడు మీ హార్మోన్లన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి కదా. ఇంకా మానసిక వత్తిడి కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు, మొటిమలు నోటిద్వారా వేసుకునే గర్భనిరోధక మాత్రలు,ఇతర మందులు, హైపోథైరాయిడిజం వంటి వ్యాధుల వలన కూడా వస్తాయి.

మీకు మొటిమలు తరచుగా, హఠాత్తుగా వస్తూ, ఏం చేసినా తగ్గకపోతే, డాక్టర్ ను తప్పక కలవండి. ఇది ఏదన్నా ఆరోగ్య సమస్యకి లక్షణం కావచ్చు, నిర్లక్ష్యంగా ఉండటం మంచిదికాదు కదా!

కానీ వచ్చేసారి మొటిమలు దాడిచేసినప్పుడు ఈ కింద కొన్ని ఇంటి చిట్కాలు తప్పక పాటించండి.

1.వంటసోడా

1.వంటసోడా

వంటసోడా నీరుతో పేస్టుగా చేసి మొటిమలున్న చోట రాయండి. దీన్ని అప్పుడప్పుడు మొహమంతా కూడా రాసుకోవచ్చు. పేరుకుపోయిన మృతకణాలను ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. ఇంకా చర్మంపై పిహెచ్ బ్యాలెన్స్ నిలిపి వుంచుతుంది. మీరు పడుకోబోయేముందు దీన్ని రాసుకొని ఎండేవరకు ఉంచుకోండి. తర్వాత కడిగేయండి. మొటిమ సైజు తగ్గిపోవటం మీరే చూస్తారు.

2.అల్లం

2.అల్లం

అల్లంలో వాపు వ్యతిరేక, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి.మీ మొటిమపై అల్లం రసాన్ని రాసి, పది నిమిషాల తర్వాత కడిగేయండి. అల్లం మొహంపై ఉన్న జిడ్డును నియంత్రించి, నల్లమచ్చలను తొలగిస్తుంది కూడా. ఇదివరకు మొటిమల మచ్చలతో ఇంకా బాధపడేవారికోసం ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

3.నల్ల జీలకర్ర

3.నల్ల జీలకర్ర

వీటిల్లో ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ ఉంటాయి. ఇంకా బ్యాక్టీరియాతో పోరాడే జింక్ ఎక్కువగా ఉండి మొటిమలను తొలగిస్తుంది. దీనికోసం కొన్ని నల్లజీలకర్రను తీసుకుని తేనెతో కలిపి మొటిమలున్న చోట రాయండి. ఇరవై లేదా ఇరవైఐదు నిమిషాల తర్వాత కడిగేయండి. తేనె చర్మాన్ని ఎండిపోకుండా చేస్తుంది.

4.దాల్చినచెక్క

4.దాల్చినచెక్క

ఈ రుచికర- వాసన వచ్చే మసాలాదినుసు మీ మొటిమలు వేగంగా తగ్గటంలో చాలా సాయపడుతుంది. కొంచెం దాల్చినచెక్క పొడిని పచ్చితేనెతో కలిపి ఫేస్ మాస్క్ గా వాడండి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. దాల్చిన చెక్క మొహంలో రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది,కొంచెం చక్కిలిగింతల అనుభూతిని ఇస్తుంది. బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కలిగివుంటుంది. తేనె వాపులకి వ్యతిరేకంగా పనిచేసి, చర్మానికి ఉపశమనాన్ని ఇస్తూ తేమను కూడా అందిస్తుంది.

5.పుదీనా

5.పుదీనా

చర్మానికి చల్లదనాన్ని, ఉపశమనాన్ని ఇవ్వటమేకాక, పుదీనా మొటిమలను తగ్గించటంలో కూడా సాయపడుతుంది. పుదీనా ఆకులు, నీటితో పేస్టులా చేసి, దానికి ముల్తానీ మట్టిని కలపండి. ఈ పేస్టును మొహమంతా పట్టించండి. ఈ మాస్క్ వల్ల పెద్దవైన చర్మరంథ్రాలు మూసుకుంటాయి. పుదీనాలోని సాలిసిలిక్ యాసిడ్ మొటిమలు తగ్గించేలా చేస్తుంది, ముల్తానీమట్టి అదనంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది.ఈ మాస్క్ జిడ్డు చర్మం ఉన్నవారికి చక్కగా సరిపోతుంది. ఈ మాస్క్ ను 20 నిమిషాలు ఉంచుకుని చల్లనీరుతో కడిగేయండి.

6.నిమ్మరసం

6.నిమ్మరసం

కేవలం నిమ్మరసాన్నే మొటిమలకి నేరుగా వాడవచ్చు, ఇది సెబం ఉత్పత్తిని సమం చేసి, సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ కావడం వలన చర్మంపై గాఢంగా ఉన్న మచ్చలని తేలికపరుస్తుంది. మీకు సున్నితమైన చర్మం ఉంటే ఈ చిట్కాతో జాగ్రత్తగా ఉండండి,లేకపోతే మంటపుడుతుంది. నిమ్మరసాన్ని మీ మొహం అంతా రాసుకుని పదినిమిషాల తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7.గుడ్డు తెల్లసొన

7.గుడ్డు తెల్లసొన

తెల్లసొన యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, విటమిన్ ఎ,ఇ కలిగివుంటుంది. ఈ రెండు విటమిన్లు చర్మసంరక్షణలో ఉపయోగపడేవే. తెల్లసొన చర్మంపై మృతకణాలను తొలగించటానికి పీల్ గా పనికొస్తుంది. తెల్లసొనను ముఖమంతా రాసుకొని, ఎండిపోయాక ఆ పొరలను పీకేయండి. దీని వల్ల ఇకముందు మొటిమలు రాకుండా నివారించబడుతుంది.

English summary

Say Goodbye To Pimples & Acne With These Homemade Face Masks

Dealing with skin problems, especially pimples and acne, can be quite frustrating. There are some simple and easy hacks which will keep your skin free from pimples and acne for a long time. Baking soda mask, ginger mask, cinnamon mask or tea tree oil mask, etc., could be some interesting hacks you might want to try.
Story first published:Wednesday, April 11, 2018, 15:52 [IST]
Desktop Bottom Promotion