For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడపై నల్లమచ్చలను తొలగించటానికి ఇంటిచిట్కాలు

మెడపై నల్లమచ్చలను తొలగించటానికి ఇంటిచిట్కాలు

|

ముఖంపై చర్మంలాగానే, మెడపై చర్మాన్ని కూడా సంరక్షించటం ముఖ్యం. కొన్నిసార్లు మెడపై వచ్చే నల్లని మచ్చలు చర్మాన్ని నల్లగా, అందవికారంగా కన్పించేలా చేయటమేకాదు, చర్మాన్ని పొడిగా,పొట్టుగా ఊడిపోయేలా కూడా చేస్తాయి.

మెడపై నల్లమచ్చలు రంగును ఉత్పత్తి చేసే కణాలు,నియంత్రణలో లేకపోతే వస్తాయి. అలాగే ఎండలో ఎక్కువ తిరగటం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల కూడా రావచ్చు.

అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇంటి చిట్కాలను వాడి మెడపై మచ్చలను సులభంగా తొలగించుకోవచ్చు. ఈరోజు నల్లమచ్చలను తొలగించటానికి ఇంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. చదవండి.

1)యాపిల్ సిడర్ వెనిగర్, టమాటా

1)యాపిల్ సిడర్ వెనిగర్, టమాటా

యాపిల్ సిడర్ వెనిగర్ ,టమాటాల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు నల్లమచ్చలను తేటపర్చటంలో, చర్మంపై ఏ రకమైన చారల మచ్చలను తొలగించటంలో సాయపడతాయి.

కావాల్సిన వస్తువులు

2చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్

1 మీడియం సైజు టమాటా

ఎలా చేయాలి

మొదట టమాటాను ఉడికించి,మెత్తగా పేస్టులా చేయండి. తర్వాత వెనిగర్ ను వేసి కలపండి. దీన్ని మెడకి రాసి 30 నిమిషాలు అలా వదిలేయండి. 30 నిమిషాల తర్వాత చల్లనీరుతో కడిగేయండి. ఈ చిట్కాను వారానికి మూడుసార్లు మంచి ఫలితాలకోసం పాటించవచ్చు.

2)కొబ్బరినూనె, వంటసోడా

2)కొబ్బరినూనె, వంటసోడా

వంటసోడా, కొబ్బరినూనెల కాంబినేషన్ మెడపై నల్లమచ్చలను సులభంగా తగ్గించటంలో సాయపడుతుంది. ఇంకా ఈ పేస్టును రాసుకోవటం వలన చర్మం హైడ్రేట్ అయి పగుళ్ళు రాకుండా, పొడిబారకుండా ఉంటుంది.

కావాల్సిన వస్తువులు

2 చెంచాల కొబ్బరినూనె

2 చెంచాల వంటసోడా

ఎలా చేయాలి

ఒక శుభ్రమైన బౌల్ లో వంట సోడాను తీసుకోండి. దీన్ని కొబ్బరినూనెతో కలిపి గట్టి పేస్టులా చేయండి. ఇప్పుడు ఈ పేస్టును మెడపై ఉన్న నల్లమచ్చలపై రాయండి లేదా మొత్తం మెడకే పట్టించండి. 20 నిమిషాలు అలా ఉండనిచ్చి మామూలు నీటితో కడిగేయండి.

 3)పెరుగు,పంచదార

3)పెరుగు,పంచదార

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ నల్ల మచ్చలని నయం చేస్తుంది. ఇంకా, చక్కెరలోని ఎక్స్ ఫోలియేటింగ్ లక్షణాలు చనిపోయిన చర్మకణాలను తొలగించటంలో సాయపడి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కావాల్సిన వస్తువులు

2చెంచాల పెరుగు

2చెంచాల పంచదార

కొన్ని చుక్కల నిమ్మరసం

ఎలా చేయాలి

మొదట పెరుగు, చక్కెరను శుభ్రమైన బౌల్ లో వేయండి. తర్వాత తాజా నిమ్మరసాన్ని మిశ్రమంలో వేసి మొత్తాన్ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ మెడపై కొనవేళ్ళతో గుండ్రంగా మసాజ్ చేయండి.

ఇలా 3-4నిమిషాలు చేయండి. తర్వాత 15 నిమిషాలు అలా వదిలేసి మామూలు నీటితో కడిగేయండి. మంచి ఫలితాల కోసం ఈ చిట్కాను వారంలో 2-3 సార్లు అయినా కనీసం పాటించండి.

5)నిమ్మ, ఉల్లిపాయ

5)నిమ్మ, ఉల్లిపాయ

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మెడ మీద నల్ల మచ్చలను తేటపరుస్తాయి.

కావాల్సిన వస్తువులు

1 మీడియం సైజు ఉల్లిపాయ

2చెంచాల నిమ్మరసం

ఎలా చేయాలి

ఉల్లిపాయను మెత్తని పేస్టులా చేయండి. దానికి నిమ్మరసం కలిపి రెండింటినీ బాగా కలపండి. తర్వాత దీన్ని మీ మెడపై రాసుకుని 15 నిమిషాలు అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.

English summary

Home Remedies To Treat Dark Spots On Neck

Sometimes dark spots starts appearing on the neck that not only makes the skin look dark and ugly but also makes the skin dry and flaky. Dark spots appears on the neck when the cells that produce pigmentation are out of control. It can also appear due to reasons like over exposure to the sun, hormonal imbalances, etc. You can use home remedies for this.
Desktop Bottom Promotion