ప్రకాశవంతమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు తోడ్పడే అలోవెరా ఫేస్ మాస్క్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చర్మ సంరక్షణలో అలోవెరా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ కాస్మెటిక్స్ లో ఎక్కువ శాతం వాటి తయారీలో అలోవెరా ని ప్రముఖంగా కలిగి ఉన్నవే. దేనితోనూ మిక్స్ చేయకుండా అలో లీవ్స్ నుంచి జెల్ ను సేకరించి దానిని చర్మంపైకి అప్లై చేయవచ్చు కూడా.

స్వచ్ఛమైన అలోవెరా జెల్ లో అనేకమైన హీలింగ్ ప్రాపర్టీస్ కలవు. యాక్నే నుంచి అలాగే చర్మంపై ఇంఫ్లేమేషన్ ను తొలగించేందుకు అలోవెరా తోడ్పడుతుంది. అదే సమయంలో చర్మంపైన బంప్స్ సైజ్ ను తగ్గించేందుకు కూడా అలోవెరా తోడ్పడుతుంది. యాక్నే అనేది చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. వాటిని తొలగించే వరకు ప్రశాంతత ఉండదు. అలోవెరా అనేది సున్నితంగా యాక్నేను తొలగించి చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది.

 Aloe Vera Face Masks For Bright And Glowing Skin

ఎండలో ఎక్కువ సేపు ఉండటం వలన చర్మంపై కలిగే దుష్ప్రభావాల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు అలోవెరా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎండలో ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినప్పుడు చర్మంపై మంట మొదలవుతుంది. అప్పుడు కాస్తంత అలోవెరా జెల్ ని చర్మంపై అప్లై చేస్తే చర్మం ఉపశమనం చెందుతుంది.

ఈ రోజు, అలోవెరా ను ఉపయోగించి తయారుచేసుకునే కొన్ని ఫేస్ మాస్క్స్ ను వివరించబోతున్నాము. వీటిని, ఇంటివద్దే సులభంగా తయారుచేసుకుని కాంతివంతమైన అలాగే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

1. అలోవేరా స్క్రబ్ :

1. అలోవేరా స్క్రబ్ :

చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేయడమనేది చర్మసంరక్షణలో ప్రధానమైన అంశం. ఎక్స్ఫోలియేషన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని తేటపరుస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ వలన చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. కాబట్టి, ఇంటి వద్దే సహజసిద్ధమైన పదార్థాలతో స్క్రబ్స్ ని తయారుచేసుకుని వాడితే చర్మం నిగనిగలాడుతుంది.

ఈ స్క్రబ్ తయారుచేయడానికి మీకు అలోవెరా జెల్ అలాగే పెరుగు అవసరపడతాయి. అలాగే కాస్తంత బ్రౌన్ లేదా వైట్ షుగర్ కూడా అవసరం. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి ఈ ప్యాక్ ను ఫేస్ పై సర్క్యూలర్ మోషన్ లో రబ్ చేస్తూ అప్లై చేయాలి. ఇలా రబ్ చేయడం ద్వారా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి.

అలో వెరా జెల్ అనేది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ప్రశాంతపరుస్తుంది. పెరుగులో లభించే ల్యాక్టిక్ యాసిడ్ అనేది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది. షుగర్ లో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించే సామర్థ్యం లభ్యమవుతుంది. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటిస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

2. యాక్నేను నిర్మూలించేందుకు:

2. యాక్నేను నిర్మూలించేందుకు:

యాక్నే అనేది చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. దీని వలన చర్మంపై స్కార్స్ కూడా ఏర్పడతాయి. ఈ మాస్క్ తయారీకి అలోవెరా జెల్, కాస్తంత నట్ మగ్ పౌడర్ అలగే కొన్ని చుక్కల నిమ్మరసం అవసరం. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి ఒక చిక్కటి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి.

ఈ ప్యాక్ ను కనీసం 10 నిమిషాల వరకు ముఖంపై ఉండనివ్వాలి. ఆ తరువాత చల్లటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించాలి. ఇంఫ్లేమ్డ్ స్కిన్ పై అలోవెరా చక్కగా పనిచేస్తుంది. నట్ మెగ్ పౌడర్ లో సెబమ్ ప్రొడక్షన్ ని నియంత్రించే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. నిమ్మరసంలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ స్కార్స్ ని తగ్గించడానికి తోడ్పడతాయి.

3. డ్రై స్కిన్ కోసం:

3. డ్రై స్కిన్ కోసం:

డ్రై స్కిన్ అనేది చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలోవెరా జెల్ అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. డ్రై స్కిన్ కలిగిన వారికీ అలోవెరా జెల్ ఒక వరం వంటిది. కాస్తంత అలోవెరా జెల్ ని ఆలివ్ ఆయిల్, తేనె మరియు లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తో కలపాలి.

వీటన్నిటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ముప్పై నిమిషాల తరువాత ఈ ప్యాక్ ను తొలగించాలి. ఈ మాస్క్ లో వాడిన ఆయిల్స్ కు డ్రై స్కిన్ ను డీల్ చేసే లక్షణం కలదు. డ్రై స్కిన్ వలన స్కిన్ ఏజింగ్ త్వరగా సంభవిస్తుంది. కాబట్టి, డ్రై స్కిన్ సమస్య ఎదురవుతున్నప్పుడు వెంటనే ఈ ప్యాక్ ను ప్రయత్నించి మంచి ఫలితం పొందండి.

4. ఆయిలీ స్కిన్:

4. ఆయిలీ స్కిన్:

అలోవెరా జెల్ లో కాస్తంత టమాటో గుజ్జును అలాగే పెరుగును కలపాలి. టమాటో గుజ్జు అనేది అస్ట్రింజెంట్ గా పనిచేసి స్కిన్ పోర్ సైజ్ ను తగ్గిస్తుంది. యోగర్ట్ లో లభించే ల్యాక్టిక్ యాసిడ్ అనేది స్కిన్ ని ఎక్స్ఫోలియెట్ చేయడానికి తోడ్పడుతుంది.

ఈ మాస్క్ అనేది ఆయిలీ ఫేస్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. యాక్నే మరియు పింపుల్స్ వలన ముఖంపై ఏర్పడిన మాస్క్స్ ను తొలగిస్తుంది. ఈ పేస్ట్ ను ఫేస్ మాస్క్ లా అప్లై చేసి ముప్ఫై నిమిషాల తరువాత తొలగిస్తే చర్మం కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

5. సెన్సిటివ్ స్కిన్ కోసం:

5. సెన్సిటివ్ స్కిన్ కోసం:

సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారిలో బ్రేక్ అవుట్స్ సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అలాగే ఏజింగ్ సైన్స్ త్వరగా దర్శనమిస్తాయి. ఫ్లేకీనెస్ కూడా కనిపిస్తుంది. ఈ మాస్క్ కోసం అలోవెరా జెల్ ను అలాగే బొప్పాయి గుజ్జును కలపాలి. ఫేస్ ప్యాక్ లా ఈ మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

ఈ ప్యాక్ ను ముఖానికి సున్నితంగా అప్లై చేయాలి. ఈ మాస్క్ అనేది చర్మానికి ఆహారంలా పనిచేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మాన్ని ఫర్మ్ గా ఉంచుతుంది. యాక్నేను ప్రివెంట్ చేస్తుంది. అలాగే, ఈ మాస్క్ ను వాడటం ద్వారా ఇన్స్టెంట్ గ్లో ను పొందవచ్చు. మల్టీ టాస్కింగ్ మాస్క్ లా ఇది పనిచేస్తుంది.

6. ట్యాన్ కలిగిన చర్మం కోసం:

6. ట్యాన్ కలిగిన చర్మం కోసం:

స్కిన్ ట్యానింగ్ అనేది మీ అఫియరెన్స్ ను దెబ్బతీయడంతో పాటు ప్రమాదకరం కూడా. ఏజింగ్ ను త్వరగా ఆకర్షిస్తుంది ఈ ట్యానింగ్. కాబట్టి, ట్యానింగ్ ఎఫెక్ట్స్ ని రివర్స్ చేసేందుకు యాంటీ ట్యానింగ్ ఇంగ్రీడియెంట్స్ అయిన అలోవెరా జెల్, యోగర్ట్ మరియు లెమన్ జ్యూస్ లను కలిపి ఒక ప్యాక్ ను తయారుచేసుకోవాలి.

అలోవెరా చర్మాన్ని ప్రశాంతపరిచేందుకు తోడ్పడుతుంది. యోగర్ట్ మరియు నిమ్మరసం చర్మాన్ని లైటెన్ చేసేందుకు తోడ్పడతాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి కూడా ఈ మాస్క్ ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ లో లభించే సిట్రిక్ యాసిడ్ అనేది దృఢమైన బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ మాస్క్ ను ట్యాన్ నుంచి రక్షణకై వినియోగించవచ్చు.

English summary

Aloe Vera Face Masks For Bright And Glowing Skin

Aloe Vera Face Masks For Bright And Glowing Skin,Using aloe vera for face can enhance the glow on your face . So read ti know which are the best aloe vera face packs that are best for your skin