For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి కురుపుల నివారణకు గృహవైద్య చికిత్స

|

వేడి కురుపులు సాధారణంగా మనల్ని బాధపెట్టే సమస్యల్లో ముఖ్యమైనవి, మరీ ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా వస్తాయి. ముఖం మీద పెద్ద పెద్ద వ్రాణాలలా ఏర్పడి చూడటానికి అసహ్యంగా మన ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉంటాయి.

మొటిమల వలె, వేడి కురుపులు కూడా త్వరగా వ్యాపిస్తాయి. ఇవి మీ ముఖం మీద మాత్రమే కాక, తలతో పాటు మీ శరీరం మీద ఏ భాగం పైనైనా వస్తాయి. వేడి కురుపులు త్వరగా వ్యాపించడమే కాక, మచ్చలను వదిలి వెళ్తాయి. అవి చూడటానికి అసహ్యంగా ఉంటాయి.


శరీరంలో అంతర్గతంగా వేడి పెరిగిపోవడంతో వేడి కురుపులు ఏర్పడతాయి. సెబం ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. ఇది ముఖ్య కారణమైన్నప్పటికిని, చెడు ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధులు, మధుమేహం, మద్యపానం మొదలైన అలవాట్ల వలన కూడా ఏర్పడతాయి.

వీటి నివారణకై మార్కెట్లో ఎన్నో రకసల క్రీములు, ఆయింట్మెంటులు లభిస్తున్నాయి. అయినప్పటికీ, మేము ఇప్పుడు గృహ వైద్య చిట్కాల ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలియజేయబోతున్నాము. ఎందుకంటే, సహజ ప్రత్యామ్నాయ పద్ధతులు ఎటువంటి దుష్పరిణామాలకు దారితీయవు పైగా100 శాతం సురక్షితమైనవి. సులువుగా మరియు త్వరగా, ఇంట్లోనే కూర్చుని వేడి కురుపులను ఎలా అరికట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో యాంటిఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉన్నందున, చర్మానికి కలిగిన ఎటువంటి నష్టాన్నైనా సరిచేసి, ఇన్ఫెక్షన్లు కలుగకుండా చేస్తుంది.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

1 టీ స్పూన్ పసుపు

తయారీ విధానం:

1. ఒక గిన్నెలో, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి.

2. దీనికి చిటికెడు పసుపు కలపండి.

3. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంలో రాసుకుని, 20 నుండి 30 నిమిషాలు పాటు ఆరనివ్వండి.

4. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని, పొడిగా తుడుచుకోండి.

కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు:

కలబందలో తేమను అందించే గుణాలుంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా మరియు చర్మరంధ్రాలు మూసుకుపోకుండా చేస్తాయి.

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్లు గుజ్జు

తయారీ విధానం:

1. ఒక తాజా కలబంద ఆకును తీసుకుని, గుజ్జును వెలికితీయండి.

2. ఈ గుజ్జును ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని, రాత్రంతా అలా వదిలేయండి.

3. మరుసటి రోజు ఉదయం నీటితో ముఖం కడుక్కుని, పొడిగా ఒత్తుకోండి.

మీరు ప్రతిదినం రాత్రి పడుకోబోయే ముందు, ఇలా చేసి చూడండి.

ఐస్ ముక్కలు:

ఐస్ ముక్కలు:

ఐస్ ముక్కలకు వేడి కురుపుల వలన చర్మం పై కలిగే ఎర్రదనం, నొప్పి మరియు మంటను తగ్గించే గుణం ఉందని మనందరికీ తెలిసిందే!

కావలసిన పదార్థాలు:

3-4 ఐస్ ముక్కలు

ఒక గుడ్డ

వాడే విధానం:

1. ముద్దుగా ఐస్ ముక్కలను ఒక గుడ్డలో వేసి చుట్టండి.

2. ప్రభావిత ప్రదేశంలో దీనితో కొంతసేపు రుద్దండి.

3. తరువాత శుభ్రమైన గుడ్డతో ముఖాన్ని పొడిగా తుడుచుకోండి.

ఐస్ ముక్కలను గుడ్డలో చుట్టకుండా చర్మం మీద రుద్దకూడదు. మీ చర్మం సున్నితమైనదైతే, ఇలా చేస్తే, దుష్ప్రభావం పడుతుంది.

కీరా దోసకాయ:

కీరా దోసకాయ:

కీరా దోసకాయలలో చర్మాన్ని చల్లబరచి, అధిక నూనె ఉత్పత్తిని తగ్గింపజేసే గుణాలు మెండుగా ఉన్నాయి. దీనిని సక్రమంగా ఉపయోగిస్తే, చర్మంపై వేడి కురుపులు తగ్గుతాయి.

కావలసిన పదార్థాలు:

కీరా దోసకాయ సగం

తయారీ విధానం:

1. ముందుగా కీరాదోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.

2. తరువాత వీటిని గ్రైండ్ చేసి ముద్దగా చేయండి.

3. ఈ ముద్దను వేడి కురుపులు ఎక్కువగా ఉన్న చోట పూసుకోండి.

4. ముప్ఫై నిమిషాలు పాటు అలా వదిలేసి, బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ముద్దను వారానికి రెండు మూడు సార్లు రాసుకుంటే అద్భుతమైన ఫలితాలు త్వరగా వస్తాయి.

ఆముదం:

ఆముదం:

ఆముదం చర్మం మీద అధికంగా పేరుకున్న జిడ్డును తొలగించడమే కాక, మృతకణాలను కూడా తొలగించి, చర్మ రాంధ్రాలు పూడుకుపోకుండా చేస్తాయి.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఆముదం

1 టీ స్పూన్ గంధం

తయారీ విధానం:

1. ఆముదంలో గంధం పొడి వేసి బాగా కలపండి.

2. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి.

3. ఇరవై నిమిషాల తరువాత, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.

ఇలా వారానికి 3-4 సార్లు చేయాలి.

తప్పక పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు:

తప్పక పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు:

1. సూర్యుని కిరణాలకు వీలైనంత సమయం దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

2. పదేపదే ముట్టుకుంటే మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక, మీకు ఈ అలవాటు ఉన్నట్లైతే, వీలయినంత త్వరగా మానుకోండి.

3. ఎప్పుడు ఉడికిన, శుభ్రమైన వస్త్రాలు ధరిస్తే ఇన్ఫెక్షన్లు మీ దరికి చేరవు.

4. సమతుల ఆహారం తీసుకోవాలి.

5. ఎక్కువగా నీటిని తాగండి. ఇలా చేస్తే మీ చర్మానికి అవసరమైన తేమ సమకూరి, వేడి కురుపులు కలిగే అవకాశం తగ్గుతుంది.


English summary

Homemade Remedies To Treat Heat Pimples

Heat pimples can be something that bothers all of us in common, especially during summer. Big painful bumps on your face can make you feel embarrassed and may affect your self-confidence. Unlike normal pimples and acne, heat pimples tend to spread very fast. It not only appears on your face but it can also can appear on any part of the body, including your head. Heat pimples, along with spreading fast, can also cause patches on your skin, which is not that pleasant to look at.
Story first published: Thursday, June 28, 2018, 14:30 [IST]
Desktop Bottom Promotion