For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండాకాలంలో మీ జుట్టును ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి

|

ఎండాకాలం మొత్తం మీ జుట్టు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారా? అలా అయితే చదవండి, ఈ రోజు బోల్డ్ స్కైలో ఎండాకాలంలో వేడి పెరిగినప్పుడు జుట్టును మృదువుగా, మెరుపుగా ఉంచుకునే ఉపయోగపడే చిట్కాలను అందిస్తున్నాం, ప్రయత్నించండి.

మాడిపోయే వేడి, కఠినమైన ఎండ ఇంకా కలుషితమైన గాలి ఆరోగ్యం, జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఎగిరిపోవటం నుంచి జుట్టు ఊడిపోవటం వరకూ, ఎండాకాలంలో ఆడవారికి రకరకాల జుట్టుకి సంబంధించిన సమస్యలు రావడం అసాధారణమేం కాదు.

how to keep tresses healthy,

కానీ,సరైన సంరక్షణతో, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు కూడా మీ జుట్టును రక్షించుకోవచ్చు.ఈ కింద ఇచ్చిన చిట్కాలను పాటించి జుట్టును సంరక్షించుకోండి.

ఇంకా, మీ హెయిర్ రొటీన్ లో కావాల్సిన మార్పులను తెచ్చుకుని, ఎండాకాలంలో మీ జుట్టుపాయలు సరిగ్గా, అందంగా ఉండేట్లా చూసుకోండి.

జుట్టును రక్షించుకునే చిట్కాలు ఇవిగో;

1.బ్లో డ్రయర్ల నుంచి దూరంగా ఉండండి

1.బ్లో డ్రయర్ల నుంచి దూరంగా ఉండండి

ఎండాకాలంలో బ్లో డ్రయర్లను వాడవద్దు. ఎక్కువ వేడి మీ జుట్టుకు నష్టం కలిగించటమే కాదు,ఎగిరిపోతూ,చూడటానికి అందంగా కన్పించకుండా తయారవుతుంది. అందుకనే దానికి బదులు మీ జుట్టును గాలికి ఆరనివ్వండి , ఎండాకాలంలో జుట్టుకి ఎక్కువ వేడిని తగలనివ్వకండి.

2. హెయిర్ సీరంను వాడండి

2. హెయిర్ సీరంను వాడండి

హెయిర్ సీరంలు మీ పాయలకి మంచి తేమనిచ్చి హైడ్రేట్ చేస్తాయి. మీ జుట్టు రకానికి సరిపోయే హెయిర్ సీరంను కొనుక్కొని, మీ జుట్టుకు దానితో పోషణనివ్వండి. ఇది మీ వెంట్రుకలలో తేమ తొలగిపోకుండా చూడటమే కాదు, మెరుపుని కూడా జతచేస్తాయి.

3.మీ జుట్టును కప్పుకోండి

3.మీ జుట్టును కప్పుకోండి

స్కార్ఫ్ లేదా టోపీతో మీ జుట్టును కవర్ చేసుకోండి. సూర్యకాంతికి ఇంకా కలుషితమైన గాలి నేరుగా జుట్టుకి తగలటం వలన నష్టం జరగటమే కాదు, జుట్టు కఠినంగా మారి , సంరక్షించటం కష్టమవుతుంది.

4. మీ జుట్టును ఎప్పుడూ ముడి లేదా జడ వేసుకోండి

4. మీ జుట్టును ఎప్పుడూ ముడి లేదా జడ వేసుకోండి

వాతావరణం వేడిగా మారినప్పుడు, జుట్టును జడలా అల్లుకోవడమో, ముడిపెట్టుకోవడమో మంచిది. ఈ సింపుల్ పని ఎండాకాలంలో మీ జుట్టును చాలా బాగా ఉంచుతుంది. జుట్టు ఊడిపోవటం అరికట్టడమే కాదు, జుట్టు చిందరవందర అయి, చిక్కుపడటం నుంచి కూడా కాపాడుతుంది.

5.రాత్రంతా నూనెతో చికిత్స

5.రాత్రంతా నూనెతో చికిత్స

రాత్రిపూటంతా నూనెరాసి వదిలేయడం జుట్టు స్థితిని చాలా మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని ఆలివ్ నూనె లేదా కొబ్బరినూనెను రాత్రిపూట తలకి మసాజ్ చేసి అలా వదిలేయండి. ఇది మీ కుదుళ్ళ నుంచి పోషణనిచ్చి, ఎండాకాలంలో వేడితో చక్కగా పోరాడుతుంది.

6.ట్రిమ్ చేయించుకోండి

6.ట్రిమ్ చేయించుకోండి

ఎండాకాలంలో వేడి, తేమ మీ జుట్టుపై తీవ్ర ప్రభావం చూపి, వెంట్రుక చివర్లు విరిగిపోయి అందంగా కన్పించవు. అందుకే అప్పుడప్పుడూ వెంట్రుక చివర్లను ట్రిమ్ చేయించడం మంచిది.

7.జుట్టుకి రాసి వదిలేసే కండీషనర్లు వాడండి

7.జుట్టుకి రాసి వదిలేసే కండీషనర్లు వాడండి

ఎండాకాలంలో వేడి, తేమ లేకపోవటం నుంచి జుట్టును రక్షించటానికి జుట్టుకి రాసి వదిలేసే కండీషనర్లు వాడంది. ఈ జుట్టు ఉత్పత్తి మీ కుదుళ్ళకి తేమను అందించి రోజంతా మీ వెంట్రుకలు మృదువుగా, ఎలా అయినా మలుచుకునే విధంగా ఉండేట్లు చేస్తుంది.

8.తేమనిచ్చే హెయిర్ మాస్క్ లను ప్రయత్నించండి

8.తేమనిచ్చే హెయిర్ మాస్క్ లను ప్రయత్నించండి

గాలిలో తేమ లేకపోవటం వలన మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతిని, ఎండిపోయినట్లుగా అయిపోతుంది. ఇలా జరగకుండా నివారించటానికి మీ జుట్టుకి తేమనిచ్చే హెయిర్ మాస్క్ లను వాడండి. బ్యూటీ స్టోర్ల నుంచి అలాంటి ఉత్పత్తులు కొనండి లేదా ఇంట్లోనే అరటిపండు, గుడ్లు, ఆలోవెరా జెల్ వంటి సహజపదార్థాలను కలిపి ఒకటి తయారుచేసుకోండి.


English summary

how to keep tresses healthy | tips to keep tresses healthy | different ways to keep tresses healthy

how to keep tresses healthy, tips to keep tresses healthy, different ways to keep tresses healthy,Want to keep your tresses happy and healthy all summer long? Then here are some most useful tips for maintaining silky and smooth hair when the weather heats up. Check them out!
Desktop Bottom Promotion