Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇంటివద్దే బ్లాక్ హెడ్ రిమూవర్ ని తయారుచేయడం ఎలా?

బ్లాక్ హెడ్స్ ని తొలగించడం కష్టమని అనేకసార్లు మనం భావించి ఉంటాము. బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తామని ఎన్ని స్క్రబ్స్ యొక్క బ్రాండ్స్ ప్రకటించుకున్నా అవన్నీ బ్లాక్ హెడ్స్ ని నిర్మూలించడం దాదాపు అసాధ్యమని మనం వాటిని ఉపయోగించాక తెలుసుకున్న విషయం.
బ్లాక్ హెడ్స్ ని స్టోర్ నుంచి తెచ్చుకున్న స్క్రబ్స్ తొలగించకపోతే మనం ఎంతో ఆందోళనకు గురవుతాము. ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఒక స్క్రబ్ ని వాడితే దాని ద్వారా తగిన ఫలితం లభించకపోతే మనం అసౌకర్యానికి గురవుతాము. అలాగే, స్టోర్స్ లో లభించే మెటల్ బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్టర్ మీకు కాస్తంత నొప్పిని కూడా కలిగించే అవకాశం లేకపోలేదు.
కాబట్టి, బ్లాక్ హెడ్స్ ని ఇంటివద్దే సులభంగా తొలగించుకునే విధానాలని ఈ ఆర్టికల్ లో వివరించాము. తద్వారా, మీకు చికాకును కలిగించే బ్లాక్ హెడ్స్ నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. ఈ విధానాలలో ఎక్కువగా ఇంటివద్దే లభించే పదార్థాలను ఉపయోగించాము. ఈ పద్దతులను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.
బ్లాక్ హెడ్స్ ని ఇంటివద్దే తొలగించుకునేందుకు రెండు పద్దతులను మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ రెండిటినీ పాటించి ఏ పద్దతి మీకు అనుగుణంగా ఉందో తెలుసుకోండి. ఆ పద్దతిని పాటించండి.


పద్దతి 1:
ఈ పద్దతిలో ఒక టీస్పూన్ తేనెని ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిలో కలపండి. వీటిని బాగా కలిపితే తయారైన మిశ్రమాన్ని ముక్కుపై సన్నటి పొరలా అప్లై చేయండి. ఇప్పుడు, దానిపైన శుభ్రమైన కాటన్ స్ట్రిప్ ను అమర్చి గట్టిగా అయిన తర్వాత తొలగించాలి.



Click it and Unblock the Notifications