For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సిటివ్ స్కిన్ ని సంరక్షించుకోవడం ఎలా?

|

సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు అనుభవించే చర్మ సమస్యలు అన్నీఇన్నీ కావు. మొటిమలతో పాటు అనేకరకాలైన చర్మసమస్యలు సెన్సిటివ్ స్కిన్ పై దాడి చేస్తూ ఉంటాయి. చర్మ సంరక్షణకై వాడే కెమికల్ ప్రాడక్ట్స్ వలన కూడా సెన్సిటివ్ స్కిన్ అనేది అనేక ఇబ్బందులను ఎదుర్కుంటుంది.

ఇటువంటి స్కిన్ ని సంరక్షించుకోవడం అంత సులభమేమీ కాదు. ఒకవేళ, మీరు సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారయితే చర్మ సంరక్షణకై మీరు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా సెన్సిటివ్ స్కిన్ అనేది ఇబ్బందులకు గురవకుండా చూడగలుగుతారు.

How To Take Care Of Sensitive Skin

చర్మసంరక్షణ ప్రక్రియ అనేది మరింత సులభతరం చేసేందుకు, ఈ రోజు అత్యంత సులభమైన అలాగే ప్రభావవంతమైన చిట్కాలను ఈ ఆర్టికల్ లో పొందుపరిచాం. వీటిని పాటించడం ద్వారా మొటిమలు, చర్మం ఎర్రబడటం, దద్దురులు వంటి చర్మ సమస్యల బారిన పడకుండా మీ సెన్సిటివ్ స్కిన్ ను సంరక్షించుకోండి.

ఈ టిప్స్ ని సరైన విధంగా పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందండి.

1. సున్నితంగా వ్యవహరించండి:

1. సున్నితంగా వ్యవహరించండి:

ఈ నియమం అనేది సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు తప్పక పాటించవలసిన ముఖ్య నియమం. మీ చర్మాన్ని సున్నితంగా సంరక్షించుకోండి. కఠినంగా వ్యవహరించడం వలన చర్మంపై ఎర్రదనం అలాగే దద్దుర్లతో కూడిన దురదలు కలుగుతాయి. స్కిన్ కేర్ ప్రాడక్ట్ ని అప్లై చేసినప్పుడు అలాగే స్కిన్ పై మేకప్ ని తొలగించేటప్పుడు మృదువుగా వ్యవహరించండి. తద్వారా, రాబోయే చర్మ సమస్యలను అరికట్టగలుగుతారు.

2. స్కిన్ ప్యాచ్ టెస్ట్ లు తప్పనిసరి

2. స్కిన్ ప్యాచ్ టెస్ట్ లు తప్పనిసరి

సెన్సిటివ్ స్కిన్ ను సంరక్షించుకునే మరొక మార్గం ఇది. ఏదైనా బ్యూటీ ప్రాడక్ట్ ని వాడేముందు మీరు తప్పనిసరిగా స్కిన్ ప్యాచ్ టెస్ట్ ను నిర్వహించుకోవాలి. లేదంటే, ఆయా ప్రాడక్ట్స్ వలన కలిగే దుష్ప్రభావాలకు లోనవవలసి వస్తుంది. ప్యాచ్ టెస్ట్ ద్వారా మీ చర్మానికి సూట్ అయ్యే ప్రాడక్ట్ ని ఎంచుకుని ఆ ప్రాడక్ట్ ని మాత్రమే వాడవచ్చు.

3. స్కిన్ క్లీన్సింగ్ ఫిషియల్ వైప్స్ ని వాడండి

3. స్కిన్ క్లీన్సింగ్ ఫిషియల్ వైప్స్ ని వాడండి

ముఖంపై చర్మంలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించేందుకు అలాగే మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిచేందుకు స్కిన్ క్లీన్సింగ్ ఫిషియల్ వైప్స్ ని ఉపయోగించడం తప్పనిసరి. వీటిని సెన్సిటివ్ చర్మం కలిగిన వారు తమ బ్యాగ్ లో ఎల్లప్పుడూ ఉంచుకోవడం ఉత్తమం. తద్వారా, అవసరమైనప్పుడు వీటిని వాడవచ్చు. చర్మాన్ని అత్యంత శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మొటిమల వంటి సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు.

4. ఏడాది పొడవునా సన్ స్క్రీన్ ను ఉపయోగించండి

4. ఏడాది పొడవునా సన్ స్క్రీన్ ను ఉపయోగించండి

సెన్సిటివ్ స్కిన్ అనేది తరచూ దెబ్బతింటుంది. యూవీ రేస్ కి ఏమాత్రం గురయినా చర్మం ఎర్రబడుతుంది. ఇంఫ్లేమేషన్ కి కూడా గురవుతుంది. కాబట్టి, సంస్క్రీన్ ను అప్లై చేయడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా సంస్క్రీన్ ను వాడటం తప్పనిసరి.

5. మేకప్ ను తక్కువగా వినియోగించండి

5. మేకప్ ను తక్కువగా వినియోగించండి

ఎక్కువగా మేకప్ ని వినియోగించడం ద్వారా సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు అనేక చర్మ సమస్యలకు స్వాగతం పలికినవారవుతారు. కాబట్టి, చర్మం అందంగా కనిపించేందుకు చర్మ సౌందర్యానికి అవసరమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోండి. మేకప్ అవసరమైనప్పుడు తక్కువగా వినియోగించడం నేర్చుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ఆహారం ద్వారా చర్మానికి కాంతి లభిస్తుంది. తక్కువగా మేకప్ ని వినియోగించడం ద్వారా చర్మసమస్యలు దరిచేరవు.

6. స్కిన్ టోనర్స్ ని వాడండి

6. స్కిన్ టోనర్స్ ని వాడండి

స్కిన్ టోనర్స్ అనేవి చర్మాన్ని ప్రశాంతపరచడానికి అమితంగా ఉపయోగపడతాయి. సెన్సిటివ్ స్కిన్ ని సూత్ చేయడానికి స్కిన్ టోనర్స్ ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని అందుబాటులో ఉంచుకోవడం ద్వారా చర్మానికి తగినంత తేమని అందించడంతో పాటు చర్మాన్ని ప్రశాంతబరచుకోవచ్చు.

7. పచ్చిపాలతో కడగండి

7. పచ్చిపాలతో కడగండి

పచ్చిపాలలో వివిధ రకాల యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. కాబట్టి, పచ్చిపాలని బ్యూటీ ఇంగ్రీడియెంట్ గా వాడటం వలన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుంది. వారానికి ఒకసారి, చర్మాన్ని పచ్చిపాలతో శుభ్రపరచుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు.

8. రోజ్ వాటర్ ని వాడండి

8. రోజ్ వాటర్ ని వాడండి

రోజ్ వాటర్ అనేది సహజసిద్ధమైన స్కిన్ సూతింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి, మీ చర్మం అత్యంత సెన్సిటివ్ స్కిన్ అయితే, మీరు రోజ్ వాటర్ ని వాడడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ప్రతి రోజూ రోజ్ వాటర్ ని వాడి సెన్సిటివ్ చర్మంపై తరచూ కనిపించే ఎర్రదనం అలాగే దురదల నుంచి ఉపశమనం పొందండి.

9. హోంమేడ్ స్క్రబ్ తో ఎక్స్ఫోలియేట్ చేయండి

9. హోంమేడ్ స్క్రబ్ తో ఎక్స్ఫోలియేట్ చేయండి

చర్మ సంరక్షణలో ఎక్స్ఫోలియేషన్ అనేది అత్యంత ముఖ్యమైనది. బ్యూటీ స్టోర్స్ లో అనేకరకాలైన స్క్రబ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే, ఇవన్నీ సెన్సిటివ్ స్కిన్ కి సూట్ అవుతాయని నమ్మకం లేదు. కాబట్టి, ఇంటి వద్దే సహజసిద్ధమైన పదార్థాలతో ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్ ని తయారుచేసుకోండి. కమర్షియల్ ప్రాడక్ట్స్ కి బదులుగా ఈ స్క్రబ్ ని వాడి గొప్ప ఫలితాలను పొందండి.

English summary

How To Take Care Of Sensitive Skin

In other words, taking care of this skin type is no easy task. And, if you're someone who has a sensitive skin type, then there are certain rules that you should follow without fail and also there are tons of life-changing tips that can help you take a better care of your skin type.
Story first published:Monday, January 8, 2018, 8:36 [IST]
Desktop Bottom Promotion