For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పొడి చర్మాన్ని రోజ్-వాటర్ ఎలా నిర్మూలిస్తుంది ?

మీ పొడి చర్మాన్ని రోజ్-వాటర్ ఎలా నిర్మూలిస్తుంది ?

|

మన చర్మం ఎక్కువగా శీతాకాలంలోనే పొడిగా మారే అవకాశాన్ని కలిగి ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా మన చర్మం పొరలుగా, మందకొడిగా మారుతుంది.

ఇలా పొడిగా మారిన మీ చర్మం, మీ ముఖం మొత్తాన్ని నిర్జీవంగా చేస్తుంది అలాగే ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. మీ చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ గా ఉంచడం ద్వారా, బయట వైపుకు కనబడుతున్న పొడి చర్మాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది.

How To Use Rose Water to Heal Dry Skin?

పొడి చర్మం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఉత్పత్తులలో మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ అనేవి చాలా రకాలు ఉన్నప్పటికీ అవి సహజమైన నివారణలుగా పనిచేయలేవు. కాబట్టి ఈ రోజున మన పొడి చర్మాన్ని నివారించటంలో సహాయపడే రోజ్-వాటర్ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము.


రోజ్వాటర్లో మాయిశ్చరైజర్ & హైడ్రేటింగ్ వంటి లక్షణాలను కలిగి ఉన్న కారణంగా దీనిని అనేక సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. పొడి చర్మం కోసం క్లీన్సర్స్ & మాయిశ్చరైజర్స్ ను కలిగి ఉండే ఉత్పత్తుల కన్నా, రోజ్వాటర్ మీ చర్మం పై అద్భుతంగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ మీ చర్మాన్ని మృదువుగా మార్చి, చర్మపు pH బ్యాలెన్స్ను సరిగా నిర్వహిస్తూ మీ చర్మపు టోన్ను మరింతగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రోజ్ వాటర్ను మీ చర్మంపై వివిధ రూపాలలో ఉపయోగించవచ్చు. దీనిని ఒక టోనర్గా, మాస్క్గా, మాయిశ్చరైజర్గా, క్లీన్సర్గా కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ రూపాలలో రోజ్ వాటర్ను సులభంగా, సాధారణంగా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనము చూద్దాం !

రోజ్ వాటర్ టోనర్ :-

రోజ్ వాటర్ టోనర్ :-

చర్మాన్ని శుద్ధి చేసే చర్యలలో, మీ చర్మాన్ని టోన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ రోజ్ వాటర్ను మీ చర్మానికి టోనర్గా ఉపయోగించినప్పుడు, మీ చర్మంపై పేరుకుపోయిన ధూళిని తీసివేసి, మీ చర్మం ఎండిపోకుండా కాపాడుతూ, మీ చర్మాన్ని మరింత మృదువుగా & కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

1 టేబుల్ స్పూన్ రోజ్వాటర్

దూది పింజ

మాయిశ్చరైజర్

ఎలా ఉపయోగించాలి :

* క్లీన్సర్తో ముందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన దుమ్మును తొలగించండి.

* దూది పింజను రోజ్ వాటర్లో ముంచి మీ ముఖంపై పూర్తిగా అప్లై చేయండి.

* మీ ముఖం పూర్తిగా పొడిగా మారేంతవరకు ఆగి, చివరిలో మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోండి.

* ఈ పరిహారాన్ని ఉదయం & సాయంత్రం రోజుకి రెండుసార్లు చొప్పున ఉపయోగించడం ద్వారా మీరు మరింత మంచి ఫలితాలను పొందగలరు.

రోజ్ వాటర్ - ముల్తానీ మట్టి - పాలు :-

రోజ్ వాటర్ - ముల్తానీ మట్టి - పాలు :-

ముల్తానీ మట్టిని, పాలు & రోజ్వాటర్తో కలిపి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మానికి సరైన పోషణను అందించి, పెళుసులుగా మీ చర్మం మారకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అలా పొడిచర్మం ఏర్పడకుండా నివారిస్తుంది. పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మకణాలను తీసివేసి మీ చర్మపు టోనును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

1 టేబుల్ స్పూన్ రోజ్వాటర్

2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి

1 టేబుల్ స్పూను పాలు

ఎలా ఉపయోగించాలి :

* ఫేషియల్ క్లీన్సర్తో ముందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన దుమ్మును తొలగించండి.

* ఒక శుభ్రమైన గిన్నెలో రోజ్ వాటర్, ముల్తానీ మట్టి & పాలను జోడించండి. వీటన్నింటిని బాగా కలిపి పేస్టులా తయారు చేయండి.

* మీ ముఖము & మెడ భాగాల్లో ఈ ప్యాక్ను అప్లై చేసి, 20 నిమిషాలపాటు బాగా ఆరేలా వదిలేయండి.

* మరింత వేగవంతమైన ఫలితాల కోసం, మీరు వారంలో రెండుసార్లు ఈ పద్ధతిని అమలు చేయండి.

రోజు వాటర్- శాండిల్ వుడ్ (గంధం) :-

రోజు వాటర్- శాండిల్ వుడ్ (గంధం) :-

గంధంలో నౌరిషింగ్ & ఎక్స్ఫోలియేషన్ వంటి లక్షణాలు ఉన్నాయి. దీనిని రోజ్వాటర్తో కలిపినప్పుడు మీ చర్మాన్ని హైడ్రేటింగ్ ఉంచుతూ, పొడి చర్మాన్ని రానివ్వకుండా నివారించడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :

1 టేబుల్ స్పూన్ గంధపు పొడి

1 టేబుల్ స్పూన్ రోజ్వాటర్

అర స్పూను కొబ్బరినూనె

అర స్పూన్ బాదంనూనె

ఎలా ఉపయోగించాలి :

* ఇంతకు ముందుగా చెప్పినట్లు, క్లీన్సర్తో ముందుగా మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి.

* గంధపు పొడిని, రోజ్వాటర్, కొబ్బరినూనె, బాదంనూనెను అన్నిటినీ ఒక్కటిగా కలపాలి.

* ఇలా తయారైన పేస్టు చిక్కగా గాని ఉంటే, పలుచగా చేసుకోవడం కోసం కొన్ని నీటి చుక్కలు కలపండి.

* మీ ముఖము & మెడ భాగాల్లో ఈ ప్యాక్ను అప్లై చేసి, 20 నిమిషాలపాటు బాగా ఆరేలా వదిలేయండి.

* మరింత వేగవంతమైన ఫలితాల కోసం, మీరు వారంలో రెండుసార్లు ఈ పద్ధతిని అమలు చేయండి.

English summary

How To Use Rose Water to Heal Dry Skin?

Our skin is prone to getting dry mostly during winters. But it also becomes flaky and dull during the monsoons too. Rose water is being used in many beauty products due to its moisturising and hydrating properties. When combined with other cleansers and moisturisers, rose water can do wonders on your skin. You can use it in the form of masks, toners, etc.Our skin is prone to getting dry mostly during winters. But it also becomes flaky and dull during the monsoons too. Rose water is being used in many beauty products due to its moisturising and hydrating properties. When combined with other cleansers and moisturisers, rose water can do wonders on your skin. You can use it in the form of masks, toners, etc.
Story first published:Thursday, July 26, 2018, 10:59 [IST]
Desktop Bottom Promotion