For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బత్తాయిని (స్వీట్ లైమ్) ఉపయోగించి, ఆచరించగలిగే 3 అద్భుతమైన సౌందర్య చిట్కాలు !

బత్తాయిని (స్వీట్ లైమ్) ఉపయోగించి, ఆచరించగలిగే 3 అద్భుతమైన సౌందర్య చిట్కాలు !

|

"మోసంబి"గా పిలువబడే బత్తాయిలో, విటమిన్లు & ఇతర పోషకాలతో నిండిన ఒక సిట్రస్ పండని చెప్పవచ్చు. అందువల్ల, ఈ పండు మనకు కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. శరీర నుండి విషాన్ని బయటకు పారద్రోలడానికి ఇది బాగా సహాయపడుతుంది. బత్తాయి కలుగజేసే అనేక ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి. అయితే, ఈ బత్తాయి మీ చర్మానికి సౌదర్య ప్రయోజనాలను అందించగలదని మీకు తెలుసా?

అవును, మీరు చదివింది నిజమే ! బత్తాయిలో ఎన్నో సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇది మీ చర్మాన్ని చాలా ప్రకాశవంతంగా తయారు చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ-బయాటిక్ & యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని సున్నితంగా, ఆరోగ్యవంతంగా & మృదువైనదిగా ఉంచుతుంది. ఇది చర్మం యొక్క రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

 How To Use Mosambi On Skin?

ఇక్కడ మేము మీకు 3 అద్భుతమైన అందం నివారణలు ఇస్తాను, అవి సంటన్, మొండి చర్మం మరియు చీకటి వృత్తాలు వంటి అంశాలకు చికిత్సలో మీకు సహాయం చేస్తాయి. ఈ నివారణ చిట్కాలు ఆచరించడానికి సులభంగా ఉంటూ, చర్మంపై వెంటనే ప్రభావాలను కలిగించేలా ఉంటాయి. ఇప్పుడు, మనము ఈ బత్తాయిని చర్మంపై ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం !

1. సన్-టాన్ చికిత్స కోసం :-

మొండిగా ఉన్న సన్-టాన్ను వదిలించుకోవడానికి సరైన పరిష్కార మార్గాలను మీరు వెతుకుతున్నట్లు అయితే ఈ పరిహారం మీకు కచ్చితంగా సహాయం చేస్తుంది.

కావలసినవి :-

బత్తాయి తొక్కలు (బాగా ఎండబెట్టినవి)

1 టేబుల్ స్పూన్ తేనె

పసుపు (చిటికెడు)

ఎలా తయారు చెయ్యాలి?

బత్తాయి పై తొక్కలను, తేనె & పసుపు మిశ్రమాలను బాగా కలిపి - చిక్కని పేస్టులా తయారుచేసి, శుభ్రపరచుకున్న ముఖము & మెడ భాగాలలో ఈ పేస్ట్ను మందపాటి పొరలా అప్లై చేయాలి. దానిని 5 నిముషాల పాటు అలానే వదిలివేయాలి. తరువాత సాధారణ నీటిలో మీ చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. మీరు కోరుకున్న వేగవంతమైన ఫలితాల కోసం వారంలో రెండుసార్లు ఈ చిట్కాను అమలు చేయవచ్చు.

 How To Use Mosambi On Skin?

2. చర్మాన్ని ప్రక్షాళన చేయడం కోసం :-

బత్తాయి అనే సిట్రస్ పండు విటమిన్ సి తో పూర్తిగా నిండి ఉండటం వల్ల అది చనిపోయిన చర్మ కణాలు తొలగించడంతో పాటు, మీ చర్మాన్ని లోలోపల నుండి శుభ్రం చేయడానికి ఉపయోగించబడుతుంది.

కావలసినవి :-

బత్తాయి (సగటు పరిమాణంలో ఉన్నది)

ఎలా తయారు చెయ్యాలి?

సగటు పరిమాణం లో ఉన్న బత్తాయిని తీసుకుని 2 భాగాలుగా కట్ చేయండి. అందులో ఒక భాగాన్ని తీసుకుని మీ ముఖం పై వృత్తాకార కదలికలలో నెమ్మదిగా స్క్రబ్ చేయండి. ఇలా 8-10 నిమిషాలపాటు చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మీ ముఖం పొడిగా మారిన తర్వాత మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్తో మీ ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేయండి. వారానికి ఒక్కసారి చిట్కాను పాటించడం వల్ల మీ చర్మంపై ఉన్న మలినాలను తొలగించి, మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

 How To Use Mosambi On Skin?

3. డార్క్ సర్కిల్స్ తొలగించడం కోసం :-

డార్క్ సర్కిల్స్ & ఉబ్బెత్తు కళ్ళు మన ముఖాన్ని నిస్తేజంగా, అలసటగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించగల చిట్కా ఇప్పుడు మన దగ్గర ఉంది. ఈ చిట్కాలో మీరు ఇతర పదార్ధాలతో కలిపినప్పుడు ఈ పరిహారం మీ చర్మంపై మరింత ప్రభావవంతమైనదిగా పనిచేస్తుంది.


కావలసినవి :-

½ స్పూన్ బత్తాయి రసం

1 టేబుల్ స్పూన్ అరటి గుజ్జు

1 టేబుల్ స్పూన్ కీరదోస రసం

1 టేబుల్ స్పూన్ విటమిన్-E ఆయిల్


ఎలా తయారు చెయ్యాలి?

తాజా బత్తాయిల నుండి సేకరించిన రసాన్ని శుభ్రమైన గిన్నెలోకి తీసుకోవాలి. దానికి బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలపాలి. ఇలా తయారైన మిశ్రమానికి చివరిగా కీరదోస రసమును & విటమిన్-E ఆయిల్ను కలపాలి. ఈ మిశ్రమాలన్ని బాగా కలిపి - చిక్కని పేస్టులా తయారుచేసి, శుభ్రపరచుకున్న ముఖము & మెడ భాగాలలో ఈ పేస్ట్ను మందపాటి పొరలా అప్లై చేయాలి. దానిని 20 నిముషాల పాటు అలానే వదిలివేయాలి. తరువాత సాధారణ నీటిలో మీ చర్మాన్ని శుభ్రపరచుకోవాలి.

English summary

How To Use Mosambi On Skin?

Mosambi, otherwise called sweet lime, is a citrus fruit packed with vitamins and other nutrients. Mosambi also has several beauty benefits that will make your skin radiant like never before. The antibiotic and antioxidant properties of mosambi will keep your skin healthy, soft and supple. It also helps in improving the blood circulation of the skin.
Story first published:Tuesday, September 4, 2018, 17:25 [IST]
Desktop Bottom Promotion