For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై నల్ల మచ్చలను వదిలించుకోడానికి సహజమైన స్క్రబ్ లు

|

చర్మంపై, ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలు కొన్నిసార్లు చిరాకు తెప్పించవచ్చు. శరీరంలో ఎక్స్ పోజ్ అయ్యే శరీరభాగం ఎక్కువగా ఇదే కాబట్టి మీ ముఖానికి ఏదన్నా అసహజంగా కన్పించినా మీరు ఆందోళన పడతారు.

చర్మంపై నల్లమచ్చలు రావడానికి అనేక కారణాలుండచ్చు, ముఖ్యకారణం మాత్రం సూర్యుడి హానికర యూవి కిరణాలు.

కానీ ఈ స్థితి ముదరకుండా ప్రాథమిక దశల్లోనే మీరు సంరక్షణ తీసుకుంటే సమస్యేమీ ఉండదు. స్క్రబ్స్ రూపంలో వాడే ఈ చిట్కాల్లో సహజ పదార్థాలే వాడతారని తెలిసి మీరు ఆశ్చర్యపడతారు. సహజ పదార్థాలు వాడటం వలన ఒక లాభం ముఖ్యంగా ముఖానికి దీర్ఘకాలంలో ఏ హానికర ప్రభావం ఉండదు.

Natural Scrubs To Get Rid Of Dark Spots On Face

స్క్రబ్ లు మృతకణాలను తొలగించి చర్మానికి సాయపడతాయి. దానివల్ల చర్మం రంగు తెల్లబడి, ఇంకా నల్ల మచ్చలు, చారలున్నా నయమవుతాయి.

అయితే మనం ఇప్పుడు సహజ పదార్థాలను వాడి ఇంట్లోనే చర్మంపై నల్లమచ్చలను తొలగించుకోటానికి స్క్రబ్ లను ఎలా తయారుచేయవచ్చో చూద్దాం. చదవండి!

ముఖంపై నల్లమచ్చలను ఈ స్క్రబ్ లతో వదిలించుకోండి.

1)నిమ్మ, చక్కెర స్క్రబ్

నిమ్మ, చక్కెర సహజ ఎక్స్ ఫోలియంట్లుగా పనిచేసి ముఖంపై చర్మంలో చనిపోయిన కణాలను తొలగించటమే కాదు, నల్లమచ్చలు తగ్గించటంలో కూడా సాయపడతాయి. ఈ చిట్కాకి ఎప్పుడూ పలుకులుగా ఉన్న పంచదారనే వాడండి.

కావాల్సిన వస్తువులు

½ చెంచా చక్కెర

½ నిమ్మరసం

ఎలా వాడాలి

ఒక శుభ్రమైన బౌల్ లో చక్కెర, నిమ్మరసాన్ని కలపండి. దీన్ని శుభ్రమైన ముఖంపై పట్టించి, కొనవేళ్లతో గుండ్రంగా తిప్పుతూ రుద్దండి. మసాజ్ చేస్తున్నప్పుడు చర్మంపై మృదువుగా వ్యవహరించండి. ఇలా 2-3 నిమిషాలు చేసి 15 నిమిషాలు స్క్రబ్ ను అలా వదిలేయండి. తర్వాత చల్లనీటితో మొహం కడుక్కోండి.

2) ఉప్పు,నిమ్మ స్క్రబ్

ఎక్స్ ఫోలియేషన్ తో పాటు, సీసాల్ట్ తన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో చర్మంపై ఎటువంటి ఇన్ఫెక్షన్లు, అలర్జీలను నయం చేస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఈ స్క్రబ్ నల్ల మచ్చలు తొలగించటంలో బాగా పనిచేస్తుంది.

కావాల్సిన వస్తువులు

1చెంచా ఉప్పు

కొన్ని చుక్కల నిమ్మరసం

1 చెంచా తేనె

ఎలా వాడాలి

ఉప్పు, నిమ్మ, తేనెలను కలిపి స్క్రబ్ తయారుచేయండి. ఈ స్క్రబ్ ను మీ నల్లమచ్చలపై రాసి,నెమ్మదిగా గుండ్రంగా కొన్ని నిమిషాలు రుద్దండి. ఈ మిశ్రమాన్ని అలానే కొన్ని నిమిషాలు వదిలేసి, మామూలు నీళ్ళతో తర్వాత కడిగేయండి. ఈ చిట్కాను వారంలో 2-3సార్లు వాడి మంచి ఫలితాలు పొందవచ్చు.

3)దోసకాయ స్క్రబ్

ఈ స్క్రబ్ మొండి నల్లమచ్చలపై అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని నిమ్మకాయ,తేనె,చక్కెరతో కలిపినప్పుడు పిగ్మంటేషన్ పోగొట్టడంలో కూడా సాయపడుతుంది.

కావాల్సిన వస్తువులు

½ దోసకాయ

1చెంచా పాలు

కొన్ని చుక్కల నిమ్మరసం

1 చెంచా చక్కెర

ఎలా వాడాలి

దోసకాయను తురమండి. అందులోంచి రసం పిండండి. 1 చెంచా దోసకాయ రసం, పాలు, కొన్నిచుక్కల నిమ్మరసాన్ని ఒక బౌల్ లో వేయండి. ఆఖరుగా చక్కెరను వేసి అన్నిటినీ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మొహంపై నల్లమచ్చలపై గుండ్రంగా తిప్పుతూ రుద్దండి. 5 నిమిషాల తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయవచ్చు.

ఈ స్క్రబ్ ను వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితాలు వస్తాయి.

4)బంగాళదుంప తొక్క,తేనె

బంగాళదుంప చర్మం రంగును మెరుగుపరుస్తుందని, తన బ్లీచింగ్ లక్షణాలతో మచ్చలను నయం చేస్తుందని మనందరికీ తెలుసు. అందులో వుండే కాటేక్లోయేజ్ అనే ఎంజైము నల్లమచ్చలను, గాయం మచ్చలను నయం చేస్తుంది. తేనెతో కలిపినప్పుడు నల్లమచ్చలను తేటపర్చి చర్మానికి తేమ అందేలా కూడా చేస్తాయి.

కావాల్సిన వస్తువులు

1 మీడియం సైజు బంగాళదుంప

1 చెంచా తేనె

ఎలా వాడాలి

బంగాళదుంప చెక్కు తీయండి. ఆ తొక్కను పేస్టులా ముద్ద చేయండి. దీనికి తేనెను జతచేసి రెండూ బాగా కలపండి. దీన్ని మొహంపై నల్లమచ్చలపై రాసి నెమ్మదిగా రుద్దండి. 5 నిమిషాలు ఉంచి మామూలు నీళ్లతో కడిగేయండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

English summary

Natural Scrubs To Get Rid Of Dark Spots On Face

Dark spots on the skin can be annoying at times especially when it appears on your face. There are several factors that cause dark spots on the skin, but the main reason is the harmful UV rays of the sun. And you'll be surprised to know that the remedies for these are in the form of scrubs using natural ingredients.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more