For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన చర్మానికై కొబ్బరినూనెతో ఏడురకాల చికిత్సలు

ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలవారు కూడా చర్మం మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి కావలసిన అద్భుతమైన గుణాలు కొబ్బరినూనెలో ఉన్నాయని గ్రహించారు. కొబ్బరినూనె చర్మానికి తేమను సమకూర్చడంతో పాటు

|

దశాబ్దాలుగా కొబ్బరినూనె అంటే మన బామ్మలకు అపారమైన ప్రేమ. తరతరాలుగా అనేక సౌందర్య సమస్యలకు కొబ్బరినూనె అద్భుతమైన పరిష్కారంగా వారు మనందరికీ పరిచయం చేశారు. ఈ విషయంలో మనకన్నా మన బామ్మలకున్న అవగాహన ఉత్తమం.

ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలవారు కూడా చర్మం మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి కావలసిన అద్భుతమైన గుణాలు కొబ్బరినూనెలో ఉన్నాయని గ్రహించారు. కొబ్బరినూనె చర్మానికి తేమను సమకూర్చడంతో పాటు మొటిమలు, మచ్చలను పోగొట్టి కాంతివంతంగా తయారుచేస్తుంది.

Seven Coconut oil Treatments For Perfect Skin

కొబ్బరినూనె చవకైన మరియు సులువుగా లభించే పదార్థం. ఇది అన్ని చర్మ రకాల వారికి సరిపడుతుంది. బాగా పొడి చర్మం ఉన్నవారు లేదా సున్నితమైన చర్మం కలిగినవారు కూడా దీనిని వినియోగించవచ్చు.

మీకు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, వాటి పరిష్కారానికి ఇంటి వద్దనే కొబ్బరినూనెతో మాస్క్ తయారు చేసి వాడిచూడండి. ఇది మీ చర్మం లోకి లోతుగా చొచ్చుకుపోయి తేమను చేకూరుస్తుంది. అంతేకాక దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది తామర మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు మనం ఇంట్లోనే కొబ్బరినూనెతో చేసుకునే వివిధ రకాల మాస్కుల గురించి తెలుసుకుందాం.

1. తేటుగా ఉండే చర్మం కొరకు:

1. తేటుగా ఉండే చర్మం కొరకు:

తేటైన చర్మం కొరకు కొబ్బరినూనెను నలుగు తయారీలో వాడవచ్చు. దీని కొరకు కొంత తేనె, కొన్ని ఓట్స్ మరియు కొబ్బరినూనె అవసరమవుతాయి. ఈ పదార్థాలను అన్నిటిని ఒక గిన్నెలో బాగా కలపాలి. పదార్థాల పరిమాణం మీ చర్మం మరియు మీ ముఖం యొక్క వైశాల్యం పై ఆధారపడి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుని మీ ముఖంపై వలయాకారంలో రుద్దండి. దీనివలన మీ చర్మం పై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. ఓట్ మీల్ మరియు కొబ్బరినూనె మీ చర్మం పై మృతకణాలు తొలగించడానికి ఉపయోగపడితే, తేనె మీ చర్మానికి తేమను అందిస్తుంది. ఈ చికిత్స మొటిమలు లేదా బ్లాక్ హెడ్స్ ఉన్నవారికి కూడా మంచి ఫలితమిస్తుంది.

2. నల్లని మచ్చల నివారణకు:

2. నల్లని మచ్చల నివారణకు:

మొటిమలు లేదా ఇతర కారణాల వల్ల మన చర్మంపై నల్లని మచ్చలేర్పడతాయి. వీటి నివారణకు కొబ్బరినూనె, లెవెండర్ ఆయిల్ మరియు ఫ్రాంకిన్సన్స్ ఆయిల్ లను కలిపి ఒక ముదురు రంగు గాజు సీసాలో వేసి ఉంచండి. ప్రతిరోజూ పడుకునే ముందు డ్రాపర్ సహాయంతో ఈ నూనెల మిశ్రమాన్ని తీసి ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి. నూనెలు చర్మం లోనికి పూర్తిగా ఇంకిపోయేటట్టు మర్దన చేసుకోవడం తప్పనిసరి!

3. పొడి చర్మ సమస్య నివారణకి:

3. పొడి చర్మ సమస్య నివారణకి:

దీనికై మీరు కొంత తేనె మరియు కొబ్బరినూనెలను తీసుకోండి. ఇదివరకే చెప్పినట్లు తేనె మన చర్మానికి తేమను చేకూరుస్తుంది. తేనె మరియు కొబ్బరినూనె రెండు కూడా చర్మంపై కఠినమైన ప్రభావం చూపకుండా తేమను సమకూర్చుతాయి. ఈ రెండింటిని బాగా కలిపి చర్మానికి పూయండి. కొద్ది నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

4. లోతుగా శుభ్రపరుస్తుంది:

4. లోతుగా శుభ్రపరుస్తుంది:

చర్మాన్ని లోతుగా శుభ్రపరచడం కొరకు తినేసోడా మరియు కొబ్బరినూనెలను కలిపి వినియోగించవచ్చు. బేకింగ్ సోడాలో నొప్పినివారణ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది కనుక మొటిమలు మరియు బ్లాక్ హెడ్ సమస్య ఉన్నవారికి బాగా మేలు జరుగుతుంది. కొబ్బరినూనె బేకింగ్ సోడాను చర్మంలోనికి చొచ్చుకుపోయి తన ప్రభావం చూపడానికి సహాయపడుతుంది.

5. హైపర్ పిగ్మెంటేషన్ ను నివారణకు:

5. హైపర్ పిగ్మెంటేషన్ ను నివారణకు:

కొన్ని టీ స్పూన్ల కొబ్బరినూనెకి పసుపు మరియు పాలను కలపండి. దీని ముఖానికి బాగా పట్టించండి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని కాంతివంతంగా మార్చి అధికంగా ఉన్న పిగ్మెంట్లను తొలగిస్తాయి. పసుపు మరియు కొబ్బరినూనె నొప్పిని హరించే గుణాన్ని కలిగి ఉంటాయి.

6. కాంతివంతమైన మరియు నిండైన చర్మానికి:

6. కాంతివంతమైన మరియు నిండైన చర్మానికి:

దీనికై మీరు కొన్ని విటమిన్ E క్యాప్సిల్స్ మరియు కొంత కొబ్బరినూనె తీసుకోండి. విటమిన్ E చర్మానికి చాలా మేలు చేకూరుస్తుంది. మార్కెట్ లో లభించే చాలా సౌందర్య ఉత్పత్తులలో ఇది ఉంటుంది. విటమిన్ E క్యాప్సిల్స్ ను సూదితో పొడిచి వాటిలో నూనెను కొబ్బరినూనెలో కలపండి. దీనిని ముఖానికి పట్టించి పది పదిహేను నిమిషాల పాటు వదిలేయండి. విటమిన్ E చర్మంపై ఫ్రీ రాడికల్స్ చేసే నష్టాన్ని అరికట్టి తేమ సమకూర్చుతుంది. దీని వలన వృద్ధాప్య ఛాయలు నశించి, వయస్సు పెరగడంతో ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి. రాత్రిపూట దీనిని మాస్క్ గా వాడితే చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.

7. చర్మంపై వయసు పైబడుతున్న ఛాయలు తొలగిస్తుంది:

7. చర్మంపై వయసు పైబడుతున్న ఛాయలు తొలగిస్తుంది:

దీనికై కొబ్బరినూనె మరియు రోజ్ హిప్ ఆయిల్ లను కలిపి వినియోగించాలి. దీనిని సీరం లేదా మాస్క్ మాదిరిగా వాడాలి. కొంతమందికి నిద్రపోయే సమయంలో చర్మం జిడ్డుగా ఉంటే నచ్చదు. అటువంటివారు ఈ మాస్క్ ను వాడవచ్చు. కొబ్బరినూనెకి కొన్ని చుక్కల రోజ్ హిప్ ఆయిల్ ను కలిపి ముఖానికి పట్టించ ఒక గంట పాటు వదిలేయండి. తర్వాత ఒక టిష్యు పేపర్ తో ముఖాన్ని బాగా తుడుచుకోండి. రోజ్ హిప్ ఆయిల్ చర్మంపై కొల్లాజన్ ఉత్పత్తిని నెమ్మదింపచేసే ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావంను తగ్గిస్తుంది. కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రోజ్ హిప్ ఆయిల్ యొక్క గాఢతను తగ్గించడానికి కొబ్బరినూనె కారియర్ ఆయిల్ గా పనిచేస్తుంది.

English summary

Seven Coconut oil Treatments For Perfect Skin

Coconut oil has been an age old remedy for skin care problems. It's among the best natural remedy for any type of skin care problem. Coconut oil can be used as a scrub when it is mixed with oats and honey. It also acts as a great moisturizer. For cleansing your skin mix coconut oil along with baking soda as it acts as a anti inflammatory agent.
Story first published:Monday, March 26, 2018, 17:17 [IST]
Desktop Bottom Promotion