For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన చర్మాన్ని కలకాలం ఉంచుకోటానికి 20లలో పాటించాల్సిన 7 అలవాట్లు

|

మన ఇరవైల్లో ఉండే చర్మమే జీవితమంతా అలానే ఉండిపోతే ఇష్టపడని వారు ఎవరుంటారు? కానీ దురదృష్టవశాత్తూ, వయస్సు మీరటం అనేది ఒక ఒప్పుకోవాల్సిన నిజమైన విషయం. కానీ దాని అర్థం మనం వయస్సు మీరటాన్ని వాయిదా వేయలేమనా?మన పద్ధతులు మరియు చిట్కాలతో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం మీ చర్మం యవ్వనంతో అందంగా నిలవగలదు. అది ఎలానో చదవండి.

మన ఇరవైల వయస్సులో, చర్మం చాలా అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది, కానీ అందుకే మనం ఎప్పుడూ అలానే ఉంటుంది అన్న భ్రమలో దాని సంరక్షణను నిర్లక్ష్యం చేస్తాం. కానీ మంచి చర్మసంరక్షణ మీ ఇరవైల్లోనే మొదలవ్వాలి. మనందరికీ సాధారణ చిట్కాలైన తగినంత నిద్ర మరియు నీళ్ళు తాగటం వంటివి ముందే తెలిసి ఉంటుంది.

7 Habits To Follow In Your 20s For Great Skin

దురదృష్టవశాత్తూ అవొక్కటే సరిపోవు. సాధారణంగా అందరికీ ఉండే అపోహ ఏంటంటే వయస్సు మీరుతున్న లక్షణాలు మొదటగా కన్పించినప్పటినుండే వయస్సు మీరటాన్ని ఆపే క్రీములు, ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టాలని. అది తప్పు. వయస్సు మీరటాన్ని వాయిదా వేసే ఉత్పత్తులు వయస్సు మీరకుండానే వాడటం మొదలుపెట్టాలి, అంటే మీ ఇరవైల్లోనే వాటిని వాడటం మొదలుపెట్టాలి.

మీ చర్మానికోసం మంచి సలహాలు ఇప్పుడే పాటించటం మొదలుపెట్టండి, తర్వాత జీవితంలో దాని ఫలితాలు మీరే చూస్తారు. మమ్మల్ని నమ్మండి, మంచి చర్మం ఉంటే లోపాలను మేకప్ తో దాచాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. మంచి చర్మం కోసం ఇరవైల్లో పాటించాల్సిన కొన్ని అలవాట్లు ఇవిగో.

1.పడుకునేముందు తప్పనిసరిగా మేకప్ ను తొలగించండిః

1.పడుకునేముందు తప్పనిసరిగా మేకప్ ను తొలగించండిః

మీరు పడుకునేటప్పుడు మీ చర్మం కూడా విశ్రాంతి పొందటానికి, ఆక్సిజన్ తో జీవం పొందటానికి తప్పనిసరిగా, మేకప్ తొలగించండి. మన జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోయేముందు మేకప్ తొలగించకుండా బద్ధకంగా అలానే పడుకుండిపోయి ఉంటాం, దాని పరిణామాలు కూడా మనం చూసే ఉంటాం. ఎక్కడినుండైనా ఇంటికి వచ్చిన వెంటనే, మొదటగా మేకప్ తొలగించాలని నియమం పెట్టుకోండి. మీ బెడ్ పక్కన టేబుల్ పై మిసెల్లార్ నీరును, దూదిని చేతికందేట్టుగా పెట్టుకోండి. మీకు మరీ బద్ధకంగా ఉంటే, మేకప్ రిమూవర్ లేదా బేబీ వైప్స్ తో మీ మేకప్ ను తొలగించుకోండి.

2.సరిగ్గా శుభ్రపరుచుకోండిః

2.సరిగ్గా శుభ్రపరుచుకోండిః

మీ చర్మం రకం ఏంటో తెలుసుకుని, ఆ విధంగా శుభ్రపర్చుకోవటం నేర్చుకోండి. ఉదాహరణకి శుభ్రపర్చే నూనెలు మరియు బటర్స్ కొందరికి పనిచేయవచ్చు, మీకు పడకపోవచ్చు. మీరు డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని కూడా ప్రయత్నించి మీ చర్మానికి ఏది పడుతుందో తెలుసుకోవచ్చు. ఏం చేసినా సరే, మీ మొహాన్ని కడగటానికి సబ్బును మాత్రం వాడవద్దు. సబ్బును వాడటం వలన అది మీ ముఖంపై సహజ నూనెలను లాగేస్తుంది మరియు దాని వలన ముఖంపై చర్మం పెళుసుబారి, ఎండిపోతుంది. అందుకని సబ్బులేని సున్నితమైన క్లెన్సర్ ను ఎంచుకోండి.

3.సీరం వాడండిః

3.సీరం వాడండిః

ఈ చిట్కా మేము ఏషియన్ మరియు కొరియన్ అందాల బ్లాగర్స్ నుంచి సంపాదించాం. వారు ముఖాన్ని కడిగిన వెంటనే, తర్వాత టోనింగ్ చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసేముందు తప్పక సీరం వాడమని సూచిస్తున్నారు. దీనివలన మాయిశ్చరైజర్ పనితీరు అద్భుతంగా పెరుగుతుంది. మీ ఇతర చర్మసంరక్షణ పనులకి వెళ్ళేముందు సీరంను మీ చర్మంలోకి పూర్తిగా ఇంకనివ్వండి. కొన్ని సీరంలు ప్రత్యేకంగా సమస్యలైన సన్నని గీతలు, గ్రంథులు మరియు మొటిమల వంటి వాటికోసం తయారవుతాయి.

4. కంటి క్రీం తప్పనిసరిః

4. కంటి క్రీం తప్పనిసరిః

కంటికి సంబంధించిన క్రీములు ఖరీదైనవి ఉండవచ్చు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒకటి కొనుక్కోండి. కంటి కింద ఉండే సున్నితమైన ప్రాంతం ముఖం మొత్తంలోనే తేమ ఉండని ప్రదేశం, అందుకని అక్కడే మొదటగా వయస్సు మీరే లక్షణాలు కన్పించడం మొదలవుతుంది. పొద్దున మరియు రాత్రి కంటి క్రీంను వాడండి. ఇది మీ మేకప్ ను కూడా మెరుగుపరుస్తుంది.

5.రెటినాల్ కి సంబంధించిన ఉత్పత్తిని వాడండిః

5.రెటినాల్ కి సంబంధించిన ఉత్పత్తిని వాడండిః

విటమిన్ ఎ లో ఒక రకమైన రెటినాల్ అనేక వయస్సు మీరటాన్ని వ్యతిరేకించే ఉత్పత్తులలో కన్పిస్తుంది. మీరు ఏ యాంటీ ఏజింగ్ ఉత్పత్తి కొన్నా మీరు చూడాల్సిన తప్పనిసరి పదార్థం ఇది. ఇది చర్మంపై కొల్లాజెన్ విఛ్చిన్నం అవకుండా నివారిస్తుంది. ఇది నిజానికి పాత చర్మానికోసం పనిచేయాల్సింది కానీ వయస్సు మీరకుండానే వాడటం వలన కూడా జరిగే నష్టం ఏమీ లేదు. ఇది మీ చర్మం యొక్క అమరికను మరియు సూర్యకాంతి వలన పాడైన చర్మాన్ని బాగుచేస్తుంది.

6.క్రమం తప్పకుండా ఫేషియల్స్ చేయించుకోండిః

6.క్రమం తప్పకుండా ఫేషియల్స్ చేయించుకోండిః

క్రమం తప్పకుండా ఫేషియల్స్ బుక్ చేసుకోండి. ఒక వయస్సు దాటాక, మీరు క్రమం తప్పకుండా ఫేషియల్స్ చేయించుకోవటం చాలా ముఖ్యం. ఈ అలవాటు పాటించడం ఇప్పుడు కష్టమనిపించకపోవచ్చు, కదా? పార్లర్ లో కాసేపు గారాబం చేయించుకోవటం ఎవరికి నచ్చదు?

7. గాఢత తక్కువ ఉన్న ఎక్స్ ఫోలియంట్ వాడండిః

7. గాఢత తక్కువ ఉన్న ఎక్స్ ఫోలియంట్ వాడండిః

మన శరీరంలో ప్రతిరోజూ చాలా కణాలు చనిపోతూ ఉంటాయి. అందుకని వాటిని తొలగించడం కూడా ముఖ్యమే. చర్మంపై మృతకణాలను తొలగించటానికి గాఢత తక్కువ ఉన్న ఉత్పత్తి వాడటం ముఖ్యం అని గుర్తుంచుకోండి. మేము మీకు కఠినమైనది ఏదీ వాడవద్దని సూచిస్తున్నాం, అలాంటివి మంచికన్నా హానినే ఎక్కువ చేస్తాయి. మీరు గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్ ను ప్రయత్నించవచ్చు, ఇవి సున్నితంగా ఉంటాయి. అవి ప్యాడ్ రూపంలో కూడా లభిస్తాయి, మీరు ప్రతిరోజూ వాటిని వాడుకోవచ్చు.

English summary

7 Habits To Follow In Your 20s For Great Skin

Good skincare starts in your twenties. Of course, we have all heard of the normal tips of sleeping enough and drinking enough water. Apart from these, there are several other ways to get that super glowing look that you have always wished for. Read to know more.
Desktop Bottom Promotion