వర్షాకాలంలో పాటించవలసిన చర్మ సంరక్షణ చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీ చర్మం కోసం అదనపు జాగ్రత్తలను తీసుకోవలసిన ఒకేఒక్క సీజన్ ఈ వర్షాకాలము. ఇలాంటి సమయంలోనే మన శరీరంలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయమే అంటురోగాలకు కారణం కూడా కావచ్చు. ఈ సీజన్ మన ఆరోగ్యాన్ని ఏవిధంగా అయితే ప్రభావితం చేస్తుందో అలాగే, మన చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఇలాంటి సమయంలో, మీరు మీయొక్క చర్మంపై సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే మొటిమలు, తామర వంటి మొదలైన అనేక ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మీరు వేసవికాలంలో పాటించే కొన్ని ప్రాథమిక చర్మ సంరక్షణ చిట్కాల ద్వారా ఇలాంటి చర్మ సమస్యలను సులభంగా నివారించవచ్చు.

Skin Care Tips For Monsoon

మీరు ఇలాంటి సీజన్లో పాటించవలసిన సూచనలను & పాటించకూడని సూచనల గురించి ఈ వ్యాసం తెలియజేస్తుంది. తద్వారా మీరు తీసుకోవలసిన సరైన చర్మ సంరక్షణలను గూర్చి పూర్తిగా తెలియజేస్తుంది. ఇప్పుడు అలాంటి చిట్కాలు ఏమిటో మనము చూద్దాం !

1. క్లీన్సింగ్ :

1. క్లీన్సింగ్ :

వర్షాకాలంలో, మీ చర్మాన్ని శుద్ధి చేసే - చర్మశుద్ధి అనేది చాలా ముఖ్యము. ఇన్ఫెక్షన్లను నివారించే ఒక తేలికపాటి ఫేస్ వాష్ను మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మీరు మీ చర్మసౌందర్యాన్ని సంరక్షించడానికి ఉపయోగించే కఠినమైన ఉత్పత్తులను వినియోగించినట్లయితే, అది మీ సున్నితమైన చర్మం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది (ముఖ్యంగా వర్షాకాలంలో).

2. టోనింగ్ :

2. టోనింగ్ :

మీ చర్మంపై సాధారణంగా నిర్మూలించలేని అదనపు మలినాన్ని తొలగించడానికి, ఈ టోనింగ్ బాగా సహాయపడుతుంది. ఈ వర్షాకాలంలో మీ చర్మ కణాలు బహిర్గతం కావడం వల్ల, మీ చర్మపు రంధ్రాలు మూసుకుపోవచ్చు. ఈ టోనింగ్ వల్ల, మూసుకుపోయిన మీ చర్మము రంధ్రాలకు చాలా సహాయకారిగా ఉంటుంది. వారానికి ఒక్కసారి ఈ టోనింగ్ పద్ధతిని అమలు చేయటం వల్ల, మీ చర్మంపై పేరుకుపోయిన మలినాలను నిర్మూలించవచ్చని మరిచిపోకండి.

3. ఎక్స్ఫోలియేషన్ :

3. ఎక్స్ఫోలియేషన్ :

మీ చర్మంపై బ్యాక్టీరియా వ్యాపించడానికి (లేదా) ఇతర చర్మ వ్యాధుల వ్యాపించడానికి గల అధిక అవకాశాలు ఈ వర్షాకాలంలోనే ఉన్నాయి. మీ చర్మంపై చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, అలాగే మీ చర్మాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ ఎక్స్ఫోలియేషన్ బాగా అవసరమవుతుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకోసం మీరు వారానికి ఒక్కసారి ఈ పద్ధతిని పాటించవలసి ఉంటుంది.

4. నీరు అధికంగా తాగడం :

4. నీరు అధికంగా తాగడం :

వర్షాకాలంలో మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి మంచినీరుని తాగటం అనేది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకే రోజులో 8 - 10 గ్లాసుల తాగునీటిని తీసుకోవటంవల్ల మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే ఇతర చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇది మీ శరీరంలో ఉన్న విష పదార్థాలను దూరంగా ఉంచి, మీ చర్మం తాజాగా కనిపించేలా నిర్వహించడానికి బాగా సహాయపడుతుంది.

5. మేకప్ను మానుకోండి :

5. మేకప్ను మానుకోండి :

వర్షాకాలంలో మీరు అధికంగా మేకప్ను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలోనే మీ చర్మం అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో లిఫ్ట్ గ్రాస్ను & ఇతర చర్మాన్ని సంరక్షించే పౌడర్లను ఉపయోగించండి. మీరు ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువ అలంకరణను ఉపయోగించకుండా ఉండండి.

6. సన్స్క్రీన్ను ఉపయోగించండి :

6. సన్స్క్రీన్ను ఉపయోగించండి :

సన్స్క్రీన్ అనేది మీ చర్మాన్ని సంరక్షించే ఒక ముఖ్యమైన ఉత్పత్తి సాధనము. ఎలాంటి సీజన్లో అయినా మీరు ఈ సన్స్క్రీన్ను ఉపయోగించడాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు వేసవికాలంలోనే సన్స్క్రీన్ను ఉపయోగించాలి అన్నది కేవలం ఒక కల్పన మాత్రమే. అలా ఇది పూర్తిగా దురభిప్రాయాన్ని కలిగి ఉన్నది. కాబట్టి మీ చర్మానికి సరిపడే సన్స్క్రీన్ను ఎంచుకొని, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా దీనిని ఉపయోగించండి.

7. ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్లు :

7. ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్లు :

మీ చర్మ సంరక్షణకోసం మార్కెట్లలో లభించే ఇతర సౌందర్య సాధనాలను వాడటం కన్నా ఇంటిలోనే తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్లను ఉపయోగించడం చాలా ఉత్తమం. మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించే రెడీమేడ్ ఉత్పత్తులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల మీ చర్మానికి కొన్ని రకాల దుష్ప్రభావాలను కలుగచేయగలవు. ఈ వర్షాకాల సీజన్లో తేనె, బొప్పాయి, పెరుగు, ముల్తానీమట్టి వంటి మొదలైన పదార్థాలతో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్లను వాడటం చాలా మంచిది.

8. ముఖ్యమైన ఇతర విషయాలు :

8. ముఖ్యమైన ఇతర విషయాలు :

• బయటనుంచి మీ ఇంటికి చేరుకున్న తర్వాత మీ ముఖాన్ని చేతులను కాళ్లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. మీరు ఈ విధంగా చేయడం వల్ల వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులను & రోగకారక బ్యాక్టీరియాల వ్యాప్తిని నివారిస్తుంది.

• ఈ వర్షాకాల సమయాల్లో మీ ముఖానికి బ్లీచింగ్ను అప్లై చేయడాన్ని మానుకోండి ఎందుకంటే, ఇది మీ ముఖాన్ని పొడిగా చేసి, మరింత కఠినంగా కనిపించేలా చేస్తాయి.

• మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడే సబ్బులను ఉపయోగించడం మర్చిపోవద్దు.

• బాగా ముదురు రంగులను కలిగిన లిప్స్టిక్లను ఉపయోగించకుండా ఉండండి, దానికి బదులుగా, లిప్ బామ్లను ఉపయోగించండి. ఒకవేళ మీ పెదవులు పగిలి నట్లయితే కొబ్బరినూనెను తప్పక వాడండి.

• వాక్సింగ్, మనిక్యూర్, పెడిక్యూర్ వంటి పద్ధతులను పాటించడం ద్వారా మీ శరీరాన్ని & పాదాలను, చేతులను శుభ్రంగా ఉంచుకోండి.

• ఆల్కహాల్ లేని టోనర్ను ఉపయోగించి, మీ పొడి చర్మ సమస్యను నివారించండి.

• వర్షాకాలంలో రోజుల్లో మీ ముఖాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి.

English summary

Skin Care Tips For Monsoon

Monsoon is a season that demands extra care for the skin. If you do not take a proper care of your skin, it can lead to many other skin-related issues. But these can be easily avoided. Using less makeup, exfoliating your skin regularly, drinking a lot of water, etc., are some basic tips to keep in mind.