For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దీపావళికి రొటీన్ గా కన్నా భిన్నంగా కనబడాలంటే ఈ చర్మ సంరక్షణ చిట్కాలను ఫాలో అవ్వండి

ఈ దీపావళికి రొటీన్ గా కన్నా భిన్నంగా కనబడాలంటే ఈ చర్మ సంరక్షణ చిట్కాలను ఫాలో అవ్వండి

|

చర్మ సంరక్షణ చిట్కాలు: ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ ఎలా తీసుకోవాలి. దీనికి సంబంధించిన అనేక ప్రశ్నలు మీ మనస్సులో మెదలుతుంటాయి. కాబట్టి మీరు కూడా ఈ సీజన్‌లో చర్మ సంరక్షణకు నివారణల కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యాసం మీకు తప్పకుండా సహాయపడుతుంది. వేసవి, శీతాకాలం, వర్షకాలం, చలికాలం ఇలా మారుతున్న సీజన్ బట్టి చర్మ సమస్యలు వస్తుంటాయి. అందువల్ల మీరు ఆయా సీజన్ ను బట్టి ప్రతి రోజూ చర్మ సంరక్షణ పద్దతులను అవలంబించడం చాలా ముఖ్యం. మరియు మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం.

2019 Diwali Skin Care Tips and Home Remedies,

మరో రెండు రోజుల్లో దీపావళి అక్టోబర్ 27 న ఈ సందర్భంగా మీరు చాలా అందంగా కనిపించాలనుకుంటున్నారు. కానీ వాతావరణం మారుతోంది మరియు మారుతున్న వాతావరణం మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో చర్మ సంరక్షణ (స్కిన్‌కేర్) ఎలా తీసుకోవాలి అన్న విషయానికి సంబంధించిన అనేక ప్రశ్నలు మీ మనస్సులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ సీజన్‌లో చర్మ సంరక్షణకు నివారణల కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది. వేసవి, శీతాకాలం, వర్షకాలం, చలికాలం ఇలా మారుతున్న సీజన్ బట్టి చర్మ సమస్యలు వస్తుంటాయి. అందువల్ల మీరు ఆయా సీజన్ ను బట్టి ప్రతి రోజూ చర్మ సంరక్షణ పద్దతులను అవలంబించడం చాలా ముఖ్యం. మరియు మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం. దీపావళి సందర్భంగా మీరు కూడా భిన్నంగా కనిపించాలనుకుంటే మరియు మీ స్కిన్ గ్లోయింగ్ గ్లోయింగ్ స్కిన్)గా కబడాలని మీరు కోరుకుంటుంటే ఈ దీపావళి 2019కి ముందు మరియు తరువాత మీ చర్మాన్ని ఎలా చూసుకోవాలో చూద్దాం..

రొటీన్ చర్మ సంరక్షణ :

రొటీన్ చర్మ సంరక్షణ :

బ్యూటీ కనౌజీర్ శ్రీ రవి మిట్టల్ (వ్యవస్థాపకుడు, స్కాండర్ ఇండియా) నుండి వచ్చిన ఈ సాధారణ చిట్కాలు పండుగకు ముందు మరియు పండుగ తర్వాత సీజన్లలో మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో మీకు సహాయపడతాయి. నవరాత్రి నుండి ప్రారంభమయ్యే పండుగ సీజన్ ఇప్పుడు దీపావళి తలుపులు తట్టింది. ఇంటికి కావాల్సినవి షాపింగ్ చేయడం, ఇల్లు శుభ్రపరచడం మరియు పండగ అలంకరణతో బిజీబిజీగా గడపుతారు..మీరే పార్టీ హోస్ట్ గా మారడం వల్ల మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమవుతారు.

మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది, తద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. మెరుస్తున్నచర్మానికి మంచి ఆహారాలు చర్మానికి కూడా ముఖ్యమైనవి; కాబట్టి మీ రోజువారీ ఆహారంలో రెండు రంగుల పండ్లను చేర్చండి. నిమ్మరసం, గంధపు చెక్క, పెరుగు, ముల్తానీ మిట్టిలతో కూడిన ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. జిడ్డుగల చర్మం ఉన్నవారు పెరుగు వాడకూడదు మరియు నిమ్మరసం ఎక్కువగా వాడవచ్చు. టొమాటో జ్యూస్ టాన్డ్ చర్మంపై అద్భుతాలు చేస్తుంది.

చర్మ సంరక్షణ చిట్కాలు

చర్మ సంరక్షణ చిట్కాలు

- మీ ముఖాన్ని రెండు, మూడు సార్లు కన్నా ఎక్కువ కడగకండి.

- పొడి చర్మం ఉన్నవారు సహజమైన మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ (ఎన్‌ఎంఎఫ్) ను అప్లై చేయండి, ఇది మీ చర్మం పొడిగా మరియు అలసటగా ఉన్న చర్మాన్ని నివారిస్తుంది.

జిడ్డుగల చర్మం ఉన్నవారు ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల మీ ఆయిల్ గ్రంథులు (సేబాషియస్ గ్రంథులు) ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లి ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి.

- ముఖం మీద ఐస్ క్యూబ్ ముక్కలు రుద్దడం వల్ల చెమట తగ్గుతుంది మరియు ఇది మీ అలంకరణ అలాగే ఎక్కువ సమయం పొడిగా ఉండేలా చేస్తుంది. వాటర్ ప్రూఫ్ మాస్కరా మరియు ఐ-లైనర్లను వాడండి, ఇది మేకప్ ఎక్కువసేపు ఉండటానికి అనుమతిస్తుంది.

ముఖ వ్యాయామాలు మరియు యోగా ఎలా చేయాలి

ముఖ వ్యాయామాలు మరియు యోగా ఎలా చేయాలి

1. మీ నోటిని గాలితో నింపండి మరియు మీ నోటి నుండి బుగ్గల మధ్య గాలి బంతిని ఐదుసార్లు నోట్లో అటుఇటు తిప్పండి.

2. చిన్న "O" ఆకారం చేసేటప్పుడు గాలిని విడుదల చేయండి.

3. ఇలా మీ బుగ్గలను గట్టిగా ఉంచడానికి మూడు, నాలుగు సార్లు వ్యాయామం చేయండి.

4. మీ వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి. మద్యలో వదిలపెట్టకండి, ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా మీరు అందంగా కనబడుటకు, అందంగా అలంకరించుకోవడానికి సహాయపడుతుంది. మీ చర్మం సహజంగానే మెరుస్తున్నందున ఇది మేకప్ ఆదా చేసుకోవటానికి మీకు సహాయపడుతుంది.

చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

దీపావళి పండుగ తరువాత మీ చర్మంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యమైన నూనెలు మరియు సాధారణ వ్యాయామ సెషన్లతో క్రమం తప్పకుండా ఫాలో చేయడం ద్వారా, పండుగ ముగిసిన తర్వాత కూడా మీ చర్మంపై మెరుపును పొందవచ్చు. దీపావళికి వీటి తోపాటు మరికొన్ని సింపుల్ చర్మ సంరక్షణ చిట్కాలను పరిశీలించండి.

చర్మ సంరక్షణ చిట్కాలు

చర్మ సంరక్షణ చిట్కాలు

1. మీ చర్మాన్ని విటమిన్ ఇ మరియు ఎసెన్షియల్ ఆయిల్ రిచ్ క్రీములు మరియు చర్మాన్ని రక్షించే నూనెలను వాడండి.

2. రోజులో తప్పని సరిగా 8-10 గ్లాసుల నీటిని త్రాగాలని గుర్తుంచుకోండి, ఇది చర్మాన్ని మెరుస్తూ ఉండటానికి ఉత్తమంగా పనిచేస్తుంది.

3. పండుగ సీజన్ లో మీరు బటయ ఎక్కువగా తిరగాల్సి వచ్చినప్పుడు, మీ దినచర్యలో తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ ను చర్మానికి అప్లై చేయడం అవలంబించండి.

3. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే మరియు మీ చర్మాన్ని ప్రకాశవంతం చేసే శక్తివంతమైన UV రక్షణ కలిగిన సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించండి.

English summary

2019 Diwali Skin Care Tips and Home Remedies

Diwali skin care tips and home remedies. Ho do i take care of skin facial exercises and yoga, read to know more about..
Story first published:Friday, October 25, 2019, 15:32 [IST]
Desktop Bottom Promotion