For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలిన గాయాల అవశేషాలు లేదా మచ్చలను తొలగించుకోవడానికి 6 ఉత్తమ చిట్కాలు, పాటించి చూడండి మచ్చలు మాయం

మైనర్ ఫస్ట్ డిగ్రీ గాయాల విషయంలో, కొన్ని రకాల గృహ వైద్యాలను నిమిషాల వ్యవధిలోనే ఉపయోగించడం ప్రారంభించవచ్చు, ఎందుకంటే కాలిన గాయాలు, మరియు దాని మచ్చల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకపాత్రను పోషించగలవు. చ

|

దైనందిక జీవితంలో ఏదో ఒక సమయంలో కాలిన గాయాల బారినపడడం సర్వసాధారణం. క్రమంగా కాలిన మచ్చలు ఏర్పడుతూ, కొంత అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటాయి. కొన్ని మచ్చలు కాలానుగుణంగా తొలగిపోయినా, కొన్ని మచ్చలు శాశ్వతంగా అలాగే మిగిలిపోతుంటాయి. ఆ మచ్చలు కొంత మందిలో ఆత్మ న్యూనతా భావనను కూడా ప్రేరేపిస్తుంటాయి. క్రమంగా సమాజంలో మనుగడ సాగించలేమన్న భావనకు వెళ్తూ నిరుత్సాహానికి గురవడం, తద్వారా దైనందిక మరియు వృత్తి పరమైన కార్యకలాపాలలో కూడా తీవ్రమైన ప్రభావాలు పడడం కనిపిస్తూ ఉంటుంది. కావున ఈ వ్యాసంలో అటువంటి కాలిన గాయాల అవశేషాలు లేదా మచ్చలను తొలగించే క్రమంలో భాగంగా కొన్ని చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

గృహ వైద్యాలు ఎన్నటికీ రియాక్షన్స్ లేనివిగాను, సహజ సిద్దంగా మరియు సురక్షితమైనవిగా ఉన్నందున మీ ఆందోళనలకు అత్యంత పరిపూర్ణమైన పరిష్కారంగా ఉండడమే కాకుండా, ఆర్థికంగా కూడా వెసులుబాటును కల్పించగలుగుతాయి.

వ్యాసంలో పేర్కొన్న నివారణలు తక్షణ ప్రభావాలను చూపించనప్పటికీ, అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని చెప్పబడింది. మరియు దీర్ఘకాలిక వినియోగంతో అనుకూల ఫలితాలను ఖచ్చితంగా చూపగలవు.

మైనర్ ఫస్ట్ డిగ్రీ గాయాల విషయంలో, కొన్ని రకాల గృహ వైద్యాలను నిమిషాల వ్యవధిలోనే ఉపయోగించడం ప్రారంభించవచ్చు, ఎందుకంటే కాలిన గాయాలు, మరియు దాని మచ్చల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకపాత్రను పోషించగలవు. చర్మం నుండి కాలిన గాయాల మచ్చలను తొలగించడానికి సూచించబడిన కొన్ని గృహ నివారణలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

కాలిన గాయాల అవశేషాలు లేదా మచ్చలను తొలగించడంలో సూచించదగిన 6 ఉత్తమ గృహ నివారణా చిట్కాలు.

1. తేనె :

1. తేనె :

పుండ్లు, కాలిన గాయాలు, మరియు కాలిన మచ్చల నివారణను వేగవంతం చేయడానికి తేనెను అనుబంధంగా ఉపయోగించడం జరుగుతుంది. మంటల వలన కలిగే సంక్రమణ నివారణలో మరియు మచ్చలను తొలగించడంలో కూడా తేనె సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ముడి తేనె

• చిటికెడు పసుపు

తయారుచేయు విధానం :

• ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో ముడి తేనెను జోడించండి.

• తరువాత, తేనెకు పసుపు మరియు పంచదారను కలపండి. ఒక మృదువైన పేస్ట్ వలె మిశ్రమంగా చేయండి.

• ప్రభావిత ప్రాంతంలో పేస్ట్ వర్తించిన పిదప, 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి.

• తరువాత, గోరు వెచ్చని నీళ్ళతో శుభ్రపరచి, ముఖాన్ని టవల్తో తుడవండి.

ఉత్తమ ఫలితాల కోసం కొన్నిరోజులు ఈ చర్యను పునరావృత్తం చేయండి.

2. అలోవెరా జెల్

2. అలోవెరా జెల్

అలోవేరాకి కాలిన గాయాలకు, మచ్చలకు, చికాకు పుట్టిస్తున్న చర్మం నుండి ఉపశమనం కలిగించటానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

తయారుచేయు విధానం :

• కలబంద మొక్క నుండి తాజా గుజ్జును తీయండి, దీనిని ఒక గిన్నెకు జోడించండి.

• అందులో కొంత రోజ్ వాటర్ చేర్చి, రెండు పదార్ధాలను బాగుగా మిశ్రమం వలె కలపండి.

• ఈ మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకుని, సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంనందు మసాజ్ చేయండి.

• మరొక 10, 15 నిముషాలు వదిలివేసిన తరువాత నీటితో శుభ్రం చేయండి.

• మెరుగైన ఫలితాల కోసం రోజులో కనీసం రెండుసార్లు పునరావృతం చేయండి.

3. పసుపు & పాలు

3. పసుపు & పాలు

పసుపు శోథ నిరోధకత మరియు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా కాలిన గాయాల చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. పాలు చర్మానికి చిరాకు నుండి ఉపశమనం కలిగించడానికి దోహదపడుతుంది మరియు తరచుగా వినియోగిస్తున్న ఎడల, కాలిన గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను కూడా తొలగిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ముడి పాలు

• చిటికెడు పసుపు

తయారుచేయు విధానం :

• ఒక గిన్నెలో, కొన్ని పచ్చి పాలు మరియు పసుపును తీసుకుని, మిశ్రమంగా కలపాలి.

• ఒక కాటన్ బాల్ తీసుకొని, ఈ పాలు - పసుపు మిశ్రమంలో ముంచి, ప్రభావిత ప్రాంతంనందు వర్తించండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసిన పిదప, 5 నిముషాల పాటు అలాగే వదిలివేయండి.

• తర్వాత, చల్లని నీటితో శుభ్రపరిచి, టవల్తో తుడిచి వేయండి.

• మెరుగైన ఫలితాల కోసం రోజులో రెండు సార్లు పునరావృతం చేయండి.

4. టొమాటో, ఎగ్ వైట్, & యోగర్ట్

4. టొమాటో, ఎగ్ వైట్, & యోగర్ట్

సహజ సిద్దమైన ఉపశమన లక్షణాలతో ప్యాక్ చేయబడి ఉన్న, టమోటాలు మీ చర్మం తిరిగి రూపాంతరం చెందడంలో సహాయం చేయగలవు. తద్వారా రంగు మెరుగుపడడమే కాకుండా, కాలిన గాయాల అవశేషాలు లేదా మచ్చలు కూడా తగ్గుతాయి. మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తూ, తేమని పెంచడంలో సహాయం చేస్తుంది. దీనితో పాటుగా, పెరుగు మరియు తెల్ల గుడ్డు కూడా కాలిన గాయాల మచ్చలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ టమోటా పేస్ట్

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ తెల్ల గుడ్డు

తయారుచేయు విధానం :

• ఒక టమోటా తీసుకోండి, దీనిని పేస్ట్ వలె చేసి దాన్ని ఒక గిన్నెకు చేర్చండి.

• దీనిలో కొంత తెల్ల గుడ్డును మరియు కొంత పెరుగును జోడించి మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమం పేస్ట్ వలె వచ్చే వరకు అన్ని పదార్ధాలను బాగుగా కలపండి.

• ప్రభావిత ప్రాంతంలోని ఈ పేస్ట్ ను మీ వేళ్లను ఉపయోగించి శాంతము మసాజ్ చేయండి. సుమారు 15 నిముషాల పాటు వదిలివేయండి.

• తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచండి.

మెరుగైన ఫలితాల కోసం రోజులో రెండు సార్లు పునరావృతం చేయండి.

Most Read :విటమిన్ డీ లోపం ఎలా వస్తుంది, ఎలాంటి అనారోగ్యాల బారిన పడతాం, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి

5. బంగాళదుంప

5. బంగాళదుంప

బంగాళా దుంపలు శరీరంలో వేడిని తొలగించడంలో ప్రసిద్ధి చెందినవిగా ఉంటాయి. క్రమంగా కాలిన గాయాల చికిత్సలో అద్భుతంగా సహాయం చేయగలుగుతుంది. అంతేకాకుండా, మచ్చలను తొలగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 ఉడికించిన బంగాళాదుంప

ఉపయోగించు విధానం :

• ఒక ఉడికించిన బంగాళాదుంపను తీసుకుని, దాని తొక్కను తీసి, రెండు ముక్కలుగా కట్ చేయండి.

• బంగాళాదుంప ఒక భాగాన్ని తీసుకొని, ప్రభావిత ప్రాంతం మీద రుద్దడం ప్రారంభించండి. 5 నుండి 10 నిముషాల పాటు మృదువుగా మసాజ్ చేసిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు ప్రభావిత ప్రాంతంలో బంగాళాదుంప తొక్కను కూడా రుద్దడం చేయవచ్చు. క్రమంగా అనుసరిస్తున్న ఎడల, మచ్చలు కూడా తొలగిపోతాయి.

• మెరుగైన ఫలితాల కోసం రోజులో రెండు సార్లు ఈ పనిని పునరావృతం చేయండి.

6. ఉల్లిపాయ & లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ :

6. ఉల్లిపాయ & లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ :

ఉల్లిపాయలో సల్ఫర్ మరియు క్వెర్సెటిన్ ఉంటాయి. ఇది కాలిన గాయాల అవశేషాలను, మొండి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. లావెండర్ ఎసెన్షియల్ నూనెలోని క్రిమి నాశక లక్షణాలు చికాకుతో కూడిన చర్మానికి ఉపశమనంగా సహాయం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 ఒలిచిన ఉల్లిపాయ

• 1 టేబుల్ స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ నూనె

తయారుచేయు విధానము :

• ఒక ఉల్లిపాయను తీసుకొని, రసం వచ్చే వరకు దానిని గ్రైండ్ చేసి, ఆ రసాన్ని ఒక గిన్నెకు బదిలీ చేయండి.

• లావెండర్ ఎసెన్షియల్ నూనె, కొన్ని చుక్కలను వేసి , రెండు పదార్ధాలను మిశ్రమంలా కలపండి.

• ఇప్పుడు ఒక కాటన్ బాల్ తీసుకొని, మిశ్రమంలో ముంచి, 5 నుండి 10 నిమిషాలపాటు ప్రభావిత ప్రాంతం మీద మసాజ్ వలె చేయండి.

• 5 నిముషాల పాటు వదిలివేసిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

• మెరుగైన ఫలితాల కోసం రోజులో రెండు సార్లు పునరావృతం చేయండి.

పైన చెప్పిన 6 గృహ నివారణా చిట్కాలు, ఉపశమనంగా మాత్రమే కాకుండా, నొప్పి తగ్గుదలలో మరియు గాయాలు, మచ్చల నివారణలో కూడా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పబడింది. తీవ్రగాయాల నేపద్యంలో, ప్రధాన చికిత్సగా మాత్రం ఎంచుకోరాదు. మరియు ఈ 6 గృహ చిట్కాలు ఎటువంటి ప్రతి చర్యలు లేనివిగాను, మరియు వాపును, నొప్పిని తగ్గించే యాంటి ఇన్ఫ్లమేటరీ , యాంటీ బయాటిక్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఎటువంటి ఆందోళనలకు లోను కాకుండా వినియోగించవచ్చునని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Home Remedies to Remove Burn Marks from the Skin

6 Home Remedies To Remove Burn Marks From The Skin
Desktop Bottom Promotion