For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Benefits of Green Tea for Skin:గ్రీన్ టీతో ఆరోగ్యమే కాదు.. అందాన్నీ పెంచుకోవచ్చు.. అదెలాగో చూడండి...

మన చర్మంపై మొటిమలు, చర్మ క్యాన్సర్ రాకుండా నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది గ్రీన్ టీ.

|

Benefits of Green Tea for Skin: గ్రీన్ టీ(green tea) ఈ భూమి మీద అద్భుతమైన పానీయాల్లో ఒకటి. ఇతర టీలతో పోల్చి చూస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

Benefits of Green Tea for Skin

ఫైటో కెమికల్స్, ఫైటో ఫినాల్స్, అమైనో యాసిడ్లు, ఫాలిఫినాల్స్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు గ్రీన్ టీ బరువును తగ్గించడం, మెదడును చురుగ్గా ఉంచడం వరకూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Benefits of Green Tea for Skin

అయితే గ్రీన్ టీని కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. అందానికి కూడా వాడొచ్చు.. దీంతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది. ఈ సందర్భంగా ఇంట్లోనే గ్రీన్ టీతో మీ చర్మం మెరిసిపోయేలా ప్యాక్ తయారు చేసుకోవడమెలాగో ఇప్పుడే చూసెయ్యండి...

Pooja Hedge Cannes Look :ప్రపంచ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా బుట్టబొమ్మ...Pooja Hedge Cannes Look :ప్రపంచ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా బుట్టబొమ్మ...

వారానికొకసారి..

వారానికొకసారి..

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కళ్ల కింద ముడతలు తగ్గిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు కూడా మాయమవుతాయి. వీటిలో ఉండే విటమిన్ కే కళ్ల కింద లావుగా ఉన్న భాగాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది. గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో సుమారు గంట సేపు ఉంచి ఆ తర్వాత దాన్ని మీ కళ్లపై అరగంటపాటు ఉంచుకోవాలి. వారానికొకసారి ఇలా చేస్తే చాలా మీ కళ్లు మెరుస్తాయి.

మెరిసే చర్మం కోసం..

మెరిసే చర్మం కోసం..

ఏ కాలంలో అయినా చర్మం మెరుస్తూ ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే దీని కోసం మీరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం గ్రీన్ టీతో ముఖం కడుక్కుంటే చాలు. ఇది మీ చర్మంలోని మలినాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రం చేసే ఒక మంచి టోనర్ గా పని చేస్తుంది.

గ్రీన్ టీ చర్మానికి అప్లై చేస్తే..

గ్రీన్ టీ చర్మానికి అప్లై చేస్తే..

* చర్మ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటుంది.

* పింపుల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

* మిమ్మల్ని యవ్వనంగా కనిపించేటట్లు చేయడంలో సహాయపడుతుంది.

* అల్ట్రా-వయలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

గ్రీన్ టీ, పెరుగు ప్యాక్..

గ్రీన్ టీ, పెరుగు ప్యాక్..

గ్రీన్ టీని ఒక స్పూన్ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేయండి. సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చాలు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మీ అందం రెట్టింపు అవుతుంది.

చర్మం కాంతివంతంగా..

చర్మం కాంతివంతంగా..

గ్రీన్ టీ మీ స్కిన్ గ్లోను కచ్చితంగా పెంచుతుంది. అంతేకాదు మీ ఫేస్ పై ఉండే నల్లమచ్చలు, పింపుల్స్ ను తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడంతో పాటు కొన్ని టీ ఆకులను మెత్తని పేస్టులా తయారు చేసుకుని, అందులో కాస్త తేనే, నిమ్మరసం కలిపి, ఈ ప్యాక్ ని సుమారు 15 నిమిషాల పాటు ఉంచుకుని ముఖాన్ని కడుక్కుంటే మీ చర్మ కాంతివంతంగా మారుతుంది.

చర్మానికి తేమను..

చర్మానికి తేమను..

గ్రీన్ టీ తాగడం వల్ల మీ చర్మంపై జిడ్డును నియంత్రించొచ్చు. ఎందుకంటే గ్రీన్ టీలో జిడ్డును తగ్గించి, మెరిసే కాంతివంతమైన చర్మాన్ని అందించే గుణాలు ఎన్నో ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి కాలిన గాయాలు, రాషెస్ నుండి కాపాడతాయి. మీ చర్మానికి కావాల్సినంత తేమను అందించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.

హెయిర్ కేర్..

హెయిర్ కేర్..

గ్రీన్ టీతో మీ హెయిర్ కూడా చాలా బలంగా తయారవుతుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్ అల్ఫా రిడక్టేజ్ గుణాలు మీ కురులు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే గ్రీన్ టీ రోజూ తాగడంతో పాటు నెలకు ఒకసారి తలకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది.

English summary

Benefits of Green Tea for Skin: Acne, Skin Cancer, and Others in Telugu

Here are these benefits of green tea for skin:Acne, skin cancer, and others in Telugu. Have a look
Story first published:Saturday, May 21, 2022, 11:58 [IST]
Desktop Bottom Promotion