For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగపిండి+పెరుగు+పసుపు=గ్రేట్ ఫేస్ మాస్క్ తో యవ్వనం మీ సొంతం!!

శెనగపిండి+పెరుగు+పసుపు=గ్రేట్ ఫేస్ మాస్క్ తో నవ లావణ్యం

|

చర్మ సంరక్షణకు వయస్సు ఎప్పుడూ ఒక సవాలు. వృద్ధాప్యం యొక్క మొదటి సంకేతాలు తరచుగా మన చర్మంపై కనబడేలా చేస్తాయి. వీటిని ఆపడానికి చాలా మంది తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. చర్మ సమస్యల్లో తరచూ మనం చూసేవి మొటిమలు, మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్, మొటిమల తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఆయిల్ హెడ్స్, స్కిన్ ట్యానింగ్, ఊహించని చర్మ రంగు, నిర్జీవమైన చర్మం మరియు ఇతర మరికన్ని సమస్యలు. ఇవన్నీ కూడా ముఖంలో వృద్ధాప్య లక్షణాలకు కారణం అవుతాయి. అందువల్ల, ఈ చర్మ సమస్యలన్నింటి పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఎలాగంటే చాలా సింపుల్ గా మాన వంటగదిలోని ఈ 3 పదార్థాలు మీ వద్ద ఉంటే చాలు.

Gram Flour, Turmeric and Curd Face Pack for a Problem-Free Skin

అనేక చర్మ సమస్యల నుండి అందాన్ని ఎలా సంరక్షించుకోవాలో అందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. చర్మ సంరక్షణ కోసం పెరుగు, పసుపు, శెనగపిండి మూడు పదార్థాలు ఒక మిశ్రంగా తయారుచేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వృద్ధాప్యలక్షణాలు తొలగిపోతాయి. మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ పురాతన కాలం నుండి వస్తున్న ఒక కామన్ ఫేస్ ప్యాక్ ఇది. ఈ యంగ్ జనరేషన్ లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నింటికి ఈ మూడింటితో పరిష్కరించగల సత్తా ఉంది. మరి ఈ మిశ్రమాన్ని ఎలా తయారుచేయాలి, ఎలా ఉపయోగించాలి చూద్దాం.

ఈ ఫేస్ ప్యాక్ ను ఎవరు వేసుకోవచ్చు:

ఈ ఫేస్ ప్యాక్ ను ఎవరు వేసుకోవచ్చు:

ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, మొటిమలున్న వారు ఇలా అన్ని రకాల చర్మ తత్వాల వారు ఈ ఫేస్ కు ను వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పురుషులు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఎగ్జిమాతో బాధపడేవారు కూడా ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. హెల్తీ స్కిన్ కోరుకును ప్రతి ఒక్కరూ ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు.

తయారు చేయడానికి కావల్సిని, ఎలా తయారుచేయాలి

తయారు చేయడానికి కావల్సిని, ఎలా తయారుచేయాలి

పసుపు, పెరుగు , శెనగపిండి, అవసరం అయితే కొద్దిగా బాదం ఆయిల్ ఇది అవసరం అయితేనే. వీటన్నింటి ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖ చర్మానికి , మెడకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎటువంటి చర్మ సమస్యలకైనా ఈ ఫేస్క్ ప్యాక్ మంచి పరిష్కారం చూపుతుంది. అన్ని రకాల చర్మ చీకాకుల నుండి మిమ్మల్ని విముక్తి చేయడంలో సహాయపడుతుంది.

అన్ని రకాల చర్మ సమస్యలకు

అన్ని రకాల చర్మ సమస్యలకు

ఇది అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడే ఇంటి నివారణ. ఏలాంటి బ్యూటీ సమస్యనైనా పరిష్కరించడానికి మీరు ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడపై సుమారు 20-30 నిమిషాలు అప్లై చేసి ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నీటితో కడిగే సమయంలో సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేయాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న సమయంలో ముఖంలో ఎలాంటి కదలికలు లేకుండా చూసుకోవాలి.

మంచి మాయిశ్చరైజర్

మంచి మాయిశ్చరైజర్

ఈ మిశ్రమం మంచి మాయిశ్చరైజర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇది మీ చర్మం మరియు ముఖానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మపు చికాకులను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం పొడిబారకుండా సహాయపడుతుంది.

అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది

అకాల వృద్ధాప్యం అందరికీ సమస్య అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మనం పెరుగుతో తయారుచేసే ఈ ఫేస్ ప్యాక్ చాలా గొప్పగా సహాయపడుతుంది. ఇది చర్మపు సమస్యలను తగ్గించడానికి మరియు అకాల వృద్ధాప్యం నుండి ముడుతలను నివారించడానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యం మీ విశ్వాసాన్ని దెబ్బతీసే విషయం. అందువల్ల మీరు ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. మంచి ఫలితం ఉంటుంది.

నల్ల మచ్చలను నివారిస్తుంది

నల్ల మచ్చలను నివారిస్తుంది

చర్మంపై ముదురు రుంగులో మచ్చలు ముఖ అందాన్ని పాడు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మనలో చాలా మంది దాని కోసం చర్మానికి అనేక రకాల క్రీములు, ప్యాక్ లు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సమస్యను కఠినంగా నివారించాలని మీరు సిద్దపడితే ఈ పెరుగు,శెనగపిండి, పసుపు ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇవన్నీ చర్మానికి మిశ్రమంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

పొడి చర్మం

పొడి చర్మం

పొడి మరియు ఆయిల్ చర్మం అందరికీ చికాకు కలిగిస్తుంది. దీనికి పరిష్కారం శెనగపిండి, పెరుగు మరియు పసుపు మిశ్రమం. ఇది చర్మంపై ఒక మేజిక్ చేస్తుంది. అందానికి సంబందించిన ఏ సమస్యనైనా తొలగించబడుతుంది. చాలా మంది ఇబ్బంది పెట్టే సమస్య పొడి చర్మ దీనికి ఈ మూడింటి మిశ్రమంతో పాటు కొద్దిగా బాదాం ఆయిల్ లేదా న్యాచురల్ కొబ్బరి నూనెను కలిపి ప్యాక్ వేసుకుంటే మీకు ఆశ్చర్యం కలిగించే మార్పు కనబడుతుంది. పెరుగు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాక, ఇది చర్మం రంగును నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు ఇతర చికాకులను తగ్గిస్తుంది.

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్ వంటి చర్మపు సమస్యలు బాధాకరమైనవి. దీనివల్ల చర్మం మరింత నల్లగా కనబడుతుంది. పసుపు మరియు శెనగపిండి మిశ్రమం చర్మ సంరక్షణను వేగవంతం చేయడానికి మరియు బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. అరగంట తర్వాత సాధ్యమైనంత వరకు సున్నితంగా మసాజ్ చేసి తొలగించండి. ఇలా మీరు వారానికి కనీసం మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే త్వరగా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది మరియు చర్మం మెరుస్తూ కనబడటానికి సహాయపడుతుంది.

కళ్ళ క్రింద నలుపు

కళ్ళ క్రింద నలుపు

కళ్ళ క్రింద నల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ చర్మ సమస్యలను పెంచుతాయి మరియు రోజులు గడిచేకొద్దీ ఈ సమస్య మీలోని విశ్వాసాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ నయం చేయడానికి మనం పసుపు, పెరుగు మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇది కళ్ళ క్రింద నల్లబడడాన్ని పూర్తిగా తొలగిస్తుంది మరియు చర్మానికి మంచి గ్లో, ఆరోగ్యం మరియు అందాన్ని ఇస్తుంది.

చర్మ రంగును పెంచడానికి

చర్మ రంగును పెంచడానికి

చర్మ రంగు పెంచడం అంటే ఒక సవాలు పని. ఎందుకంటే మనం పుట్టినప్పటి రంగును మార్చడం సాధ్యం కాదని మొదట అర్థం చేసుకోవాలి. కానీ రెగ్యులర్ మేకప్ తో కొంచెం మార్పు కనిపించవచ్చు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మ ఛాయాలో మార్పు వస్తుందంటే అది మీకు ఆశ్చర్యం కలిగించే విషయమే కదా.. అంతే కాదు చర్మంను ప్రకాశవంతంగా మారుచుతుంది.

English summary

Gram Flour, Turmeric and Curd Face Pack for a Problem-Free Skin

Here is the gram flour, turmeric and curd face pack for clear and problem free skin, Take a look.
Story first published:Tuesday, September 24, 2019, 16:05 [IST]
Desktop Bottom Promotion