For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Homemade Gel:తాజా రోజా, కలబందతో మీ చర్మ సౌందర్యం రెట్టింపు... అదెలాగో మీరే చూడండి...

రోజ్, కలబందతో మీ చర్మ సమస్యలకు చెక్ పెట్టేయ్యండి.

|

2022లో అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. ఉదయం నుండే భానుడు భగభగమంటున్నాడు. దీంతో బయట అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.

Homemade Gel Made From Fresh Roses and Aloe-Vera Get Facial Glow in Telugu

ఇదిలా ఉండగా.. ఎండాకాలంలో వేడి సమస్యతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ కాలంలో మన చర్మం మీద ఎండ ప్రభావం, దుమ్ము, చెమట వల్ల చాలా సమస్యలొస్తాయి. సూర్యుని వేడి ప్రభావానికి మన చర్మంపై ఉండే అసలు రంగు పోతుంది.

Homemade Gel Made From Fresh Roses and Aloe-Vera Get Facial Glow in Telugu

అయితే చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మన ఫేసులో గ్లో కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని క్లెన్సింగ్, మాయిశ్చరైజ్, టోనింగ్ చేసుకోవడం అనేవి మన స్కిన్ కేర్లో భాగమై ఉంటాయి. ఇందుకోసం కెమికల్స్ తయారు చేయబడిన అనేక ఖరీదైన లోషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది అందరికీ కుదురుతుందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మనలో చాలా మంది చర్మతత్వానికి సరిపోయే ఉత్పత్తులను వాడటం లేదు.

Homemade Gel Made From Fresh Roses and Aloe-Vera Get Facial Glow in Telugu

అంతేందుకు మనం ఏదైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లినప్పుడు, తను కూడా మన స్కిన్ కు తగ్గట్టు ఫేషియల్ చేస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలో టోన్ స్కిన్ పొందడం కష్టమవుతుంది. ఒకవేళ ఆ సమయంలో స్కిన్లో గ్లో కనిపించినా.. అది తాత్కాలికంగానే ఉంటుంది. ఒకవేళ మేకప్ వేసుకున్నా.. దాని వల్ల మన స్కిన్ హెల్త్ పాడవుతుంది. స్కిన్ న్యాచురలిటీని కోల్పోతుంది. అలాగని మేకప్ లేకుండా బయటకు వెళ్లడం కూడా కష్టమే. ఇలాంటి సమయంలో ఏమి చేయాలని చింతిస్తున్నారా? ఇందుకు పరిష్కారం మా దగ్గర ఉంది. మీరు రెగ్యులర్ గా వంటింట్లో, తోటల్లో ఉపయోగించే వాటితో మీ చర్మ సౌందర్యాన్నిపెంచుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి...

ఈ నొప్పి పుట్టించే మొటిమలను కొద్దిరోజుల్లో ఎలా పోగొట్టుకోవచ్చు... అది కూడా ఇంట్లోనే...ఈ నొప్పి పుట్టించే మొటిమలను కొద్దిరోజుల్లో ఎలా పోగొట్టుకోవచ్చు... అది కూడా ఇంట్లోనే...

చర్మం మెరిసిపోయేలా..

చర్మం మెరిసిపోయేలా..

చర్మం అందంగా, యవ్వనంగా, మెరిసిపోతూ కనిపించాలంటే ఈ మూడు పదార్థాలతో ప్రిపేర్ చేసిన ప్యాక్ వేసుకోవాల్సిందే. ఇది మన చర్మనాకి కావాల్సిన పోషణను అందించి మెరిసిపోయేలా చేస్తుంది.

ఈ మిశ్రమాన్ని..

ఈ మిశ్రమాన్ని..

ముందుగా ఒక టీ స్పూన్ కలబంద(aloe-vera) గుజ్జు, రెండు టీ స్పూన్ల తాజా రోజ్ వాటర్, పసుపు పొడిని ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి. 25 నుండి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న చర్మం వచ్చేస్తుంది.

చర్మానికి రక్షణ..

చర్మానికి రక్షణ..

మీరు వాడే తాజా రోజ్ వాటర్ తో మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి కాపాడటంలో సహాయపడుతుంది. అలాగే కలబందలో ఉండే హీలింగ్ మరియు ఓదార్పు లక్షణాలు సూర్యరశ్మి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా తాజా రోజా మరియు కలబంద మిశ్రమం మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలను తొలగించడం, చర్మాన్ని తేమగా ఉంచడం, చర్మాన్ని శుభ్రంగా మరియు తాజాగా ఉంచడం, నల్లటి వలయాలు, ముడతలను తొలగించడం, చర్మంపై పిహెచ్ బ్యాలెన్స్ కాపాడటంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి.

ఎన్ని రోజులంటే..

ఎన్ని రోజులంటే..

ఈ మిశ్రమాన్ని సున్నితమైన చర్మం ఉన్న వారు కూడా వాడొచ్చు. అయితే మీరు ఒకసారి ప్రయత్నించాలి. మిగిలిన వారు ఈ మిశ్రమాన్ని వరుసగా ఏడు రోజుల వరకు ఉపయోగించొచ్చు. మీరు పని చేస్తూ బిజీగా ఉంటే.. వీటిని ఎక్కువ సమయం పడుతుందని భావిస్తే.. వారాంతంలో ఈ మిశ్రమాన్ని తయారు చేసి రిఫ్రిజరేటర్లో నిల్వ ఉంచండి.

ఈ మార్పులొస్తాయి..

ఈ మార్పులొస్తాయి..

* ఈ మిశ్రమాన్ని వాడిన తర్వాత మీ చర్మం బిగుతుగా మారడాన్ని చూస్తారు.

* రోజంతా ఉండే ప్రశాంతమైన మరియు ఓదార్పు అనుభూతి కలుగుతుంది.

* సూర్యరశ్మి లేదా ఏదైనా ఇతర ప్రమాదకర చర్మ గాయాలకు తక్షణ చికిత్సలా పని చేస్తుంది.

* ఇది వరకంటే తక్కువ మొటిమలు ఉంటాయి

* అంతేకాదు ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ ఫేసులో గ్లోను పెంచుతుంది మరియు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

* చర్మంపై ఏర్పడే దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.

FAQ's
  • రోజ్ వాటర్, అలోవేర్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి?

    చర్మం అందంగా, యవ్వనంగా, మెరిసిపోతూ కనిపించాలంటే ఈ మూడు పదార్థాలతో ప్రిపేర్ చేసిన ప్యాక్ వేసుకోవాల్సిందే. ఇది మన చర్మనాకి కావాల్సిన పోషణను అందించి మెరిసిపోయేలా చేస్తుంది. ముందుగా ఒక టీ స్పూన్ కలబంద(aloe-vera) గుజ్జు, రెండు టీ స్పూన్ల తాజా రోజ్ వాటర్, పసుపు పొడిని ఒక టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి. 25 నుండి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న చర్మం వచ్చేస్తుంది.

English summary

Homemade Gel Made From Fresh Roses and Aloe-Vera Get Facial Glow in Telugu

Applying this homemade gel made of rose and aloe Vera gets rid of skin related problems and it also returns the lost complexion of the skin. Know how to make this face gel.
Story first published:Friday, April 8, 2022, 17:04 [IST]
Desktop Bottom Promotion