For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు + పసుపుతో మీ అందం రెట్టింపు, వయస్సైన లక్షణాలు అస్సలు కనబడవు!

పెరుగు + పసుపుతో మీ అందం రెట్టింపు, వయస్సైన లక్షణాలు అస్సలు కనబడవు!

|

అందం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు, డ్రై, ఆయిలీ, జిడ్డు చర్మం వంటి చర్మ రకం మరియు మొటిమలు, మచ్చలు ఇలా అన్నీ ముఖ్యమైనవి.

మీ చర్మం అందం శాశ్వతంగా ఉండాలని కోరుకోని వారు ఉండరు. ముడతలు లేని చర్మం అందంలో చాలా ముఖ్యం. చర్మ సంరక్షణతో సహా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి.

ఇది చర్మం రంగును పెంచుతుంది మరియు ముడుతలను తగ్గిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే న్యాచురల్ రెమెడీస్ చర్మం అందాన్ని కాపాడుటలో గొప్పగా సహాయపడుతాయి. పెరుగు మరియు పసుపును చర్మం అందాన్ని మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు.

How Curd And Turmeric Face Pack Protects Skin From Ageing,

పెరుగు చర్మ ఆరోగ్యంను మరియు అందంను మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. మీ ముఖాన్ని తేమగా మార్చడానికి, చర్మ పొడి బారకుండా, ఎలాంటి చారలు, దద్దుర్లు లేకుండా చూసుకోవాలంటే పెరుగు బాగా సహాయపడుతుంది.

How Curd And Turmeric Face Pack Protects Skin From Ageing,

అలాగే పసుపును కూడా వంటింటి చిట్కాల్లో పురాతన కాలం నుండే ఉపయోగిస్తున్నారు. పసుపు వంటలకు మంచి రంగును మాత్రమే ఇవ్వదు. చర్మానికి కూడా మంచి ప్రయోజనాలను అందిస్తుంది, అనేక చర్మ సమస్యలను నివారించడంలో ఇది ఒక మంచి ఔషధం. ఇది యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల మొటిమలతో సహా అనేక చర్మ సమస్యలకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

ముఖం రంగు పెంచడానికి

ముఖం రంగు పెంచడానికి

పెరుగు మరియు పసుపు మిశ్రమం ముఖానికి రంగును మెరుగుపరిచే ప్రధాన పదార్థాలలో ఒకటి. పెరుగులో కొద్దిగా పసుపు పొడి వేసి కలిపి మీ చర్మపై లేపనంగా రాయాలి. ఇది మీ చర్మ రంగును పెంచడంలో గొప్పగా పనిచేస్తుందని హామి ఇస్తున్నాము. అలాగే పెరుగు మరియు పసుపులో కూడా బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల చర్మంను శుభ్ర పరిచే నునుపుగా, క్లియర్ గా మార్చడంలో గొప్పగా సహాయపడుతాయి.

ముఖం మీద ముడతలు

ముఖం మీద ముడతలు

ముఖంపై ముడతలను తొలగించడానికి ఇది గొప్ప మార్గం. కొల్లాజెన్ ఉత్పత్తికి పెరుగు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను తేమ చేయడానికి కూడా ఉపయోగపడతాయి.

ముఖం మీద మచ్చలు

ముఖం మీద మచ్చలు

ముఖంపై మచ్చలు, ముదురు మచ్చలు మరియు చిన్న చిన్న మచ్చలను పోగొట్టడానికి ఇది సహజమైన ఔషధం. ముఖం మీద చిన్న చిన్న మచ్చలు అని కూడా పిలువబడే బ్లాక్ హెడ్స్, ఎండలో తిరిగినప్పుడు మరింత వేగంగా పెరుగుతాయి. పసుపును పెరుగుతో కలిపి లేపనంగా రాసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఇది తిరిగి వ్యాప్తి చెందకుండా ఉంటుంది

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు

పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పెరుగు మంచి క్లీనింగ్ ఏజెంట్. ఈ రెండు పదార్థాలు కలిపి ప్యాక్ వేసుకుంటే, ఎలాంటి చర్మ వ్యాధులనైనా నయం చేయవచ్చు. మొటిమలు వంటి సమస్యలకు ఇవి గొప్ప పరిష్కారం. ఈ సహజ కలయిక ద్వారా ముఖం మీద అలెర్జీలు మరియు ఎర్రటి మచ్చలు నయమవుతాయి. మొటిమల మచ్చల చికిత్సకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది.

పొడి చర్మం నివారణకు మంచింది

పొడి చర్మం నివారణకు మంచింది

ఈ కలయిక పొడి చర్మానికి గొప్ప ఔషధంగా చెప్పవచ్చు. ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. పెరుగుకు ఆ సహజ సామర్థ్యం ఉంది. పెరుగు మరియు పసుపు ఈ మిశ్రమం చర్మంలో ముడుతలను తొలగించడానికి మరియు చర్మానికి మృదువైన గ్లో ఇవ్వడానికి సహాయపడుతుంది.

 సన్ టాన్

సన్ టాన్

అందం విషయంలో సన్ టాన్ మరియు చర్మంలో దద్దుర్లు వంటి సమస్యలకు ఇది అద్భుతమైన ఔషధం. మీరు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ సమ్మేళనం సూర్యుడి అతినీలలోహిత కిరణాల చర్మం తట్టుకొనేలా చేస్తుంది. సన్ టాన్ వల్ల నల్లగా మారిన చర్మ రంగును తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తుంది, అలాగే ముడుతలను కూడా తొలగిస్తుంది.

మంచి పెరుగు

మంచి పెరుగు

ఫేస్ ప్యాక్ కోసం మంచి, స్వచ్చమైన పెరుగుకి పసుపు పొడి జోడించి వాడుకోవచ్చు లేదా కస్తూరి పసుపు కూడా మంచిది.

English summary

How Curd And Turmeric Face Pack Protects Skin From Ageing

How Curd And Turmeric Face Pack Protects Skin From Ageing, Read more to know about,
Story first published:Friday, November 15, 2019, 17:01 [IST]
Desktop Bottom Promotion