Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ సింపుల్ చిట్కాలతో చలికాలంలోనూ అందమైన పెదాలు మీ సొంతం...
చలికాలంలో పెదాలు అందంగా కనబడేందుకు ఈ రెమెడీస్ ను ప్రయత్నించండి.
అందం అనగానే అందరూ ఎక్కువగా ముఖం.. కళ్లు, చిరునవ్వు, అదరసౌందర్యం వంటివాటిని చూస్తారు. అలాంటివే నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా.

అయితే చలికాలంలో మీ మోములో చిరునవ్వు అందంగా కనబడాలంటే పెదాలను పదిలంగా కాపాడుకోవాలి. ఇవి కేవలం అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా అవసరం.

అందంగా కనిపించేందుకు ఎంత మేకప్ వేసుకున్నా.. పెదాలు ఆకర్షణీయంగా లేకపోతే నలుగురిలో మీరు అందంగా కనబడరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే చలికాలంలో పెదాలు పగలడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

అయితే ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో మీరు కూడా చూసెయ్యండి.. చలికాలంలో చక్కని మోముతో నలుగురిలో మీరు స్పెషల్ గా కనిపించండి...

పెదాల మీద తేనే..
చలికాలంలో పెదాలు పొడిబారకుండా ఉండేందుకు మీ రెండు పెదవులపై స్వచ్ఛమైన తేనేను రాయండి. ఆపైన ఒక లేయర్(కొద్దిగా) వ్యాసిలీన్ ను కూడా రాయండి. అలా చేసిన 15 నిమిషాల తర్వాత తడిబట్టతో వాటిని తుడిచేయండి. ఇలా వారంలో ఏడురోజుల పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

గులాబీ రేకులను..
ముందుగా పావు కప్పు పచ్చి పాలను తీసుకోండి. అందులో ఐదు లేదా ఆరు గులాబీ రేకులను రెండు లేదా మూడు గంటల పాటు ఉంచండి. ఆ తర్వాత ఆ రేకుల్ని మీ చేతులతోనే మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టుని మీ పెదాలకు రాసిన 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఒక వారంలో ఏడు రోజుల పాటు చేసేయండి చాలు. మీ పెదాలు చాలా అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఈ నూనెలు..
మీ పెదాలు అందరి కంటే అందంగా కనబడాలంటే.. కొబ్బరి నూనె లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లాంటి క్యారియర్ ఆయిల్ లో ఒకట్రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి వాటిని కలిపి మీ పెదాలపై రాయండి. ఒకరోజులో రెండు లేదా మూడుసార్లు ఇలా చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చలికాలమంతా మీ పెదాలు అందంగా మారిపోతాయి.

రాత్రి పడుకునే ముందు..
మీ పెదాలు రోజంతా తాజాగా కనబడాలంటే ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా తాజాగా తీసిన అలోవెరా జెల్ ని గాలి దూరని ఒక డబ్బాలోకి తీసుకోండి. రాత్రి పడుకునే ముందు మీ పెదాలకు ఈ జెల్ ని రాయండి. అవసరాన్ని బట్టి ఈ డబ్బాను ఎక్కువ రిఫ్రిజరేటర్లో ఉంచండి. అప్పుడు మీ పెదాలకు మంచి ఫలితం ఉంటుంది.

కొన్నిరోజుల పాటు..
మీ పెదాలు చలికాలంలో చక్కని రూపంలో కనిపించేందుకు.. కొన్నిరోజుల పాటు రాత్రి వేళ ముఖ్యంగా నిద్రలోకి జారుకునే ముందు షియా బటర్ కానీ, కోకోవా బటర్ కానీ లిప్స్ కి పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. అప్పుడు మీ పెదవులు మంచి రూపాన్ని తెచ్చుకుంటాయి.

పెరుగుతో..
చలికాలంలో మీ పెదవులు చక్కని రూపును కలిగి ఉండాలంటే.. మీ రాత్రి వేళలో పీనట్ బటర్, పెరుగును రాత్రి వేళ నిద్రపోయే ముందు మీ పెదాలకు రాయాలి. అలా పది నిమిషాల పాటు ఉంచి, తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. కొన్నిరోజుల పాటు తరచుగా ఇలా చేస్తే మీరు ఊహించిన పలితాలొచ్చేస్తాయి.

రోజుకోసారి..
ముందుగా ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగుని కొన్ని నిమిషాల పాటు ముంచాలి. ఆ తర్వాత ఆ బ్యాగుని మీ పెదాల మీద కొన్ని నిమిషాల పాటు ఉంచితే కూడా మీ పెదాలు అందంగా మారిపోతాయి. రోజులో ఒకసారి ఇలా చేస్తే చాలు.

రోజుకు రెండుసార్లు..
ఒక దోసకాయ ముక్క తీసుకుని పెదాల మీద రబ్ చేయండి. అప్పుడే వచ్చే జ్యూస్ ను పది నిమిషాల పాటు మీ పెదాలపై అలాగే వదిలేయండి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇలా రెండు సార్లు చేస్తే మీరు ఊహించిన ఫలితాలు రావడమే కాదు.. మీ పెదాలు మరింత ఆకర్షణీయంగా తయరవుతాయి.
చూశారు కదా.. ఈ రెమెడీస్ లో మీకు నచ్చిన వాటిని ట్రై చెయ్యండి.. మీ పెదాలను అందరి కంటే అందంగా మార్చుకోండి.



Click it and Unblock the Notifications