For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెడిషనల్ లుక్ ను అందించే శారీ డిజైన్స్: నవరాత్రి స్పెషల్

|

పండుగలు అంటేనే మహిళల్లో ఒక కొత్త కళ సంతరించుకుంటుంది. పండగలకు చాలా ప్రత్యేకంగా, సాంప్రదాయంగా అలంకరించుకోవడం స్త్రీల యొక్క ప్రత్యేకత. ఎప్పటిలాగా కాకుండా కొంచెం స్పెషల్ గా కనబడేలా అలంకరించుకోవడం, ట్రెడిషినల్ గా తయారవ్వడం అంటే మహా ఇష్టం. మరి దుశరా మొదలైంది తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసుకొనే శరన్నవరాత్రులు స్త్రీలకు చాలా ప్రత్యేకం. మరి ఈ ప్రత్యేకమైన రోజులు స్పెషల్ గా కనిపించాలంటే మీ వార్డ్ రోబ్ లో ట్రెడిషనల్ దుస్తులు లేదా శారీలు ఉండాల్సిందే. కొన్ని ప్రత్యేకమై చీరలు, బ్రైట్ కలర్లో ఉన్న చీరలు నవరాత్రి రోజుల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా ఒక ఫర్ ఫెక్ట్ స్టైల్ స్టేట్మెంట్ ను తెలుపుతుంది. ఉదాహరణకు రెడ్ మరియు ఆరెంజ్ కలర్స్ ఈ రెండూ కూడా నవరాత్రి పండుగ పర్వదినాల్లో ఫర్ఫెక్ట్ కలర్స్ గా ఎంపిక చేసుకోవచ్చు.

ఈ మద్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు, ట్రెడిషనల్ లుక్ తో చీరల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మీకు నచ్చని సెలబ్రెటీల్లా మీరు కూడా అందంగా, ఈజీగా అలంకరించుకోవచ్చు. ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన కొన్ని ఫోటలోను గమనించినట్లైతే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా అలంకరించుకోవాలి. ఎలా డిజైన్ చేసుకోవాలనేది తెలుస్తుంది. మరి ఆ డిజైన్స్ మరియు శారీ కలర్స్, శారీ మోడల్స్ ఎంటో స్లైడర్ మీద ఓ లుక్ వేయండి....

రెడ్ అండ్ బ్లాక్ :

రెడ్ అండ్ బ్లాక్ :

ఐశ్వర్య రాయ్ ధరించిన రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీలో చాలా ట్రెడిషనల్ గా కనబడుతున్నారు. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన ఈ శారీ బార్డ్ బోల్డ్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. రెడ్ శారీ మీదకు బ్లాక్ బ్లౌజ్ కూడా ఫర్ ఫెక్ట్ గామ్యాచ్ అయ్యింది.

మిర్రర్ వర్క్ శారీ:

మిర్రర్ వర్క్ శారీ:

డిజైనర్ అర్పిత్ మెహత కలెక్షన్స్ శారీ ఇది. మిర్రర్ వర్క్ శారీ చాలా కలర్ ఫుల్ గా మెరుస్తూ కనిపిస్తున్న స్టార్ సెలబ్రెటీని చూస్తే మీరు కూడా ఇలా తయారైతే భాగుంటుందనిపిస్తుంది.

లేస్ వర్క్ శారీ:

లేస్ వర్క్ శారీ:

ప్రముఖ డిజైనర్ వరుణ్ బాల్ డిజైన్ చేసిన ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ శారీ లేస్ వర్క్ బ్లౌజ్ స్టైలిష్ గా ఉంది.

ఫ్లామింగ్ రెడ్ కలర్ శారీ:

ఫ్లామింగ్ రెడ్ కలర్ శారీ:

రెండ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా కనబడుతున్న సెలబ్రెటీ. పండుగలకు ఇటువంటి బ్రైట్ కలర్స్ ఎంపిక చేసుకుంటే స్పెషల్ గా కబనడవచ్చు. గోల్డెన్ బార్డర్ మరియు శారీ మొత్తం అక్కడక్కడా పాట్రన్ కూడా చూడముచ్చటగా ఉంది.

బ్లూ సిల్క్ శారీ:

బ్లూ సిల్క్ శారీ:

ప్రముఖ డిజైనర్ సంజయ్ గార్గ్ డిజైన్ చేసిన రాయల్ బ్లూ సిల్క్ శారీ చాలా అందంగా చాలా స్పెషల్ గా ఉంది. చీర మీదకు సిల్వర్ బార్డర్ చాలా గ్రేట్ గా ఉంది.

బెంగాలీ శారీ:

బెంగాలీ శారీ:

నవరాత్రి రోజుల్లో దుర్గా మాతను పూజిస్తారు. ఈ నవరాత్రులు బెంగాలీయులకు చాలా పెద్ద పండుగ. కాబటట్టి, రెండ్ అండ్ వైట్ టాంట్ శారీ కూడా ట్రెడిషనల్ లుక్ ను అందిస్తుంది.

కాంచీవరం:

కాంచీవరం:

కాంచీవరం శారీ సౌత్ ఇండియన్ శారీ. అయితే ఈ మద్యకాలంలో చాలా పాపులారీటి పొందిన చీరల్లో టాప్ లిస్ట్ లో కాంచీవరం కూడా ఉంది. కాంచీవరం చీరలు కలర్ ఫుల్ గా మరియు రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషలన్లో ట్రెడిషనల్ లుక్ తో పండుగ కళ ఉట్టిపడుతుంది.

రెడ్ కలర్ స్వీక్వెన్డ్ శారీ:

రెడ్ కలర్ స్వీక్వెన్డ్ శారీ:

రెడ్ కలర్ శారీమీద సీక్వెన్స్ వర్క్ చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే త్రీఫోర్త్ శారీ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఇంటువంటి శారీ డిజైన్ ఎంపిక చేసుకొన్నప్పుడు, హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉండాలి.

పింక్ అండ్ గోల్డ్:

పింక్ అండ్ గోల్డ్:

పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్సాట్రార్డినరీగా ఉన్నది. శారీ పొడవునా బార్డర్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ మరియు ట్రిమ్మ్డ్ గోల్డెన్ బార్డర్ చాలా బారీగా కనబడుతున్నది. అలాగే గోల్డెన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ను తలపిస్తున్నది.

నియాన్ శారీ:

నియాన్ శారీ:

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది నియాన్ కలర్స్ . కాబట్టి, మల్టిపుల్ కలర్స్ తో ఉన్న చీరలను కట్టుకోవడం కూడా స్టైలిష్ గా ఉంటుంది.

ఆరెంజ్ అండ్ బ్లాక్ బార్డర్:

ఆరెంజ్ అండ్ బ్లాక్ బార్డర్:

బ్లాక్ కలర్ టెక్నిక్ తో శారీని డిజైన్ చేయబడింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసి ఆరెంజ్ అండ్ నియాన్ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ ట్రెండ్ ను తలపిస్తున్నది.

దోతి స్టైల్ శారీ:

దోతి స్టైల్ శారీ:

ఈ మద్యకాలంలో ఇలాంటి దోతి స్టైల్ శారీ డిజైన్ లో చాలా మంది సెలబ్రెటీలు కనిపించారు.

వన్ షోల్డర్ శారీ:

వన్ షోల్డర్ శారీ:

డిజైనర్ తరున్ తహ్లియానీ డిజైన్ చేసిన రెడ్ కలర్ శారీ చాలా బ్యూట్ ఫుల్ గా ఉంది. ట్యూబ్ బ్లౌజ్ లో మాధురి దీక్షిత్ చాలా సెక్సీగా కబనడుతున్నది.

బందినీ బ్లౌజ్:

బందినీ బ్లౌజ్:

ఆరెంజ్ పింక్, గ్రీన్ షిఫాన్ శారీ మీదకు బందినీ బ్లౌజ్ చాలా ట్రెడిషనల్ లుక్ ను అందిస్తున్నది.

ప్లెయిన్ షిఫాన్ శారీ:

ప్లెయిన్ షిఫాన్ శారీ:

సింపుల్ గా స్లిమ్ బార్డర్ తో ఉన్న ప్లెయిన్ షిఫాన్ శారీని కూడా ఇలా అలంకరించుకోవచ్చు. అలాగే ఇటువంటి చీరల మీదకు ఎక్కువగా ఎంబ్రాయిడీ బ్లౌజ్ లు అదనపు ఆకర్షనను అందిస్తాయి.

న్యూడ్ శారీ విత్ కలర్ ఫుల్ బ్లౌజ్:

న్యూడ్ శారీ విత్ కలర్ ఫుల్ బ్లౌజ్:

మీరు న్యూడ్ లేదా స్కిన్ టోన్డ్ శారీలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటికి బ్రైట్ కలర్ బ్లౌజ్ లు మాత్రమే ఎక్సట్రార్డినరీగా కనబడుతాయి.

నెట్ శారీ:

నెట్ శారీ:

ప్లెయిన్ నెట్ రెడ్ శారీని స్లీవ్ లెస్ బ్లౌజ్ మీదకు ధరించినప్పుడు చూడటానికి చాలా సెక్సీగా కనబడుతారు.

చోలీ బ్లౌజ్ :

చోలీ బ్లౌజ్ :

సాధా బ్లౌజ్ మీదకు షిఫాన్ శారీని కట్టుకోవడానికి బదులు , మిర్రర్ వర్క్ చోలీని ధరించడం స్పెషల్ గా ఉంటుంది.

వైట్ అండ్ గోల్డ్ శారీ:

వైట్ అండ్ గోల్డ్ శారీ:

ట్రెడిషనల్ గా వైట్ అండ్ గోల్డ్ శారీని సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ కు మ్యాచ్ అవుతాయి. అందుకు మీరు వైట్ కలర్ సిల్క్ శారీ విత్ గోల్డ్ కలర్ బార్డ్ అద్భుతంగా కనిపిస్తుంది.

క్రిస్టల్ శారీ:

క్రిస్టల్ శారీ:

ప్రస్తుత రోజుల్లో ఫ్యాషనబుల్ శారీలు చాలా అందుబాటులో ఉన్నాయి. అందులోనూ వాటిలో క్రిస్టల్ శారీలు కూడా ఎక్కువగా ఆకర్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. శారీ మొత్తం క్రిస్టల్ ఎంబాలిష్మెంట్ అదనపు ఆకర్షను ఇస్తున్న ఇటువంటి చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

English summary

20 Best Sarees To Have For Navratri

Navratri is the time for flaunting your traditional side. That is why; you must have some sarees in your wardrobe just for Navratri. There are some really bright colours for Navratri that can help you make a perfect style statement. For example, red and orange are two colours that are perfect for Navratri sarees.
Story first published: Friday, September 26, 2014, 12:34 [IST]
Desktop Bottom Promotion