For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో ఎలాంటి పాదరక్షలను ఎంచుకోవాలంటే...

వర్షాకలంలో మీరు ఎలాంటి పాదరక్షలు ధరిస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

కరోనా లాక్ డౌన్ సడలింపులు అన్ని రాష్ట్రాల్లోనూ మొదలయ్యాయి. అప్పుడే ఆషాడ మాసం వచ్చేసింది. రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి.

Easy Tips to Choose the Best Footwear for Monsoon

ఈ నేపథ్యంలో మీరు మీ కాళ్లకు ధరించే పాదరక్షలపై కొంచెం ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా వర్షాకాలంలో మీ కాళ్లను పూర్తిగా కప్పివేసే బూట్లు, చెప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి వర్షం నీటికి తడిస్తే.. నీటిని పీల్చుకుంటాయి. దీంతో మీరు నడవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Easy Tips to Choose the Best Footwear for Monsoon

అంతేకాదు మీ చెప్పులు పీల్చుకున్న నీళ్లు అంత తొందరగా బయటికి పోవు. అంతేకాదు సూర్యుడు సరిగా రాని కారణంగా, వేడి తగలకపోవడంతో అవి త్వరగా ఆరిపోవు. దీంతో వాటిలో సూక్ష్మజీవులు నివాసం ఏర్పరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్లు పీల్చుకున్న చెప్పులు, బూట్లు చాలా బరువెక్కుతాయి. కాబట్టి ఈ కాలంలో మీరు చెప్పులు, బూట్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Easy Tips to Choose the Best Footwear for Monsoon

ఈ సమయంలో మీ కాళ్లకు రక్షణతో పాటు అందంగా.. కంఫర్ట్ గా ఉండేలా చూసుకుంటే ఎంతో మంచిది. అదే విధంగా ట్రెండ్ కు తగ్గట్టు లేటెస్ట్ ఫుట్ వేర్ తప్పనిసరి అన్న విషయం మరువకండి. ఈ సందర్భంగా వర్షకాలంలో ఎలాంటి పాదరక్షలు ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం...

మీకు బట్టతల రాకూడదంటే ఈ ఆహారాలు ఎక్కువగా తినండి...మీకు బట్టతల రాకూడదంటే ఈ ఆహారాలు ఎక్కువగా తినండి...

శాండిల్స్..

శాండిల్స్..

మీరు ధరించే పాదరక్షలలో శాండిల్స్ ను ధరిస్తే వర్షకాలంలో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. అంతేకాదు ఒక వేళ నీటిని పీల్చుకున్నా కూడా చాలా త్వరగా ఆరిపోతాయి. మీరు నడవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్ట్రాప్స్ ను పెట్టి తీయడం కూడా చాలా సులభమే. కాబట్టి వర్షాకాలంలో శాండిల్స్ కు ప్రియారిటీ ఇవ్వండి.

ట్రావెల్ ఫ్రెండ్లీ క్లాగ్స్..

ట్రావెల్ ఫ్రెండ్లీ క్లాగ్స్..

ఈ రకమైన పాదరక్షలలో ఎల్లప్పుడూ కొన్ని రంధ్రాలు ఉంటాయి. దీని వల్ల ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి. పైగా వీటిలో ఎక్కువగా వాటర్ ప్రూఫ్ గా ఉంటాయి. మీరు వర్షాకాలంలో వీటిని వేసుకుని నడవడానికి చాలా కంఫర్ట్ గా మరియు స్టైలిష్ గానూ కనిపిస్తాయి. కాబట్టి ఈ రకమైన క్లాగ్స్ ను కూడా ఓసారి ట్రై చేయండి.

ఫ్లిప్ ఫ్లాప్స్..

ఫ్లిప్ ఫ్లాప్స్..

వర్షాకాలంలో చాలా మంది ఫ్లిప్ ఫ్లాప్స్ నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రకమైన పాదరక్షలలో ఎక్కువ నీరు నిలిచి ఉండవు. ఒకవేళ నీరు ఉన్నా అత్యంత వేగంగా ఆరిపోతాయి. ఇవి బాగా స్టైలీష్ గా కూడా ఉంటాయి. చాలా మంది సెలబ్రెటీలు వర్షాకాలంలో ఈ రకమైన పాదరక్షలనే వేసుకుంటారు.

మీరు ఈ ఆయుర్వేద ఆహారాన్ని తిన్నారా ... తింటే మీరు వేగంగా బరువు తగ్గగలరు..!మీరు ఈ ఆయుర్వేద ఆహారాన్ని తిన్నారా ... తింటే మీరు వేగంగా బరువు తగ్గగలరు..!

దుర్వాసన..

దుర్వాసన..

వర్షాకాలంలో మనం వేసుకునే చెప్పులు, షూస్ లలో కొన్ని రకాలు తడిస్తే.. అవి ఆరేందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాదు అవి ఆరేందుకు చాలా సమయం పడుతుంది. అప్పుడు వాటి నుండి దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు వాటిని వేసుకుని ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఎదురుకాకుండా, వోడర్ రెసిస్టెంట్ రకాలను ఎంచుకుంటే మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

తేలికగా ఉండే వాటిని..

తేలికగా ఉండే వాటిని..

వర్షాకాలంలో మనం ఎక్కువగా వాటర్ ప్రూఫ్ రకాలు.. ముఖ్యంగా తేలికగా ఉండే మన్నికైన పాదరక్షలను తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన వాటిని చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే రబ్బరు సోల్ ఉండే పాదరక్షలను ఎంచుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇందులో కూడా నీరు ఎక్కువగా నిల్వ ఉండదు.

English summary

Easy Tips to Choose the Best Footwear for Monsoon

Here are the easy tips to choose the best footwear for monsoon. Have a look
Story first published:Friday, June 25, 2021, 17:39 [IST]
Desktop Bottom Promotion