For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2022: ఈ దీపావళికి ఇలా సంప్రదాయంగా, అందంగా కనిపించొచ్చు, మీరూ ట్రై చేయండి

ఈ దీపావళికి మీరు ఆకర్షణీయంగా అలాగే సాంప్రదాయబద్ధంగా కనిపించడానికి వీటిని ధరించండి. ఇక్కడ ఉన్న డిజైన్స్ మీకు మంచి లుక్ ను ఇస్తాయి.

|

Diwali 2022: ఉత్సాహంతో ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి. దీపావళి వేళ ఇళ్లు దీప కాంతులతో వెలుగులీనుతాయి. కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. సాయంత్రం కాగానే ప్రతి ఇంటి ముందు దీపాలు, విద్యుత్ లైట్లు వెలుగుతుంటాయి. దీపావళి మొత్తం 5 రోజుల పాటు జరుపుకునే పండగ. ధంతేరాస్ తో మొదలు అవుతుంది. దీపావళి వేళ అందంగా కనిపించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు.

Ethnic and glam women fashion wear for this Diwali 2022 in Telugu

అయితే ఈ దీపావళికి మీరు ఆకర్షణీయంగా అలాగే సాంప్రదాయబద్ధంగా కనిపించడానికి వీటిని ధరించండి. ఇక్కడ ఉన్న డిజైన్స్ మీకు మంచి లుక్ ను ఇస్తాయి.

1. పట్టు చీర

1. పట్టు చీర

దీపావళి మొదటి రోజు ధంతేరాస్ నాడు బంగారం లేదా వెండి కోసం షాపింగ్ చేస్తారు. ధంతేరాస్ షాపింగ్ ప్రతి ఇంట్లో తప్పనిసరి ఆచారం. ప్రకాశవంతమైన మరియు రంగురంగుల పట్టు చీరతో ఈ రోజును ప్రారంభిద్దాం. ఎన్ని రకాల దుస్తులు ఉన్నా, ఎన్ని రకాల డిజైన్లు ఉన్నా.. పట్టు చీరలది మొదటి స్థానమే. పట్టు చీర కడితే వచ్చే ఆ నిండుదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ కు తగ్గట్లు ఉండే మంచి చీరను ఎంపిక చేసుకుని.. డిజైనర్ బ్లౌజ్ తో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.

2. స్ట్రెయిట్ కుర్తా సెట్

2. స్ట్రెయిట్ కుర్తా సెట్

పలాజోతో కూడిన ఈ స్టైలిష్ కుర్తా సెట్ మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. ఈ స్టైల్ స్ట్రెయిట్ కుర్తా సెట్ లో చాలా రంగులు అందుబాటులో ఉంటాయి. రూబీ కాటన్ ‌తో రూపొందించబడిన ఈ కుర్తా సెట్ పైకి మంచి యాక్ససెరీస్ జోడిస్తే మీ అందం రెట్టింపు అవడం ఖాయం.

3. లెహంగా చోలి

3. లెహంగా చోలి

ఫ్యాషన్ ట్రెండ్‌లలో లెహంగాలతో ప్రత్యేక స్థానం. శుభకార్యం ఏదైనా, పండగ ఏదైనా లెహంగాలు చక్కగా ఉంటాయి. దీపావళి సాయంత్రం లెహంగా చోలీ సాంప్రదాయంగా ఉండటమే కాదు మీకు ట్రెండీ లుక్ కూడా ఇస్తుంది. డార్క్ ఆరెంజ్ కలర్ లెహంగా అందమైన జారీ మరియు సీక్విన్స్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేయబడింది. ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ మరియు చెవిపోగులతో టీమ్ అప్ చేయండి.

4. అనార్కలి కుర్తీ

4. అనార్కలి కుర్తీ

ఎప్పటికీ పాతబడిపోని స్టైల్ అనార్కలీ కుర్తీ. రోజు రోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటున్న స్టైల్ ఇది. మంచి రిచ్ లుక్ ఇస్తుంది ఈ అనార్కలీ కుర్తీ. దీపావళి పండుగకు మంచి మీకు కరెక్టుగా సూట్ అయ్యే పరిమాణంలో ఉన్న డ్రెస్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.

5. దుపట్టా సెట్‌తో కుర్తా, పలాజ్జో

5. దుపట్టా సెట్‌తో కుర్తా, పలాజ్జో

మీరు పెప్పీ మరియు క్లాస్సిగా కనిపించడానికి లైట్ కలర్ దుస్తులను ఎంచుకోవాలి. ఎరుపు, నారింజ మరియు గులాబీ రంగు దుపట్టా కలయికతో ఈ తెల్లటి సూట్ ఈ సందర్భంగా ధరించడానికి అనువైనది. గోల్డెన్ బ్యాంగిల్స్ మరియు చెవిపోగులతో దీన్ని జత చేయండి.

English summary

Ethnic and glam women fashion wear for this Diwali 2022 in Telugu

read on to know Ethnic and glam women fashion wear for this Diwali 2022 in Telugu
Story first published:Saturday, October 15, 2022, 15:58 [IST]
Desktop Bottom Promotion