For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bheemla Naik Nitya Menon:సందర్భానికి తగ్గ ‘నిత్య’నూతనంగా కనిపించాలంటే..ఈ డ్రస్సులను ట్రై చేయండి..

|

'అలా మొదలైంది' సినిమాలో నానితో కలిసి వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిత్యామీనన్. తొలి సినిమాతోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తను నటించిన ప్రతి సినిమాలోనూ చాలా ప్రత్యేకంగా కనిపించింది.

తన నటనకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా ఫిదా అయిపోయాడు. అందుకే తనకు 'ఓకే బంగారం' సినిమాలో అవకాశమిచ్చాడు. ఆ సినిమాలోనూ క్యూట్ గా కనిపించి అందరినీ అలరించింది ఈ కేరళ కుట్టి. దక్షిణాది సినీ ఇండ్రస్ట్రీలో ఎంతమంది గ్లామర్ ఉన్న హీరోయిన్లు ఉన్నప్పటికీ.. మోస్ట్ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ మాత్రం అతి తక్కువ మందే ఉన్నారు.

వారిలో నిత్యా మీనన్ ఎప్పటికీ ముందు వరుసలో ఉంటారు. నిత్యా మీనన్ కేవలం నటిగానే కాదు.. మంచి సింగర్ కూడా. తొలి సినిమా బాగా సక్సెస్ కావడంతో.. తను విలక్షణమైన పాత్రలు ఎంచుకునేది.. అలాగే తను చేసే ప్రతి సినిమాలోనూ కొత్త కొత్త రకాల డ్రస్సుల్లో కనిపించేది. చేసేది చిన్నపాత్ర అయినా.. సరైన ఔట్ ఫిట్, పర్ఫెక్ట్ స్టోరీ ఉండాలని భావిస్తుంది ఈ అమ్మడు.

తాజాగా బీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ కేరళ బ్యూటీ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. ఇటీవలే సోషల్ మీడియాలో వైట్ కలర్ డ్రస్సులో.. కొద్దిగా క్లీవేజ్ షో చేస్తూ.. చిరునవ్వును జోడించి కొన్ని స్టిల్స్ ఇచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిత్యా మీనన్ కు ఎలాంటి డ్రస్సులంటే ఇష్టం..ఏ రకమైన ఔట్ ఫిట్స్ ఎక్కువగా ధరిస్తుంది.. మీరు కూడా నిత్యా మీనన్ లా అందంగా కనిపించాలంటే ఈ డ్రస్సులను ట్రై చేయండి...

Janhvi kapoor Bold Photos:అద్దమే అసూయ పడేలా అతిలోక సుందరి అందాల ఆరబోత...

వైట్ కలర్ డ్రస్సులో..

వైట్ కలర్ డ్రస్సులో..

ఫ్యాషన్ అనేది కేవలం గ్లామర్ కోసమే కాదు. మనం ధరించే డ్రస్సులు మనమంటే ఏంటో చెప్పేందుకు కూడా దోహదపడుతుంది. మనం ఎలాంటి రకమైన డ్రస్సులను ధరిస్తే అవి మన గురించి చెబుతాయి. సెన్స్ ఆఫ్ స్టైల్ బట్టి మన పర్సనాలిటీని గుర్తించొచ్చని చెబుతారు నిపుణులు. ఇదిలా ఉండగా, నిత్యా మీనన్ పొట్టిగా.. బొద్దుగా ఉన్నప్పటికీ.. ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తాజాగా వైట్ కలర్ పంజాబీ డ్రస్సులో మరింత అందంగా కనిపించింది.

బ్లాక్ సారీ..

బ్లాక్ సారీ..

నిత్యామీనన్ కు చీరలంటే బాగా ఇష్టమున్నట్టుంది. అందుకే చాలా సందర్భాల్లో చీరలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫొటోలో ఫ్లవర్స్ బ్లాక్ కలర్ సారీలో కనిపించి.. దానికి బ్లూ కలర్ బ్లౌజ్ ధరించి.. చిరునవ్వులు చిందిస్తోంది.

సింపుల్ లుక్..

సింపుల్ లుక్..

ఈ ఫొటోలో అయితే బ్లూ కలర్ పట్టు చీరలో.. తక్కువ మేకప్ తో.. లూస్ హెయిర్ తో.. చేతికి సున్నితమైన గడియారం.. ఇయర్ రింగ్స్ ధరించి మూడు పదుల వయసు దాటినా తనలో ఏ మాత్రం అందం తగ్గలేదని నిరూపిస్తోంది.

ఆలియా మాదిరిగా మరింత అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలను పాలో అవ్వండి...

వైట్ గ్రీన్ కలర్ డ్రస్..

వైట్ గ్రీన్ కలర్ డ్రస్..

ఇక్కడ హెయిర్ ను చిన్నగా కట్ చేసుకుని.. అందుకు తగ్గట్టే మేకప్ వేసుకుని.. వైట్ కలర్ డ్రస్సులో కనిపించింది. దానికి మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ ఓనీ.. బార్డర్లో బ్లూ కలర్ ఉండేలా మ్యాచింగ్ సెట్ చేసుకుంది.

నీలిరంగు గౌనులో..

నీలిరంగు గౌనులో..

ఇక్కడ పూర్తిగా నీలి రంగు గౌనులో కనిపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. చేతిలో లాంతరు పట్టుకుని యువకుల్లో వేడి పుట్టిస్తోంది. ఇక్కడ చాలా స్లిమ్ గా కనిపిస్తోంది ఈ కేరళ కుట్టి.

పట్టుచీరలో..

పట్టుచీరలో..

నిత్యామీనన్ మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు.. సాంప్రదాయ దుస్తుల్లోనూ చాలా అందంగా కనిపిస్తుందని నిరూపించింది. ఇక్కడ పింక్ కలర్ పట్టుచీర కట్టుకుని.. చేయి, మెడ నిండా బంగారం ఆభరణాలతో పదహారుణాలా తెలుగమ్మాయిలా కనువిందు చేస్తోంది.

మత్తెక్కించే సొగసుతో కవ్విస్తోన్న కంగనా.. 3 గంటల్లో 3 డ్రస్సులతో... కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చింది...

ఈ డ్రస్సులను..

ఈ డ్రస్సులను..

ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ప్యాంట్లకు ఉన్న క్రేజే వేరు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు జీన్స్ ధరించడాన్ని బాగా ఇష్టపడతారు. నిత్యామీనన్ కూడా జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ధరిస్తారు. చూడటానికి రఫ్ గా ఉండే జీన్స్ లో సైతం వివిధ రకాల మోడల్స్ వస్తున్నాయి. అందుకే తను సందర్భానికి తగ్గట్టు ధరించేందుకు వీలుగా ఉండే జీన్స్ ను ధరిస్తుంది.

పార్టీలకు వెళ్లేందుకు..

పార్టీలకు వెళ్లేందుకు..

ఇక జీన్స్ ప్యాంట్ల విషయంలో రెగ్యులర్ గా ధరించే జీన్స్ కు డెనిమ్ జీన్స్ కు చాలా తేడా ఉంటుంది. డెనిమ్ జీన్స్ వేసుకున్నప్పుడు చాలా టైట్ గా ఉన్నట్లు అనిపించినా.. ఒకట్రెండు సార్లు వాడేసరికి చాలా సౌకర్యవంతంగా మారిపోతాయి. వీటిని సెమీ ఫార్మల్ ఈవెంట్స్ కు, స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లేందుకు వీటిని వాడొచ్చు.

English summary

Pavan Kalyan Bheemla Naik Heroin Nitya Menon Different Dresses in Telugu

Here are the pavan kalyna bheemla naik heroin nitya menon different dresses in Telugu. Have a look
Story first published:Thursday, February 24, 2022, 16:10 [IST]
Desktop Bottom Promotion