Just In
- 1 hr ago
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- 3 hrs ago
రోజుకి ఇంత వాల్నట్ తింటే చాలు అధిక రక్తపోటు తగ్గుతుంది...
- 4 hrs ago
July Horoscope 2022: జూలై 2022లో ఏ రాశి వారు సూపర్‌గా ఉండబోతున్నారో, ఏరాశి వారికి అశుభం కాబోతుందో తెలుసా?
- 6 hrs ago
పురుషుల అందాన్ని మెరుగుపరిచే కొన్ని కలబంద ఫేస్ ప్యాక్స్!
Don't Miss
- News
భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత, రేపు అమ్మవారి సేవలో యోగి ఆదిత్యనాథ్
- Finance
PGIM AMC: పీజీఐఎం ఫండ్ హౌస్ కు రూ.25 లక్షల జరిమానా విధించిన సెబీ.. ఎందుకంటే..
- Sports
Aakash Chopra : రిషబ్ పంత్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ వికెట్ కీపర్ కం బ్యాటర్
- Technology
iPhone 13 కన్నా iPhone 14 కు భారీగా డిమాండ్ ఉండబోతోందా!
- Movies
Vikram 29 Days Collections: విక్రమ్‌కు తొలి షాక్.. మొదటిసారి ఇంత తక్కువ.. అయినా అన్ని కోట్ల లాభం
- Automobiles
భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
మీ తొడలు చిన్నగా కనిపించాలంటే... ఈ అవుట్ ఫిట్స్ ట్రై చేయండి...
మనలో చాలా మంది స్త్రీలలో నడుము భాగంలో కొవ్వు పేరుకుపోవడం.. దీంతో వారు లావుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొందరికైతే తొడలు చాలా లావుగా కనిపిస్తుంటాయి.
దీంతో ఆ భాగంలో కొవ్వును తగ్గించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భాగంలో కొవ్వు (Fat) అక్కడికే వెళ్లి ఎందుకు చేరుతుందో చాలా మందికి అర్థం కాదు.
అయినా కూడా చాలా మంది అమ్మాయిలు తొడల భాగంలో కొవ్వును తగ్గించుకునేందుకు.. ఆ భాగంలో లావు కనిపించడకుండా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నించొచ్చు. అయితే కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఫాలో అయితే లావు తగ్గడంతో పాటు కాస్త సన్నగా కనిపించడంతో పాటు కాస్త మంచి లుక్ కూడా మీ సొంతమవుతుంది. ఈ సందర్భంగా మీ తొడలు చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలంటే.. తొడ భాగం సన్నగా కనిపించేలా ఈ అవుట్ ఫిట్స్ ట్రై చేయండి.

మరింత లావుగా..
చాలా మంది అమ్మాయిలు తాము లావుగా ఉన్నామని తెగ బాధపడుతూ ఉంటారు. ఆ విషయాన్ని దాచేందుకు పొడవుగా ఉండే టాప్స్ ను సెలక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే పొడువు ఉన్నంత మాత్రాన మీరు వాటిలో సన్నగా కనిపిస్తారా అంటే చెప్పడం కష్టమే. ఇదంతా కేవలం ఒక అపొహ మాత్రమే..అంతేకాదు మీరు పొడవుగా ఉండే టాప్స్ వేసుకోవడం వల్ల మీరు మరింత లావుగా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.

చిన్నగా ఉండే టాప్స్..
అందుకు బదులుగా మీరు చిన్నగా ఉండే టాప్స్ వేసుకోవడం వల్ల మీరు కొంచెం చిన్నగా కనిపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. మీ పై భాగానికి కింది భాగానికి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చేసి మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.

ఈ డ్రస్సులు..
లావుగా ఉండే వారు చిన్నగా కనిపించాలంటే.. ఎ లైన్ డ్రస్సులు చక్కగా సరిపోతాయి. ఇవి కాస్త టైట్ గా ఉండే మినీ, మిడీ స్కర్ట్స్ స్త్రీల తొడలను లావుగా కనిపించేలా చేస్తే.. ఎ లైన్ డ్రస్సులు మాత్రం కింద బాగా వదులుగా కనిపిస్తాయి. ఇవి మీ నడుముపై ఫోకస్ పెరిగేలా చేస్తాయి. దీంతో మిమ్మల్ని కాస్త చిన్నగా కనిపించేలా చేస్తాయి. అందుకే మీరు చిన్నగా కనిపించాలంటే.. ఈ తరహా డ్రస్సులు బెస్ట్ అని చెప్పొచ్చు.

ఈ తరహా ప్యాంట్స్..
మీ తొడలు లావుగా ఉంటే.. మీరు స్లిమ్ గా కనిపించాలంటే.. పొడవు ఎక్కువగా ఉండే ప్యాంట్లను ధరించాల్సి ఉంటుంది. ఇలాంటి పొడుగాటి ప్యాంట్లు మీరు చిన్నగా ఉన్నారని భ్రమించేలా చేస్తాయి. అందుకే మీ ప్యాంట్లు ఏ మాత్రం పొడుగైనా వాటిని పైకి మడిచి పెట్టడం ఆపి కాలి మడమ వరకూ ఉండేలా చూసుకోండి.

పాయింటెడ్ హీల్స్..
మీ తొడలు, కాళ్లు ఎలా ఉన్నాయనేదే ముఖ్యం కాదు.. మీరు వేసుకునే చెప్పులపైనా ఆధారపడి ఉంటుంది. డిజైనర్, ఎంబ్రాయిడరీ లేదా కాస్త వెడల్పుగా ఉండే షూ ధరించడం వల్ల మీరు మరింత లావుగా కనిపించొచ్చు. కాబట్టి మీరు చిన్నగా ఉండే పాయింటెడ్ హీల్స్ వేసుకుంటే మీ కాళ్లు చిన్నగా కనిపించొచ్చు. అంతేకాదు ఇవి మీ కాళ్లను మరింత పొడుగ్గా కనిపించే ఫీలింగును కలిగిస్తాయి.

చిన్నగా కనిపించేలా..
ఎవరైతే లావుగా ఉంటారో.. వారు తమ బాడీని పట్టి ఉంచే దుస్తులనే కాకుండా ఫ్లోయీ ఫ్యాబ్రిక్ దుస్తులను ధరించినా కూడా చాలా అందంగా కనిపిస్తారు. మందం తక్కువగా ఉండి గాలికి ఎగురుతూ ఉండే డ్రస్సుల వల్ల మీరు ఎంత లావు ఉన్నారనే విషయం బయటకు తెలీకుండా చేస్తుంది.
అమ్మాయిలు తొడల భాగంలో కొవ్వును తగ్గించుకునేందుకు.. ఆ భాగంలో లావు కనిపించడకుండా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నించొచ్చు. అయితే కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఫాలో అయితే లావు తగ్గడంతో పాటు కాస్త సన్నగా కనిపించడంతో పాటు కాస్త మంచి లుక్ కూడా మీ సొంతమవుతుంది. ఈ సందర్భంగా మీ తొడలు చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలంటే.. తొడ భాగం సన్నగా కనిపించేలా ఈ అవుట్ ఫిట్స్ ట్రై చేయండి.