For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్! మన ప్రియాంక బ్రిటన్ రాచకుటుంబ వివాహ వేడుకలో అదిరిపోయిందండోయ్!!

|

ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతిష్టాత్మకమైన వేడుకల్లో ఇంగ్లాండ్ రాజకుటుంబంలో జరిగిన వివాహమహోత్సవాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. అటువంటి వేడుకకు ఆహ్వానం అందుకోవడమంటే మామూలు మాట కాదు. ఈ అరుదైన ఘనతను ప్రియాంక చోప్రా దక్కించుకుంది. ఈ విషయం తెలిసినప్పటి నుండి అభిమానులందరూ ప్రియాంక వివాహానికి ఏ విధంగా అలంకరించుకుని హాజరవ్వబోతుందో అని ఉత్కంఠగా, ఊపిరి బిగబట్టి ఎదురుచూసారు. విండ్సర్ లోని సెయింట్ జార్జ్ చాపెల్ లో వైభవోపేతంగా జరిగిన ప్రిన్స్ హ్యారి మరియు మేఘన్ మార్కెల్ ల వివాహ వేడుకలో, జార్జ్ మరియు అమల్ క్లూని, డేవిడ్ మరియు విక్టోరియా బెకమ్ వంటి లబ్ధప్రతిష్టులతో పాటుగా మన ప్రియాంక కూడా పాలుపంచుకుంది.

అయితే, ఆమె ఏ విధమైన అలంకరణతో సిద్ధమైంది?

ప్రియాంక తన వాడివేడి ధోరణితో అభిమానులను ఆకట్టుకోవడంలో సిద్ధహస్తురాలు.ఇంతకుమునుపే మెట్ గాలాలో,రాల్ఫ్ లారెన్ వారి వైన్ రెడ్ గౌన్లో మెరిసిన ప్రియాంక, ఇప్పుడు మళ్ళీ మనని రాజరిక ఠీవి ఉట్టిపడుతున్న లావెండర్ రంగు సూట్లో అలరించింది.

And Finally, We Got To See What Priyanka Wore At The Royal Wedding

ఈ డ్రెస్సును ఇంగ్లండ్ వాసులకు అత్యంత అభిమానపాత్రురాలైన వివియన్నే వెస్ట్ వుడ్ రూపొందించింది. ఈ దుస్తులు ఆమె యొక్క తీరైన అంగసౌష్టవానికి తగినట్లుగా అమరాయి. ఆమె ధరించిన బ్లేజర్ యొక్క ఎసిమిట్రికల్ నెక్ లైన్ మరియు ఒరిగామి తీరులో ముడుతలతో ఉన్న లాపెల్ మతిపోగొట్టాయనే చెప్పుకోవాలి.

బ్రిటిష్ రాచరిక వివాహాలకు అమలుపరిచే డ్రెస్ కోడ్ కు అనుగుణంగా, ప్రియాంక తన అద్భుతమైన దుస్తులకు జతగా ప్రముఖ డిజైనర్ ఫిలిప్ ట్రేసి రూపొందించిన పర్పుల్ ఛాయా కలిగిన హ్యాట్ ధరించింది. ఈయన ఇదే వివాహ సందర్భంగా 20 వరకు హ్యాట్ లు రూపొందించారు. ఈ హ్యాట్ వలన ప్రియాంక రూపురేఖలను రమ్యమనోహరంగా మార్చేసింది.

ఈ సందర్భానికి ప్రియాంక, తన దుస్తులకు సరిపోయే పర్పుల్ ఛాయలున్న లిప్ షేడ్ మరియు ఐ షెడ్ ను వినియోగించింది.నక్షత్ర ఆకారంలోని ఆమె చెవి దిద్దులు మరియు జిమ్మీ ఛూ వారి పాదరక్షలు ఆమె అందానికి వన్నె తెచ్చాయి.

And Finally, We Got To See What Priyanka Wore At The Royal Wedding

మన ప్రియాంక హుందాతనానికి నిలువెత్తు రూపంలా ఉందికదూ? ప్రియాంక తన సోయాగంతో యావద్భారతీయులకు గర్వకారణంగా మారింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి.

English summary

And Finally, We Got To See What Priyanka Wore At The Royal Wedding

We had all been waiting with the bated breath for what actress Priyanka Chopra would be wearing at the royal wedding of the year. And well, she is spotted wearing a regal and structured monochromatic lavender suit by Britain's favourite designer, Vivienne Westwood. She complements her stunning look with a darker purple hat by the legendary hat designer, Philip Treacy.
Story first published: Monday, May 21, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more