Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అందాల అనుష్క అందాలు గాలికే శరత్కాల పరిమళాన్ని అద్దుతున్నాయి!
అందాల అనుష్క అందాలు గాలికే శరత్కాల పరిమళాన్ని అద్దుతున్నాయి!
అనుష్క శర్మ చుట్టూ ఉన్న చెట్ల ఆకులు ఎప్పుడో గోధుమ వర్ణంలోనికి మారిపోయాయి. సోషల్ మీడియాలో ఈమె ఇప్పటికే శరదృతువు ఆగమనాన్ని ప్రకటించింది. ఈ నటీమణి త్వరలో విడుదల కాబోతున్న తన "సుయి ధాగా" సినిమా పనులలో తలమునకలై ఉన్నప్పటికీ, విశ్రాంతి దొరికినప్పుడల్లా తన అందాలను ఆరేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు.
గత కొన్నాళ్లుగా ఆమె ఎక్కువగా డెనిమ్స్ మరియు చురుక్కుమనే టీ-షర్ట్ లలో దర్శనమిస్తున్నప్పటికి, కొంచెం దారి మళ్ళీ యాభైయ్యవ దశకంలో శీతాకాల సొగసును తలపించే అద్దాలతో ఉన్న క్లాస్సి దుస్తులను ధరించి మతిపోగొట్టేసింది.
మ్యూట్ టోన్ దుస్తులపై వేసుకున్న క్రిస్ప్ బ్రౌన్ కలర్ ఓవర్ కోట్ ధరించిన ఆమె రూపం చూస్తుంటే గాలికి తాజా పరిమళాలద్దుతుందా! అనిపించకమానదు. ఆకుపచ్చ- గోధుమ వర్ణం యొక్క సమ్మేళనం ఉన్న చెట్ల ముందు నిల్చొని పోజులిస్తున్న ఆమెను చూస్తుంటే, సెలవులను ప్రశాంతంగా గడపడానికి ఎక్కడికో వెళ్లినట్లుంది. కానీ ఈ క్షణం ఆమె ఊపిరి సలపనంత బిజీగా ఉందనేది మాత్రం నిజం.

అనేక మనోభావాలను తన ముఖంలో పలికించగల సత్తా ఉన్న అనుష్కను ఈ ఫోటోలో చూస్తుంటే, సుదూరంగా ఉన్న ఆకాశంతో మూగబాసలాడుతూ, దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉంది. చాలా తక్కువ మేకప్ లో కూడా ఉల్లాసంగా ఉంది.గాలికి వదిలేసి ఆమె కురులు ఆమె సొగసుకు సిరులద్దుతున్నట్లున్నాయి. కేవలం వాచ్ మాత్రమే యాక్ససరీగా ధరించింది.
పగటిపూటే విరగబూసిన శరత్కాల వెన్నెల లాంటి అనుష్క రూపానికి, పదికి పది మార్కులు ఇవ్వొచ్చు. రాబోయే ఋతువు యొక్క సోయగానికే ఆమె ఒక ప్రేరణగా నిలిచింది. ఉదయాన్నే ఆమె రూపం చూస్తూ మేల్కొంటే, మన శరీరాన్ని మొరాయింపజేసే బద్దకం పటాపంచలయిపోతుంది. ఆమె తన అందంతో మనను చంపేస్తోందంటే అతిశయోక్తి కాదేమో కదా!



Click it and Unblock the Notifications