తమ పెళ్ళి రిసెప్షన్ రోజున మెరిసిపోయిన బాలీవుడ్ తారలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

స్టైల్ విషయానికొస్తే, అది సాధారణ ఎయిర్ పోర్ట్ లుక్ అయినా లేదా అవార్డ్ ఫంక్షన్ కి తయారవటం అయినా బాలీవుడ్ ఎప్పుడూ డిమాండ్లోనే ఉంటుంది.తారలు తమ పెళ్ళిదుస్తులకైతే మరింత గ్రాండ్ గా, స్టైల్ గా తయారవుతారు.

ఇక్కడ తమ పెళ్ళి రిసెప్షన్ కి రాయల్ గా స్టైల్ కాబడిన తారల లిస్టు,వారి స్టైల్స్ గురించి పరిచయం చేస్తున్నాం.ఈ సందర్భాలలో తారలు తమ మేటి స్టైల్స్ లో కన్పిస్తారు. వారి పెళ్లి రిసెప్షన్ లుక్స్ ను ఇప్పుడు చూద్దాం.

ముక్కు సర్జరీలతో ముఖారవిందం మార్చుకున్న బోల్డ్ బ్యూటీస్

సోహా అలీ ఖాన్

సోహా అలీ ఖాన్

ఈ పటౌడీ యువరాణి, సోహా అలీఖాన్ తన రిషెప్షన్ రోజు చాలా అందంగా, ఉత్సాహంగా కన్పించారు. ఆమె సంజయ్ గార్గ్ డిజైన్ చేసిన అందమైన పింక్ మరియు క్రీమ్ రంగు లెహంగా ధరించారు. చేతులకి మరియు పాదాలకి గోరింటాకు పెట్టుకున్నారు. సాదా హెయిర్ స్టైల్ మరియు సరిపోయేంత మేకప్ తో తన రిసెప్షన్ లుక్ ను పూర్తిచేసారు.

కరీనా కపూర్

కరీనా కపూర్

పటౌడీ యువరాణి సోహాలాగానే తన వదిన కరీనా కపూర్ కూడా పెళ్ళి రిసెప్షన్ లో చాలా పొందికగా రాజరిక దుస్తుల్లో కన్పించారు. పటౌడి బేగం అయిన ఆమె ఢిల్లీ,ముంబై రిసెప్షన్లలో రెండిటిలో సమానంగా అద్భుతంగా కన్పించారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రస్ లు ఒక ఎరుపు, మరొకటి పింక్ రంగుల్లో ఆమె లుక్ ను మరింత అద్భుతంగా మార్చివేసాయి.

విదేశాల్లో పుట్టి ఇండియాలో ఇమేజ్ సంపాదించుకున్న స్టార్స్

జెనీలియా డిసౌజా దేశ్ ముఖ్

జెనీలియా డిసౌజా దేశ్ ముఖ్

బాలీవుడ్ లో జెనీలియా మరియు రితేష్ ల పెళ్ళి చాలా అందమైన పెళ్ళిళ్ళలో ఒకటి. జెనీలియా ఆమె పెళ్ళి రిసెప్షన్ సాయంత్రం చాలా ముద్దుగా కన్పించారు. ఫల్గుంజ్ మరియు షేన్ పీకాక్ కౌట్యూర్ వారి ముదురు పీచ్ లెహంగా చోళీ ధరించారు. దానికి అందమైన బంగారు ఎంబ్రాయిడ్రరీ వుండి, ఆ ప్రత్యేక రోజు డ్రస్ మ్యాచింగ్ నగలతో అదిరిపోయింది.

ఈషా డియోల్

ఈషా డియోల్

భరత్ తఖ్తానీని పెళ్ళాడిన ఈషా డియోల్ తన వెడ్డింగ్ రిసెప్షన్ రాత్రి చాలా అందంగా, దేవతలా కన్పించారు. పొడి పింక్ లెహంగా, వజ్రాలు మరియు ఎమరాల్డ్ నగలను ధరించారు. మొత్తం స్టైల్ అంతా రంగురంగుల్లో అందంగా మెరిసిపోయినా, రాళ్ళు పొదిగిన లెహంగా చూపులు తిప్పుకోనివ్వలేదు.

ఆమ్నా షరీఫ్

ఆమ్నా షరీఫ్

పెళ్ళి రిసెప్షన్ నాటి రాత్రి ఆమ్నా లుక్ చాలా అందమైనది.మెరిసే నీలి వెల్వెట్ చోళీ, పింక్ దుపట్టాతో కలిపి ధరించారు.లెహంగాపై చేతులతో చేసిన రాగి ఎంబ్రాయిడ్రరీ, దానికి కుందన్ మరియు బంగారు నగలతో అలంకరణ చాలా అందంగా అమరింది.

అసిన్

అసిన్

పెళ్ళి రిసెప్షన్ కి అసిన్ లుక్ మాకు అన్నిటికన్నా ఇష్టమైనది. కేవలం పేస్టెల్ షేడెడ్ లెహంగా,దానిపై చేసిన అద్భుతమైన ఎంబ్రాయిడ్రరీ లేదా దానికి సరిపోయే నగలు వల్లనే మాకు ఇది నచ్చలేదు,ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజున ఆమె ధరించిన బట్టలలో సింప్లిసిటీ ఎక్కువ ఆకర్షించింది.డ్రస్ మరియు నగలు కలిసి క్లాస్ ఇంకా సింపుల్ లుక్ గా నిలిచింది.

English summary

Bollywood Actresses Wedding Look, Bollywood Actresses Reception Look, Kareena Kapoor Reception Attire

Bollywood Actresses Wedding Look, Bollywood Actresses Reception Look, Kareena Kapoor Reception Attire, Actresses who stole the show with their wedding reception look. Have a look.
Subscribe Newsletter